Wednesday, April 15, 2020

ఓమ్ ' నమ శివాయ' పంచాక్షరీ మహా మంత్ర వైభవము

ఓమ్ ' నమ శివాయ' పంచాక్షరీ మహా మంత్ర వైభవము








యజుర్వేదములో " రుద్రాధ్యాయం"లో ' నమకం' లో

8 వ అనువాకంలో ఈ పవిత్ర మంత్ర ప్రస్తావన వుంది !!

!! ఓమ్ హర హర హర హర ఓమ్ !!

" నమ స్సోమాయచ, రుద్రాయచ, నమ స్తామ్రాయచారుణా

యచ, నమ శ్శఙ్గాయచ, పశుపతయేచ, నమ ఉగ్రాయచ,

భీమాయచ, నమెా అగ్రేవధాయచ, దూరేవధాయచ, నమెా

హన్త్రేచ, హనీయసేచ, నమెా వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారా

య నమశ్శంభవేచ, మయెాభవేచ, నమశ్ళంకరాయచ, మయ

స్కరాయచ, " నమః శివాయ"చ శివతరాయచ !! నమస్తీర్థా

యచ, కూల్యాయచ, నమః పార్యాయచావార్యాయచ, నమః

ప్రతరణాయచో త్తరణాయచ, నమ ఆతార్యాయచాలాద్యాయచ

నమశ్శష్ప్యాయచ, ఫేన్యాయచ, నమస్సికత్యాయచ ప్రవాహ్యాయచ !!

భావము :- సదా శక్తి స్వరూపిణి యైన ఉమాదేవితో కూడి

యుండి సంసార దుఃఖము నుండి విముక్తిని కలిగించు

రుద్రునకు నమస్కారము! తామ్ర వర్ణము మరియు అరుణ

కాంతితో ప్రకాశించు రుద్రునకు నమస్కారము! సమస్త జీవులకు రక్షకుడై శాశ్వతానందం నొసగు రుద్రునకు నమస్కారము! ఉగ్రమూర్తి భయెాత్పాతం కలిగించు రుద్రునకు నమస్కారము! ఎదుటి శత్రువును, దూరమున్న

శత్కువును కూడా నిర్మూలించ గల రుద్రునకు నమస్కారం!

మృత్యువునకు, మృత్యుంజయునకు కూడా నమస్కారము!

వృక్షములందు, వృక్షములలోని పచ్చని ఆకులయందు గల

రుద్రునకు నమస్కారము! ఓంకార స్వరూపునకు నమస్కారము! ఇహ పరములలో సుఖశాంతులు ప్రసాదించు

రుద్రునకు నమస్కారము! శుభముల నిచ్చువానికి, శుభము

లను మించి శుభమగు శాశ్వతానంద స్థితినిచ్చు " శివునకు

నమస్కారం! " పుణ్యతీర్థములు, వాటియందు గల దేవతా

స్వరూప రుద్రునకు నమస్కారము! ఆవలి ఒడ్డున వున్న వానికి

ఈవల ఒడ్డున వున్నవానికి నమస్కారము! సంసార సాగరం

నుండి తరింపజేయువానికి వమస్కారం! జన్మసంసార హేతు

వైన కర్మ ఫలములను ప్రసాదించు రుద్రునకు నమస్కారము!

లేతపచ్చిక రూపమున, నీటిపై నురుగు రూపమున, నదీ

ప్రవాహమునందు, ఇసుక తిన్నెలయందు గల రుద్రరూపులకు

నమస్కారము !!

మన వేద మంత్రాలలో ఎంతటి మహాత్వం వుందో తెలుసుకుని

తరిద్దాం !! హిందువులుగా గర్విద్దాం !! శుభమ్ భూయాత్ !!

మీ సామర్ల వేంకటేశ్వర్లు

ఆధ్యాత్మిక సాధకుడు

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS