భద్రచలంశిఖరం, దాని పై ఉన్న సుదర్శన పెరుమాళ్ ఫోటోని అందరూ జాగ్రత్త పరుచుకుని , చక్కగా ఫ్రేమ్/ లామినేషన్ చేసి మీ మీ పూజా గృహంలో నిత్యం పూజించండి చాలా మంచిది. పైన ఉన్న సుదర్శన చక్రం ఎవరో మానవులు తయారు చేసినది కానీ కాదు సుమా. అది దేవతా నిర్మితమైనది. శ్రీ రామదాసు దేవాలయం నిర్మించే సమయంలో కారాగారంలో తురుష్కుల ద్వారా వుండవలసి వచ్చింది. చివరి భాగం ఈ సుదర్శన చక్రం స్థానం ఖాళీగా ఉండి పోయింది. శ్రీ రామదాసు కారాగారం లో ఉన్న సమయంలో అక్కడ ఉన్న అప్పటి ఆలయ పాలకులు వేరే కలశం అక్కడ ఉంచగా అది ప్రతి చిన్నపాటి గాలికి, వర్షానికి క్రింద పడిపోతు అస్తమాను అపచారం జరిగేది. ఈ సంఘటనకు అక్కడ ఉన్నవారంతా చాలా ఖేద చెందేరు. ఈ విషయం కారాగారం లో ఉన్న రామదాసుకు కూడా చేరి ఆయన అక్కడ అన్న పానాదులు ముట్టుకునే వారు కాదు. తదుపరి ఆయన కారాగారం నుండి బయటకు వచ్చాక ఆయన నిద్రలేని రాత్రుళ్ళు ఎన్నో గడిపారు. తర్వాత ఒక రోజు ఆయనకు స్వప్నము లో శ్రీ రాముల వారు ప్రత్యక్షమై ఆ ఆలయ శిఖరం పై పెట్టవలసిన సుదర్శన చక్రం తనకు గోదావరి నదిలో లభిస్తుందని చెప్పి అంతర్ధానం అయ్యారు భగవంతుడు. *అంతే ఇంకేముంది మన రామదాసు తెల్లవారుజామున అందరికి సదరు విషయం చెప్పి తాను గోదావరిలో స్నానాకి వెళ్లి నీటిలో మునిగి పైకి లేవగానే ఆయన చేతిలో ఇప్పుడు మీరు చూస్తున్న సుదర్శన చక్ర సహిత పెరుమాళ్లు రెండు చేతులపై తెలియాడుతూ లభించింది.* ఇంక ఆనందంతో వేద మంత్రాలతో ఆదే రోజు శ్రీ వారి ఆలయ శిఖరం పై దానిని ప్రతిష్ట చెయ్యటం జరిగింది. అది ఈనాటికి అలాగే వుంది. మళ్ళీ శిఖరానికి అపశృతి అన్న మాట లేదు. సదరు విషయం తురుష్కుల హుకుమత్ కి కూడా తెలిసి ఆయన కూడా సీతా రాములవారిని దర్శించుకుని కానుకలు మొక్కులు చెల్లించుకొని. శ్రీ రామదాసుని బంధించి వుంచినందుకు మాఫీ కోరుకొని వెళ్లారుట ఆ జహాపాన. క్లుప్తంగా ఇది ఆ గోపురం మహత్తు. పై విషయం చదివిన ప్రతి వారికీ కూడా శ్రీ సీతారాముల వారి కృపా కటాక్షములు కలుగు గాకా. జై శ్రీరామ్. మంగళ మహాత్.
Sunday, April 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
RECENT POST
నవ విధ శాంతులు
నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం: కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...
POPULAR POSTS
-
కార్తెలు-వాటి వివరణ మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు.తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు.తెల...
-
అశ్విని నక్షత్రము గుణగణాలు అశ్వినీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్విన...
-
విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం ఇక్కడే... i భారత దేశం అనేక ఆలయాలకు నిలయం. ఇక్కడ శైవం, వైష్ణవం తో ...
-
కదంబ వృక్ష మహిమ : కదంబవృక్షాన్ని రుద్రాక్షాంబ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం ఆంథోసెఫాలస్ చినెన్సిస్. ఇది ఆకురాల్చదు. ఎప్ప...
-
సకల దేవతల మంత్రాలు మంత్ర తంత్రాలు మనిషి జీవితంలోని గ్రహదోషాలకు పరిష్కార మార్గాలు చూపిస్తాయి. దేనికి ఏ మంత్రం పఠిస్తే ఎలాంటి పరిష్కార మార్...
-
లక్ష్మీ గవ్వల ప్రాముఖ్యత. లక్ష్మి గవ్వల పూజ - ఉపయోగాలు . Laxmi Pasupu Gavvalu.The Importance of Laxmi Gavvalu Sri Maha Lakshmi Pasupu ...
-
నక్షత్ర ఆధారిత ఉపశమనాలు వివరణ జన్మ నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకొని దానికి సరిపడు ఉపశమనాలను మీకు అందిస్తున్నాను. జ్యోతిష శాస్త్రము మ...
-
సలేశ్వరం- శ్రీశైలం అన్ని సార్లు వెళ్ళారు . కానీ ప్రక్కన ఉన్న అత్బుతమైన సలేశ్యరం చూసారా. సలేశ్వరం (Saleshwaram) ఇ...
-
శ్రీ దత్తాత్రేయ దేవాలయం...ఎత్తిపోతల. అతి ప్రాచీన, కార్త్యవీర్యార్జున పునః ప్రతిష్టిత దత్తక్షేత్రం ఎత్తిపోతల బాహ్య ప్రపంచానికి అంతగా త...
-
బీజాక్షర సంకేతములు ఓం - ప్రణవము సృష్టికి మూలం హ్రీం - శక్తి లేక మాయా బీజం ఈం - మహామాయ ఐం - వాగ్బీజం క్లీం - మన్మధ బీజం సౌ...
No comments:
Post a Comment