Thursday, March 10, 2022

లలితా అష్టోత్తర స్తోత్రము

లలితా అష్టోత్తర స్తోత్రము  


లలితా అష్టోత్తర స్తోత్రం ఒక అద్భుత స్తోత్రం. ఇందులో ప్రతి నామము 16 అక్షరాలతో ఉంటుంది. (షోడషాక్షారి), ప్రతినామము నమో నమః తో ముగుస్తుంది. ప్రతి నామము కి
ఓం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః అనే బీజాక్షరాలు జోడించి చదవవచ్చు.  ఈ స్తోత్రం లోని నామాలని అర్థాలతో అనుసంధానం చేసుకుంటే,అవి ఒకో విషయాన్ని చెబుతున్నాయి. అలా ఒకే విషయం పై ఉన్న నామాలని ఒక్క చోట చేర్చి, పేర్చి పెడితే, ఇదిగో అవి ఈ క్రింద చూపిన విధంగా 16 విషయాలు గా వెలికి వచ్చాయి. ఇక 108 నామాలని పై విషయాల ఆధారంగా పేర్చా. స్తోత్రం లో ఉన్న క్రమ సంఖ్యని అలానే ఉంచా.
ఇది బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వ్యాఖ్యల యధాతధంగా వివరింపబడుతోంది. (నాకంత జ్ఞానం ఎక్కడిది లెండి)

1) అమ్మ వ్యక్త సమయం 1
2) అమ్మ స్తుల రూప వర్ణన 2
3) అమ్మ సూక్ష్మ రూప వర్ణన పంచదశి మంత్రం గురించి  1 
4) అమ్మ సౌందర్య లావణ్యాల గురించి 36 నామాలు 
5) అమ్మ నివాస స్థానం  9 నామాలు
6) అమ్మ స్వభావము 8 నామాలు
7) అమ్మ స్థితి  5 నామాలు
8) అమ్మ ప్రేమ 3 నామాలు
9) అమ్మ ఆశ  1 నామము
10) అమ్మ పని 1 నామము
11) అమ్మ వంశం అమ్మ పుట్టిన ఇల్లు 1 నామము
12) అమ్మ ఆరాధనా ఫలం 2 నామాలు
13) అమ్మ మెట్టిన ఇల్లు, 1 నామము
14) అమ్మ తోబుట్టువు 1 నామము 
15) అమ్మ పతి గురించి 1 నామము 
16) అమ్మ మహిమ 15 నామాలు
17) అమ్మ ఆగ్రహము పరాక్రమం 10 నామాలు
18) అమ్మని సేవిస్తున్న వారు 10 నామాలు 

1) అమ్మ వ్యక్త సమయం 

చిదగ్నికుండసంభూతసుదేహాయై నమో నమః! 

2) అమ్మ స్తుల రూప వర్ణన 

లసన్మరకతస్వచ్ఛవిగ్రహాయై నమో నమః! 
మహాతిశయసౌందర్యలావణ్యాయై నమో నమః! 

3) అమ్మ సూక్ష్మ రూప వర్ణన పంచదశి మంత్రం గురించి 

సదా పంచదశాత్మైక్య స్వరూపాయై నమః

4) అమ్మ స్థూల శరీరము  గురించి

వజ్రమాణిక్యకటకకిరీటాయై నమో నమః! 
కస్తూరీతిలకోల్లాసనిటిలాయై నమో నమః! 
భస్మరేఖాంకితలసన్మస్తకాయై నమో నమః! 
వికచాంభోరుహదలలోచనాయై నమో నమః! 
శరచ్చాంపేయపుష్పాభనాసికాయై నమో నమః!  
లసత్కాంచనతాటంకయుగలాయై నమో నమః! 
మణిదర్పణసంకాశకపోలాయై నమో నమః 
తాంబూలపూరితస్మేరవదనాయై నమో నమః
సుపక్వదాడిమీబీజరదనాయై నమో నమః! 
కంబుపూగసమచ్ఛాయకంధరాయై నమో నమః! 
స్థూలముక్తాఫలోదారసుహారాయై నమో నమః! 
గిరీశబద్ధమాంగల్యమంగలాయై నమో నమః! 
పద్మపాశాంకుశలసత్కరాబ్జాయై నమో నమః! 
పద్మకైరవమందారసుమాలిన్యై నమో నమః!  
సువర్ణకుంభయుగ్మాభసుకుచాయై నమో నమః! 
రమణీయచతుర్బాహుసంయుక్తాయై నమో నమః!  
కనకాంగదకేయూరభూషితాయై నమో నమః! 
బృహత్సౌవర్ణసౌందర్యవసనాయై నమో నమః! 
బృహన్నితంబవిలసజ్జఘనాయై నమో 
నమః!  సౌభాగ్యజాతశృంగారమధ్యమాయై నమో నమః!  దివ్యభూషణసందోహరంజితాయై నమో నమః! పారిజాతగుణాధిక్యపదాబ్జాయై నమో నమః! 
సుపద్మరాగసంకాశచరణాయై నమో నమః! 
సనకాదిసమారాధ్యపాదుకాయై నమో నమః! – 
రమాభూమిసుతారాధ్యపదాబ్జాయై నమో నమః – 
లోపాముద్రార్చితశ్రీమచ్చరణాయై నమో నమః 
రాజరాజార్చితపదసరోజాయై నమో నమః – 
కామకోటిమహాపద్మపీఠస్థాయై నమో నమః! –  
బ్రహ్మోపేంద్రశిరోరత్నరంజితాంఘ్ర్యై నమో నమః! – 
శశాంకఖండసంయుక్తమకుటాయై నమో నమః! – 
మత్తహంసవధూమందగమనాయై నమో నమః! – 
సహస్రసూర్యసంయుక్తప్రకాశాయై నమో నమః – 
సహస్రరతిసౌందర్యశరీరాయై నమో నమః –  
సుమబాణేక్షుకోదండమండితాయై నమో నమః – 
నిత్యయౌవనమాంగల్యమంగలాయై నమో నమః – మహాదేవసమాయుక్తశరీరాయై నమో నమః – 

5) అమ్మ నివాస స్థానం 

రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమః
చక్రరాజమహాయంత్రమధ్యవర్తిన్యై నమో నమః! –  
రత్నచింతామణిగృహమధ్యస్థాయై నమో నమః  
మహాపద్మాటవీమధ్యనివాసాయై నమో నమః – 
సమస్తహృదయాంభోజనిలయాయై నమో నమః – అనాహతమహాపద్మమందిరాయై నమో నమః – 
సహస్రారసరోజాతవాసితాయై నమో నమః – 
శ్రీసుధాబ్ధిమణిద్వీపమధ్యగాయై నమో నమః – 
శ్రీషోడశాక్షరీమంత్రమధ్యగాయై నమో నమః – 

6) అమ్మ స్వభావం

భక్తరక్షణదాక్షిణ్యకటాక్షాయై నమో నమః! 
హానివృద్ధిగుణాధిక్యరహితాయై నమో నమః – 
అభ్రకేశమహోత్సాహకారణాయై నమో నమః -  
మహేశయుక్తనటనతత్పరాయై నమో నమః – 
నిజభర్తృముఖాంభోజచింతనాయై నమో నమః – 
వృషభధ్వజవిజ్ఞానభావనాయై నమో నమః – 
సాక్షాత్ శ్రీదక్షిణామూర్తిమనోజ్ఞాయై నమో నమః – 
మహాదేవరతౌత్సుక్యమహాదేవ్యై నమో నమః – 

7) అమ్మ స్థితి

జాగ్రత్స్వప్నసుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః – సమస్తదేవదనుజప్రేరికాయై నమో నమః 
సర్వోపాధివినిర్ముక్తచైతన్యాయై నమో నమః –  
అనాద్యంతస్వయంభూతదివ్యమూర్త్యై నమో నమః – 
దక్షప్రజాపతిసుతవేషాఢ్యాయై నమో నమః – 

8)  అమ్మ ప్రేమ

అనంగజనకాపాంగవీక్షణాయై నమో నమః! –
మత్తేభవక్త్రషడ్వక్త్రవత్సలాయై నమో నమః! – 
అవ్యాజకరుణాపూరపూరితాయై నమో నమః – 

9) అమ్మ ఆశ

భూతేశాలింగనోద్భూతపులకాంగ్యై నమో నమః! –

10) అమ్మ పని

సృష్టిస్థితితిరోధానసంకల్పాయై నమో నమః  - 

11) ఇక అమ్మ వంశం పుట్టిన ఇల్లు

హిమాచలమహావంశపావనాయై నమో నమః! 

12) .అమ్మ  ఆరాధనా ఫలం

అంతర్ముఖజనానందఫలదాయై నమో నమః! -
పతివ్రతాంగనాభీష్టఫలదాయై నమో నమః –

13) అమ్మ మెట్టిన ఇల్లు

శంకరార్ధాంగసౌందర్యశరీరాయై నమో నమః!  –  

14) అమ్మ తోబుట్టువు

శ్రీనాథసోదరీభూతశోభితాయై నమో నమః – 
15).అమ్మ పతి గురించి

శశాంకశేఖరప్రాణవల్లభాయై నమో నమః! 

16 ) అమ్మ మహిమ

శ్రీకంఠనేత్రకుముదచంద్రికాయై నమో నమః! – 
లీలాకల్పితబ్రహ్మాండమండలాయై నమో నమః! – 
ఏకాతపత్రసామ్రాజ్యదాయికాయై నమో నమః! – 
మహాపా(తా)పౌఘపాపానాం వినాశిన్యై నమో నమః  - 
పునరావృత్తిరహితపురస్థాయై నమో నమః – 
భావనామాత్రసంతుష్టహృదయాయై నమో నమః – 
సత్యసంపూర్ణవిజ్ఞానసిద్ధిదాయై నమో నమః – 
శ్రీలోచనకృతోల్లాసఫలదాయై నమో నమః 
నామపారయణాభీష్టఫలదాయై నమో నమః – 
ధాత్ర్యచ్యుత సురాధీశ సుఖదాయై నమః
జన్మమృత్యుజరారోగభంజనాయై నమో నమః – 
విధేయముక్తవిజ్ఞానసిద్ధిదాయై నమో నమః – 
కామక్రోధాదిషడ్వర్గనాశనాయై నమో నమః – 
సర్వవేదాంతసంసిద్ధసుతత్వాయై నమో నమః – 
శ్రీవీరభక్తవిజ్ఞాననిదానాయై నమో నమః 

17) అమ్మ ఆగ్రహము అమ్మ పరాక్రము

దుష్టభీతిమహాభీతిభంజనాయై నమో నమః – 
దక్షాధ్వరవినిర్భేదసాధనాయై నమో నమః –  
చంద్రశేఖరభక్తార్తిభంజనాయై నమో నమః –
భండదైత్యమహాసత్త్వ నాశనాయై నమో నమః – 
క్రూరభండశిరచ్ఛేదనిపుణాయై నమో నమః –  
ధాత్ర్యచ్యుత సురాధీశ సుఖదాయై నమః
చండముండనిశుంభాదిఖండనాయై నమో నమః – 
రక్తాక్షరక్తజిహ్వాదిశిక్షణాయై నమో నమః – 
మహిషాసురదోర్వీర్యనిగ్రహాయై నమో నమః -  
అశేషదుష్టదనుజసూదనాయై నమో నమః – 

18) అమ్మని సేవిస్తున్న వారు

సచారమరరమావాణీవీజితాయై నమో నమః! – 
శచీముఖ్యామరవధూసేవితాయై నమో నమః!
అమృతాదిమహాశక్తిసంవృతాయై నమో నమః! –  
దేవర్షిభిస్స్తూయమానవైభవాయై నమో నమః! – 
కలశోద్భవదుర్వాసపూజితాయై నమో నమః! – 
వందారుజనసందోహవందితాయై నమో నమః! – 
నితాంతసచ్చిదానందసంయుక్తాయై నమో నమః –  
వాణీగాయత్రీసావిత్రీసన్నుతాయై నమో నమః – 
మాతృమండలసంయుక్తలలితాయై నమో నమః హయమేధాగ్రసంపూజ్యమహిమాయై నమో నమః –

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS