Thursday, March 10, 2022

వాస్తు దోషాలకు తాంత్రిక సలహాలు

 వాస్తు దోషాలకు తాంత్రిక సలహాలు :-💐💐



తూర్పు సింహద్వారం కలవారు..💐

ఇంట్లో వాస్తుదోషాలు కలిగి నివసించేవారు పొందే సమస్యల నుండి విముక్తులు అవుటకు 

యజమాని హస్తంతో గుప్పెడు బియ్యమును ,

గుప్పెడు గోధుములను కొద్దిగా కర్పూరమును 

తెలుపు వస్త్రములో మూటకట్టి ఆదివారం రోజు ఉదయం సింహద్వారం పైన వ్రేలాడకట్టండి .


పడమర సింహద్వారం కలవారు..💐

ఇంటిలో నివసిస్తూ వాస్తులోపాలకు గురియై సమస్యలతొ బాధపడేవాడు యజమాని గుప్పెడుతో బియ్యం 

అంతే సమాన బరువుగల ప్రత్తి గింజలు ,కర్పూరమును నీలివస్త్రములో మూటగా కట్టి సింహద్వారంపై 

శనివారం తగిలించినా దుష్ఫలితముల నుండి విముక్తులై శుభఫలితములు పొందగలరు .


ఉత్తర సింహ ద్వారం కలవారు..💐

గృహములో నివసించేవారు వాస్తులోపాలకు గురియై పడరాని ఇక్కట్లు పడుటచే యజమాని యెక్క 

గుప్పెడు లో పెసలు ,గుప్పెడు బియ్యం ,కర్పూరముల మిశ్రమములను అకుపచ్చ గుడ్డలో మూటగా కట్టి సింహద్వారంపై బుధవారం వ్రేలాడ కట్టండి .

సమస్యలు తీరి సుఖవంతంగా జీవిస్తారు .


దక్షిణ సింహ ద్వారం కలవారు..💐

గృహములో వాస్తులోపాలతో నివసిస్తూ సమస్యలతో సతమతమవుతుంటే యజమాని గుప్పెడుతో 

గుప్పెడు కందులు ,గుప్పెడుబియ్యం ,

కర్పూర మిశ్రమమంతో ఎర్రని గుడ్డలో మూటగా కట్టి సింహద్వారంపై మంగళవారం కట్టితే అశాంతి తొలగి సుఖసంతోషాలతో జీవించగలరు .

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS