బుధవారం, చైత్రశుద్ధ పాడ్యమి, శార్వరీ నామసంవత్సరాది, ఉగాది సందర్భంగా..
@ఉగాది గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం...ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు. https://youtu.be/sBIleR_vuN0
@ఉగాది అంటే యుగం ప్రారంభమైన రోజు. ఈ యుగాదే కాలక్రమంలో ఉగాది గా పిలువబడుతోంది. హిందూ కాలమానంలో మొత్తం మనకు 4 యుగాలున్నాయి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజు, అన్ని గ్రహాలు మేషరాశిలో ఉన్న సమయంలో ప్రారంభమైంది కలియుగం. ఈనాటి ఇంగ్లీష్ క్యాలండర్ ప్రకారం చెప్పాల్సివస్తే, సరిగ్గా 5116-17 ((2015 లో వరకు) సంవత్సరముల క్రితం ఫిబ్రవరి 19-20, 3,102 BCలో శ్రీ కృష్ణ పరమాత్మ అవతరపరిసమాప్తి జరిగిన వెంటనే ద్వారపరయుగం అంతమై, కలియుగం మొదలైంది.
ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలోనే. ఈ కలియుగ ప్రారంభానికి సూచికగా చాంద్రమానాన్ని అనుసరించి మనం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాదిని జరుపుకుంటాం.
ఉగాది ఎలా జరుపుకోవాలి?
ఉగాది నాడు తెల్లవారుఝామునే (సూర్యోదయానికి గంటన్నర ముందు) నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్వచ్ఛమైన నువ్వుల నూనెను శరీరానికి, తలకు పట్టించుకుని, నలుగు పిండితో అభ్యంగన స్నానం చేయాలి.
స్నానం చేశాక కొత్త బట్టలు/కొత్త బట్టలు (కొనే పరిస్థితులు లేకపోతే ఉతికిన బట్టలు), ఆభరణాలు ధరించాలి. కొత్తబట్టలు ధరించాక మీ ఇష్టదైవాన్ని(వినాయకుడు, శివుడు, కృష్ణుడు, రాముడు........ఇలా మీకు ఎవరంటె ఇష్టమో వారిని) పూజించాలి. పూజ చేయడం రాకపోతే ఒక స్తోత్రం చదవండి, అది రాకపోతే ఆ దేవుడి నామం/పేరును చెప్పినా చాలు. భక్తితో ఒక్క నమస్కారం చేసినా చాలు, దేవుడు ఆనందిస్తాడు.
ప్రజలంతా ఉగాది రోజు తమ కుటుంబసభ్యులతో కలిసి వేపచెట్టుకు పసుపు,కుంకుమ పూసి, దాని చుట్టూ ప్రదక్షిణ చేసి, దానినుండి వచ్చే ప్రాణవాయువును తృప్తిగా, దీర్ఘంగా పీలుస్తూ.. ఆ చెట్టునుండి వేప పువ్వును సేకరించుకుని ఇంటికి తెచ్చుకోవాలి. వేపగాలి పీల్చడం వలన గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు మొదలైన ప్రధాన భాగాలు చైతన్యవంతమై, వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
@ేప పచ్చడి/ఉగాది పచ్చడిని పరకడుపున (అంటే ఖాళీ కడుపున) ఉదయం 8 గంటలలోపు సేవిస్తేనే దాని ఔషధ గుణాలు శరీరాన్ని రోగరహితం చేస్తాయని ఆయూర్వేద గ్రంధాలు చెప్తున్నాయి.
సాయంత్రం స్థానిక దేవాలయంలో కానీ, లేక ఇతర పవిత్ర ప్రదేశంలో కానీ పంచాంగశ్రవణం చేయాలి. శ్రవణం అంటే వినడం అని అర్దం. కొత్త ఏడాదిలో దేశం ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఏలాంటి ఫలితాలుంటాయి, పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా పండుతాయి...... మొదలైనవన్నీ పంచాంగశ్రవణంలో చెప్తారు. పంచాంగశ్రవణం చేయడం వల్లనే అనేక దోషాలు తొలగిపోతాయి. గంగా స్నానం చేసిన పుణ్యం వస్తుంది.
దేవాలయంలో కానీ, సాంస్కృతిక కూడలిలో కానీ పంచాంగ శ్రవణం చేయాలి. జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించి తిధి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనే 5 ని "పంచ అంగములు" అంటారు. వీటిని వివరించేదే పంచాంగం. పంచాంగం @్తరముఖంగా_కూర్చుని వినాలని శాస్త్రం.
@ంచాంగశ్రవణంలో సంవత్సర ఫలితాలు, సంక్రాంతి పురుషుడు, నవనాయకులువంటి వారితో పాటు వివిధ రాశులవారి ఆదాయ, వ్యయాలు, రాశిఫలాలు చెప్తారు. పంచాంగ శ్రవణంలో నవగ్రహాలను స్మరించడం వలన చాలా రకాలుగా సత్ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెప్తోంది.
పంచాంగ శ్రవణం ఫలితంగా సూర్యుడివల్ల శౌర్యం, చంద్రుని వల్ల వైభవం, కుజుడి వల్ల సర్వ మంగళాలు, బుధుడివలన బుద్ధి వికాసం, గురువు వలన జ్ఞానం, శుక్రుడి వలన సుఖం, శని వలన దుఖఃరాహ్యితం, రాహువు వలన ప్రాబల్యం, కేతువు వలన ప్రాధాన్యత లభిస్తాయి.
ఉగాది పచ్చడి గురించి శాస్త్రం ఏం చెప్తోంది?
ఉగాది పచ్చడిలో ఆ రోజే కోసిన వేపపువ్వు, బెల్లం, మామిడి ముక్కలు, అరటి ముక్కలు, కొబ్బరి ముక్కలు వేస్తారు. వీటితో పాటు మామిడి చిగురు, అశోక చిగుళ్ళు కూడా వేయాలని శాస్త్రం చెప్తోంది.
@్లో\\ 1
త్వామశోక నరాభీష్ట మధుమాస సముద్భవ
పిబామి శోకసంతప్తాం మామశోకం సదాకురు
అనే @్లోకాన్నిచెప్తూ_తినాలి.
వసంతంలో చిగిర్చిన ఓ అశోకమా! నిన్ను సేవించిన నాకు ఎటువంటి శోకములు(బాధలు) లేకుండా చేస్తావు అని పై శ్లోకం అర్దం.
@్లో\\ 2
శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ\
సర్వారిష్ట వినాశాయ నింబకందలభక్షణం\\
అంటే "ఈ వేప పచ్చడి తినడం వలన గ్రహదోషాలు, ప్రమాదాలు, ఇబ్బందులు, అనారోగ్యం మొదలైన సర్వారిష్టాలు నివారింపబడి, సర్వ సంపదలు, దీర్ఘాయువు, వజ్రంలాంటి దృఢమైన, ఆరోగ్యకరమైన శరీరము లభిస్తాయి" అని పై శ్లోకం అర్దం. #Sri Sarvari Nama Samvatsara Rasi Phalithalu 2020 @ #Adipudi VenkataSivaSaiRam - #శ్రీ శార్వరి నామ సంవత్సర "ఉగాది" శ్రీ శార్వరినామ సంవత్సర పంచాంగ పఠనం#Sri SarvariNama Samvatsara Ugadi Panchangam 20-21 | శ్రీశార్వరినామ సంవత్సర రాశి ఫలాలు# Ugadi Panchangam 2020-2021 (Sri Sarvari Nama Samvatsara Panchangam ) (Telugu New Year) #శ్రీశార్వరినామ సంవత్సర రాశి ఫలాలు , ఉగాది పంచాంగ పఠనం | #(SarvariNama Samvatsara Panchangam ) Rasi Phalalu 2020-21, # ఉగాది పంచాంగ పఠనం 2020-2120, #Ugadi (SarvariNama Samvatsara )Panchangam (#Telugu #New #Year) - 2020 శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు - 2020, Ugadi Panchangam 2020, SarvariNama Samvatsaram Rasi Phalalu (Horoscope), శ్రీ శార్వరి నామ సంవత్సర తెలుగు పంచాంగం 2020, #telugu panchangam #2020, తెలుగు సంవత్సర రాశి ఫలాలు, panchanga patanam, #panchanga sravanam, ఉగాది పంచాంగ శ్రవణం, ఉగాది పంచాంగ పఠనం, శ్రీ శార్వరి నామ సంవత్సర రాశీ ఫలితాఫలాలు#,ప్రముఖ జ్యోతిష్య,వాస్తు నిపుణులు #ఆదిపూడి సాయిరాం గారు #Siddanthi, #Horoscope 2020-2120, Sri SarvariNama Samvatsaram #Predictions by Sri ADIPUDI VENKATA SIVA SAIRAM #Siddanthi, #Mesha Rasi (#Aries Horoscope) మేష రాశి, #Vrushaba Rasi (#Taurus Horoscope) వృషభ రాశి, #Mithuna Rasi (#Gemini Horoscope) మిధున రాశి, #Karkataka Rasi (#Cancer Horoscope) కర్కాటక రాశి, #Simha Rasi (#Leo Horoscope) సింహ రాశి, #Kanya Rasi (#Virgo Horoscope) కన్య రాశి, #Tula Rasi (#Libra Horoscope) తులా రాశి, #Vruschika Rasi (#Scorpio Horoscope) వృశ్చిక రాశి, #Dhanussu Rasi (#Sagittarius Horoscope) ధనస్సు రాశి, #Makara Rasi (#Capricorn Horoscope) మకర రాశి, #Kumba Rasi (#Aquarius Horoscope) కుంభ రాశి, #Meena Rasi (#Pisces Horoscope) మీన రాశి
No comments:
Post a Comment