Saturday, March 28, 2020

శ్రీ లలితా చాలీసా:

శ్రీ లలితా చాలీసా:

లలితామాతాశంభుప్రియా జగతికి మూలం నీవమ్మా
శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం

హేరంబునికి మాతవుగా హరిహరాదుల అవతారం
చండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారం

పద్మరేకుల కాంతులలో బాలత్రిపురసుందరిగా
హంసవాహనారూఢిణిగా వేదమాతవైవచ్చితివి

శ్వేత వస్త్రముధరించి అక్షరమాలను పట్టుకొని
భక్తిమార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి

నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ
ఆదిభిక్షువై వచ్చాడు సాక్షాత్‌పరమేశ్వరుడు

కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా
కామితార్ధ ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు

శ్రీ చక్రరాజనిలయినిగా శ్రీమత్‌ త్రిపురసుందరిగా
సిరిసంపదలు ఇవ్వామ్మా శ్రీ మహాలక్ష్మిగా రావమ్మా

మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో
మహిషాసురుని చంపితిని ముల్లొకాలను ఏలితివి

పసిడి వన్నెల కాంతులతో పట్టువస్త్రపుధారణలో
పారిజాతపు మాలలలో పార్వతిదేవిగ వచ్చితివి

రక్తవస్త్రము ధరియించి రణరంగమున ప్రవేశించి
రక్తబీజుని హతమార్చి రమ్యకపర్ధినివైనావు

కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి
కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలిసితివి

రామలింగేశ్వరురాణివిగా రవికులసోముని రమణివిగా
రమావాణీ సేవితగా రాజరాజేశ్వరివైనావు

ఖడ్గం, శూలం ధరియించి పా్శుపతాస్త్రము చెబూని
శుంభనిశంభుల దునియాడి వచ్చింది శ్రీ శ్యామలగా

మహామంత్రాది దేవతగా లలితాత్రిపురసుందరిగా
దారిద్ర్యబాధలు తొలగించి మహదానందము కలిగించె

ఆర్తత్రాణపరాయణవే అద్వైతామృతవర్షిణివే
ఆదిశంకర పూజితవే అవర్ణాదేవి రావమ్మా

విష్ణు పాదమున జనియించి గంగావతారము ఎత్తితివి
భాగీరధుడు నినుకొలువ భూలోకానికి వచ్చితివి ||లలితా||

ఆశుతోషుని మెప్పించి అర్ధశరీరం దాల్చితివి
ఆది ప్రకృతి రూపిణిగా దర్శ్నమిచ్చెను జగదంబ

దక్షుని ఇంట జనియించి సతీదేవిగా చాలించి
అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదాంబ

శంఖుచక్రము ధరియించి రాక్షససణారము చేసి
లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు

పరాభటారిక దే్వతగా పరమశాంత స్వరూణిగా
చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరియించితివి

పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో
ప్రమధగణములు కొలువుండు కైలాసంబే పులకించే

సురులు, అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కగా
మాణిక్యాలకాంతులతో నీ పాదములు మెరసినవి

మూలాధార చక్రములో యోగినులకు ఆధీశ్వరియై
అంకుశాయుధధారిణిగా బాసిల్లును శ్రీ జగదాంబ

సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణిగా రూపొంది
శంఖనాదము చేసితివి సింహవాహిణిగా రూపొంది

మహామేరుపు నిలయనివి మందార కుసుమమాలలతో
మునులందరు నినుకొలవంగ మోక్షమార్గము చూపితివి

చిదంబరేశ్వరి నీలీల చిద్విలాసమే నీ సృష్టి
చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించె

అంబాశాంభవి అవతారం అమృతపానం నీ నామం
అధ్బుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం

అమ్మలగన్న అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా
జ్ఞాన ప్రసూనారావమ్మా జ్ఞానము నదరికివ్వమ్మా

నిష్ఠతో నిన్నె కొలచెదము నీ పూజలనే చేసెదము
కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మమ్ముకాపాడు

రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్ధింప
అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి

అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో
అసురుల నందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి

గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా
భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి

పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా
అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి

కరుణించవమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా
దరిశనమియ్యగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా

ఏ విధముగ నినుకొలిచినను ఏ పేరున నిను పిలిచినను
మాతృహృదయవై దయచూపు కరుణమూర్తిగ కాపాడు

మల్లెలు తెచ్చితిమి మనసు నీకే ఇచ్చితిమి
మగువలంతా చేరితిమి నీ పారాయణము చేసితిమి

త్రిమాతృరూపా లలితమ్మా సృష్టి స్ధితి లయకారిణివి
నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమవునా

ఆశ్రితులందరు రారండి అమ్మ రూపము చూడండి
అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము

సదాచార సంపన్నవుగా సామగానప్రియలోలినివి
సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతపు

మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి
మహాదేవికి మనసంతా మంగళహారతులిద్దాము. ||లలితా||

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS