Monday, March 23, 2020

సింపుల్ వాస్తు టిప్స్‌తో ఇంట్లో ఇబ్బందుల్ని అధిగమించండి

సింపుల్ వాస్తు టిప్స్‌తో ఇంట్లో ఇబ్బందుల్ని అధిగమించండి

బారతీయులు వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. వాస్తు నియమాలు మనిషి జీవితం సాఫీగా సాగడానికి ఉపకరిస్తాయి. ప్రతి వాస్తు నిబంధన వెనుక శాస్త్రీయ కారణం ఉంటుంది. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించడం వల్ల ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా ప్రశాంతంగా జీవితం గడిపే వీలుంది. ఇంటిని మనం నిర్మించుకుంటే.. అది వాస్తు ప్రకారం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ అప్పటికే నిర్మాణం పూర్తయిన ఇంట్లోకి వెళ్తే.. వాస్తుకు అనుగుణంగా దాన్ని పూర్తిగా మార్చలేం. కానీ కొన్ని టిప్స్‌తో వాస్తుదోషాలను నివారించొచ్చని ప్రముఖ వాస్తు నిపుణులు జై మదన్ చెబుతున్నారు. అవెంటే చూద్దాం.

ప్రవేశ ద్వారానికి ఎదురుగా గోడ ఉన్నట్లయితే ఒంటరిగా ఉన్న భావన కలుగుతుంది. దీన్ని అధిగమించడానికి వినాయకుడి చిత్రపటం లేదా విగ్రహాన్ని ఉంచండి. 

ఇంట్లో బోరింగ్/బావి తప్పుడు దిశలో ఉంటే.. బోరింగ్‌కు నైరుతి దిశలో పంచముఖి హనుమాన్ చిత్రపటాన్ని ఉంచండి. 
* ధ్యానం చేసుకోవడానికి ఈశాన్యం సరైన దిశ. ఆధ్యాత్మిక పురోగతి కోసం ఈశాన్యంలో ధ్యానం చేయడం ఉపకరిస్తుంది. 

* ఈశాన్యం దిశలో పొడవైన రోడ్డు మార్గం ఉన్నటువంటి సీనరీని ఉంచండి. 

* పసుపు లేదా బంగారు వర్ణంలోని ఫ్రేమ్‌తో ఉన్న ఫ్యామిలీ ఫొటోను నైరుతి దిశలో ఉంచండి. దీని వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగవుతాయి. లేదంటే పొద్దుతిరుగుడు పువ్వు ఫొటో లేదా పెయింటింగ్‌ను ఉంచండి. 

* తూర్పు దిశ ఉదయిస్తోన్న సూర్యుడి పెయింటింగ్ లేదా ఫొటో ఉంచడం వల్ల సామాజిక సంబంధాలు మెరుగవుతాయి. 

* పిల్లల స్టడీ టేబుల్‌ను తూర్పు దిశలో ఉంచితే చదువులో మెరగువుతారు. 

* ఇంట్లో తలుపులు, కిటికీలో సరి సంఖ్యలో ఉండేలా చూసుకోండి. 

* వేగంగా పరిగెడుతోన్న ఎర్రటి వర్ణంలోని గుర్రాల ఫొటో లేదా విగ్రహాన్ని దక్షిణ దిశలో ఉంచడం వల్ల సంపద ప్రవాహం పెరుగుతుంది. సామరస్యం పెరుగుతుంది. 

* వైవాహిక బంధం బలంగా ఉండటానికి బెడ్ మీద ఒకే మ్యాట్రెస్‌ను ఉంచండి. భర్తకు భార్య ఎడమ వైపే నిద్రించాలి. 

* అవసరం లేని వస్తువులను తీసేయండి. ముఖ్యంగా బెడ్ కింద ఇలాంటివి ఉంచొద్దు. వీటి వల్ల మనసు గతంలోకి వెళ్తూ.. మెరుగ్గా వ్యవహరించలేరు. 

* బెడ్రూంను పూర్తి చీకటిగా ఉంచొద్దు. వెలుతురు ఉండేలా చూసుకోవాలి. అలాగే పడకగది గోడలపై డార్క్ కలర్స్ వేయొద్దు. 

* బాత్రూంలో సహజమైన మొక్కలు లేదా క్యాండిల్స్ ఉంచాలి. ఇలా చేస్తే ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. 

* కుటుంబ అనుబంధాన్ని వంటగది ఎంతో ప్రభావితం చేస్తుంది. కిచెన్‌లో గ్యాస్, సింక్ మధ్య సాధ్యమైనంత ఎక్కువ దూరం ఉండాలి. 

* సంబంధాలు బలోపేతం కావడం కోసం బెడ్రూంను నైరుతి దిశలో ఉంచాలి. 

* మూలల వైపు పడుకోవడం మానేయాలి. మూలల్లో నిద్రించడం వల్ల నరాల వ్యవస్థపై ఒత్తిడిని పెరుగుతుంది. 

* ఈశాన్య దిశలో చేపల ఆక్వేరియం ఉంచాలి. ఇలా చేయడం వల్ల పురోగతి ఉండటంతోపాటు నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. 

* ఈశాన్యం దిశలో వాటర్ ఫౌంటెన్ ఉంచుకోవడం మంచిది. 

* ఇంట్లోని వాస్తు దోషాలను అధిగమించడానికి వ్యూహాత్మక స్థానాల్లో పిరమిడ్లను ఉంచడం ఉపకరిస్తుంది. ఇంటి మధ్యలో లేదా ప్రత్యేకంగా ఓ గదిలో లేదంటే శక్తిపరంగా ముఖ్యమైన స్థానంలో పిరమిడ్లను ఏర్పాటు చేయాలి. 

* తూర్పు దిశలో ఆకుపచ్చని మొక్కల్ని పెంచడం వల్ల సంబంధాలు మెరుగవుతాయి

వాస్తు దోషం పోగొట్టేందుకు నివార‌ణా మార్గాలు.....

ఎక్క‌డికెళ్లినా స‌మ‌స్య‌లే… ఇంట్లో, బ‌య‌టా ఎక్క‌డైనా కష్టాలే ఎదుర‌వుతున్నాయ్‌… నిత్యం ఇబ్బందులే. ఆర్థికంగా, మాన‌సికంగా అన్నీ ఒకేసారి వ‌చ్చి ప‌డుతున్నాయ్‌… వాటి నుంచి ఎంత బ‌యట ప‌డ‌దామ‌న్నా వీల‌వ‌డం లేదు, మ‌రింత లోతుకు వెళ్లాల్సి వస్తోంది. అని వాపోతున్నారా..? అయితే అది మీ త‌ప్పు కాక‌పోవ‌చ్చు. మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ, వాస్తు దోషం అయి ఉండ‌వ‌చ్చు. ఎందుకంటే మీ ఇంట్లో నిత్యం మీరే ఉన్నా అప్పుడ‌ప్పుడు వ‌చ్చే అతిథులు, స్నేహితులు, ఇంకా ఇత‌ర తెలిసిన వారి వ‌ల్ల ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంద‌ట‌. అంతేకాదు దీనికి వాస్తు దోషం తోడైతే అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వారికి అన్నీ స‌మ‌స్య‌లే ఎదుర‌వుతాయ‌ట‌. ఈ క్ర‌మంలో అలాంటి స‌మ‌స్య‌లు త‌ప్పించేందుకు, వాస్తు దోషం పోగొట్టేందుకు ప‌లు ర‌కాల నివార‌ణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి ప‌లువురు పండితులు విశ్లేషించి మ‌రీ చెబుతున్నారు కూడా. ఈ క్ర‌మంలో స‌ద‌రు నివార‌ణా మార్గాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వేప ఆకులు… 
వేప ఆకుల్లో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉన్నాయి. సూక్ష్మ క్రిముల ప‌ట్ల వేప అద్భుతంగా ప‌ని చేస్తుంది. ఈ క్ర‌మంలో వేప ఆకును ఇంట్లో కాల్చి పొగ వేస్తే దాంతో ఇంట్లో ఉండే బాక్టీరియా, వైర‌స్‌లు నాశ‌న‌మ‌వుతాయి. అంతే కాదు వేప ఆకుల‌ను ఇంట్లో మండించ‌డం వ‌ల్ల వాస్తు దోషం కూడా పోతుంద‌ట‌.

అగ‌ర్‌బ‌త్తీలు…
హిందువులు ఎవ‌రైనా దేవుడికి పూజ చేసిన‌ప్పుడు మాత్ర‌మే అగ‌ర్ బ‌త్తీల‌ను వెలిగిస్తారు. లేదంటే ఎవ‌రైనా చ‌నిపోయిన‌ప్పుడు వారిని ఖ‌న‌నం చేసేందుకు తీసుకెళ్లిన‌ప్పుడు కూడా వీటిని వెలిగిస్తారు. అయితే అగ‌ర్ బ‌త్తీల‌ను మామూలు స‌మ‌యంలో కూడా వెలిగించ‌వ‌చ్చు. దాంతో ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ మాయ‌మ‌వుతుంది. అయితే అగ‌ర్‌బ‌త్తీల‌ను ఎప్పుడు వెలిగించినా బేసి సంఖ్య‌లో స్టిక్స్‌ను వెలిగించాలి.

ఫ‌ర్నిచ‌ర్‌…
కుర్చీలు, టేబుల్స్‌, సోఫాలు, మంచాలు… ఇలా ఇంట్లో ఉన్న ఫ‌ర్నిచ‌ర్‌ను అప్పుడప్పుడు తీసి వేరే దిశ‌లో పెట్టి మళ్లీ య‌థావిధిగా అమ‌ర్చుకోవాల‌ట‌. దీంతో నెగెటివ్ ఎన‌ర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంద‌ట‌. దీన్ని గురించి ఫెంగ్ షుయ్ వాస్తులో వివ‌రించారు.

ఉప్పు…
రెండు చిన్న‌పాటి గిన్నెల‌ను తీసుకుని వాటిలో కొంత ఉప్పు వేయాలి. అనంత‌రం ఆ రెండు గిన్నెల‌ను ఇంట్లో ఈశాన్య‌, నైరుతి దిశ‌ల్లో ఉంచాలి. ఇలా చేస్తే నెగెటివ్ ఎన‌ర్జీ మాయ‌మ‌వుతుంది. పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది.

కిటికీలు…
కిటికీల‌ను ఎల్ల‌ప్పుడూ తెర‌చి ఉంచాలి. వాటి వ‌ద్ద కుండీల్లో ఏవైనా మొక్క‌ల‌ను ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నెగెటివ్ ఎన‌ర్జీ బ‌య‌టికి వెళ్లి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. దాంతో ఇంట్లోని అంద‌రికీ మంచే జ‌రుగుతుంది.

క‌ర్పూరం, ల‌వంగాలు… 
ఉద‌యం, సాయంత్రం వేళ్ల‌లో కొద్దిగా క‌ర్పూరం తీసుకుని వెలిగించి దాంట్లో కొన్ని ల‌వంగాల‌ను కూడా వేయాలి. ఇలా రెండింటినీ మండించ‌డం వ‌ల్ల ఇంట్లో ఉన్న వాస్తుదోషం పోతుంది. అంద‌రికీ అదృష్టం క‌ల‌సివ‌స్తుంది. ఆర్థిక సమ‌స్య‌లు ఉంటే పోతాయి.

ప‌సుపు ఆవాలు, గుగ్గుళ్లు… 
న‌లుపు రంగువి కాక‌, పసుపు రంగులో ఉండే ఆవాలు, గుగ్గుళ్ల‌ను క‌లిపి ఇంట్లో రోజూ మండిస్తున్న‌ట్ట‌యితే నెగెటివ్ ఎన‌ర్జీ మాయ‌మ‌వుతుంది.

గుగ్గుల్ ఇన్‌సెన్స్ స్టిక్స్‌… 
వారానికి ఓ సారి ఇంట్లో గుగ్గుల్ ఇన్‌సెన్స్ స్టిక్స్‌ను మండించాలి. దీని వ‌ల్ల ఇంట్లోని వారి స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. శారీర‌క ఆరోగ్యం, మాన‌సిక ప్ర‌శాంత‌త క‌లుగుతాయి. నెగెటివ్ ఎన‌ర్జీ తొల‌గిపోతుంది.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS