సర్వ సాధారణంగా ప్రస్తుత కాలంలో మనకు సమయం దొరికినప్పుడు మాత్రమే కటింగ్ చేసుకుంటూ ఉన్నాం , కానీ క్షురకర్మలకు శాస్త్ర రిత్య కొన్ని సూచనలు ఉన్నాయి వారంలో ఏ రోజు మనం కటింగ్ చేయించు కుంటే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో శాస్త్ర పరంగా గమనిద్దాం. ఇది శాస్త్రాన్ని నమ్మిన వారికి మాత్రమే పూర్వ పద్ధతులను తెలియ జేయడం జరుగినది. ఇందులో చాలా పద్దతులు ఉన్నాయి. ఉదయం 12 గంటల లోపు చేయించుకున్న శుభం కలుగుతుంది. రాత్రి సమయంలో కటింగ్ చేసుకోకూడదు. తండ్రి కొడుకులు, అన్నదమ్ములు ఒకే రోజు చేసుకో కూడదు.
వారము ఫలితము
ఆదివారము - ఒక మాసము ఆయువు తగ్గిపోతుంది. తత్ ఫలితంగా శరీరం అధిక వేడి పొందుతుంది.
సోమవారముము - ఏడు మాసములు ఆయువు వృద్ధి చెందును , సౌఖ్యం కలుగ జేస్తుంది.
పుత్రులు కోరుకునే గృహస్థులు, ఒకే ఒక పుత్రుడు గలవారు క్షవరము చేయించుకోనగూడదు.
మంగళవారముము - ఏనిమిది మాసములు ఆయువు తగ్గిపోతుంది. తత్ ఫలితంగా దు:ఖం కలుగజేస్తుంది.
బుధవారముము - ఐదు మాసములు ఆయువు వృద్ధి చెందును. పుష్టిని కలుగ జేస్తుంది.
గురువారముము - పది మాసములు ఆయువు వృద్ధి చెందును. లక్ష్మిని కోరుకునేవారు గురువారమునాడు క్షవరము చేయించుకోనగూడదు. తత్ ఫలితంగా ధన నాశనం కలుగజేయును.
శుక్రవారముము - పదకొండు మాసములు ఆయువు వృద్ధి చెందును. తత్ ఫలితంగాశక్తి తగ్గును అక్కా ,చెల్లెళ్ళు కలవారు చేయించుకో రాదు.
శనివారముము - ఏడు మాసములు ఆయుక్షీణమ్ కలిగించును. తత్ ఫలితంగా రోగ వృద్ధిని కలుగజేయును.
క్షురకర్మకు అనుకూలమైన తిధులు :- విదియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి, తిధులు శుభం .
క్షురకర్మకు ప్రతికూలమైన తిధులు :- ఆదివారం , శనివారం , మంగళవారంనాడు క్షురకర్మ చేయించుకున్న మంచిదికాదు.
క్షురకర్మకు అనుకూలమైన నక్షత్రాలు :- హస్త , చిత్త , స్వాతి , పునర్వసు, పుష్యమీ, మృగశిర , ధనిష్ఠ , శతభిషం, అశ్విని , రేవతి, నక్షత్రాలలో శుభం .
క్షురకర్మకు ప్రతికూలమైన నక్షత్రాలు:- మఖ , కృత్తిక , ఉత్తర, అనురాధ, ఈ నక్షత్రాలలో చేసుకోవద్దు.
పూజా ప్రక్రియలో నిషిద్ధకర్మలు:- గృహంలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి.అంతకన్నాపెద్దగా ఉండరాదు. మంత్ర పుష్పం, సుప్రభాతం కుర్చుని చదవరాదు. ఈశ్వరుడుకి పవళింపు సేవ నిలబడి చేయరాదు. నుదుట బొట్టు, విభూతి లేదా కనీసం బొట్టు అయిన లేకుండా పూజ చేయకూడదు. ఈశ్వరుడికి, గురువుకి ఒక చేతితో నమస్కారం చేయరాదు అలా చేస్తే పై జన్మలో చేతులు లేకుండా జన్మించటం, చేతులు పోవటం కానీ జరుగుతాయి.
దేవునికి ( ఈశ్వరునికి ) వీపు చూపరాదు, ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు. ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం. ఆ దీపారాధనతో పుల్లలు కానీ, సాంబ్రాణికడ్డికానీ, హారతి కర్పూరం కానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు. పూజ సమయమున ఈశ్వరుడు మన కంటే ఎత్తులో వుండాలి, అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి. ఎడమ చేయి పూజా విధులలో నిషేధం. ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు.
ఈశ్వర నిర్మాల్యం కాలితో తొక్కరాదు. అలాచేస్తే ఈ జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కూడా నశించును. రుద్రాక్షలు ధరించే వారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు.
స్త్రీలకి నిషిద్ధకర్మలు :- స్త్రీలు తులసీ దళాలు తుంచ రాదు.
No comments:
Post a Comment