కాలసర్ప దోషం తొలగడానికి మనసా దేవి స్త్రోత్రం
🔥మానసాదేవి ద్వాదశనామస్తొత్రమ్🔥
ఈ శ్లోకం ఎవరు రోజు చదువుతారో వారికి సర్ప భయం ఉండదు . కాలసర్ప దోషం భాధించదు .
🙏శ్లోకం🙏
జరత్కారు జగద్గౌరీ మానసా సిద్ధయోగినీ
వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తథా
జరత్కారుప్రియా ఆస్తీకమాతా విషహరేతి చ
మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా
ద్వాదశైతాని నామాని పుజాకాలేతు యఃపఠేత్
తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ
🔱మానసాదేవిమంత్రం🔱
" ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహా"
🌷మానసాదేవి చరిత్ర 🌷
మానసా దేవి వాసుకి చెల్లెలు . వాసుకి జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో సర్పాలు మరణిస్తునపుడు, మానసాదేవిని తన కుమారుడైన అస్తీకుని తో చెప్పి నాగజాతిని కాపాడమని కోరతాడు .మానసా దేవి ఆదేశానుసారం అస్తీకుడు ఆ యాగాన్ని ఆపి సర్పజాతిని కాపాడతాడు .వారు అస్తీకుడు కృతజ్ఞతలు తెలుపుతారు.అప్పుడు అస్తీకుడు వాసుకి తొ నేను నా తల్లి తపస్సు వల్ల ,అశీస్సులువల్ల ఈ పని సాధించాను అని చెబుతాడు . అప్పుడు ఇంద్రుడు అది నిజమని పలికి. అమ్మ జరత్కారు ! నీవు జగన్మాత అయిన లక్ష్మీదేవి అంస తో ఉదయించి ,పూర్వ జన్మలో మమహాతపస్సు చేశావు .హరిహరులు నీ తపస్సు కు సంతోషించి "సిథేశ్వరి" గా నీకు వరములు ప్రసాదించారు .ఆనాడు దేవతలకు నీవు ఎన్నో ఉపకారాలు చేశావు.నన్ను కూడా నీవు రక్షించావు . నీ భర్త అయిన జరత్కారు మునీశ్వరుడిని (ఆయనలో నారాయణ అంశ వున్నది) యంతో భక్తితో సేవించి ఈ అస్తీకుడిని వరప్రసాదంగా కన్నావు .దేవతలయందు ఆర్తుల యందు,ధర్మరక్షనయందు మనసు పెట్టినమాతగా నిన్ను "మానసాదేవి " అని పిలిచేవారము .ఆ పేరు ఇప్పుడు కూడా సార్ధకమైనది. ఆపదలోవున్న నాగజతిని కాపాడి నాగపూజ్యవే కాదు లోకపూజ్యవు కూడా అయినావు. ఈ నాటినుండి నిన్ను పూజించేవారు సమస్త కామ్యములను పొందుతారు .నీ నామములను ఎవరు పఠిస్తారో వారికి సర్ప భయం వుండదు అంటూ లొకపాలకుడైన ఇంద్రుడు మానసాదేవి నామములను స్తుతించాడు . నాగ ప్రముఖులందరూ మానసాదేవిని భక్తితో పూజించారు.గంగాతీరంలోని "మాయాపురి" దగ్గర వున్న కొండపైన అస్తీకుని ఆశ్రమంలో మానసాదేవి అందరిచేత పూజలు అందుకుంటుున్నది. ఈ గుడి హరిద్వార్ దగ్గర వుంది .
🌷శ్రీ మాత్రే నమః🌷
No comments:
Post a Comment