Monday, March 23, 2020

హనుమకు మిరియాలతో ప్రదక్షిణాలు చేస్తే శని దోషం పోతుందా..?

హనుమకు మిరియాలతో ప్రదక్షిణాలు చేస్తే శని దోషం పోతుందా..?

జాతకరీత్యా శని పరమ నీచలో ఉన్నప్పుడు 40 రోజుల పాటు హనుమకు మిరియాలతో ప్రదక్షిణాలు చేయమనడం పరిపాటి. ప్రతి ప్రదక్షిణానికి ఒకటి చొప్పున 108 ప్రదక్షిణాలను 108 మిరియాలతో లెక్క పెట్టుకోవాలి. ఆ 108 మిరియాలతోనే 40 రోజులు ప్రదక్షిణాలు చెయ్యాలి. 41వ రోజు ఆ మిరియాలు కలిపి తీపి పదార్ధం వండాలి.
ఈ తీపి పదార్ధంతో పాటు అప్పాలు కూడా చేసి గుడిలో ఆంజనేయ స్వామికి  సింధూర పూజ లేదా ఆకు పూజ చేయించుకొని వండిన పదార్థాలు నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే శని బాధలతో పాటుగా భూత, ప్రేత, పిశాచ, శత్రుబాధలు కూడా నాశనం అవుతాయి. జాతకంలో శని దోషం తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే మిరియాలు వినియోగించాలి.

No comments:

Post a Comment

RECENT POST

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు –  భూమండలంపై గ్రహాల ప్రభావం: జ్యోతిషశాస్త్రంలో శని గ్రహాన్ని కర్మఫలదాతగా భావిస్తారు. శని అన...

POPULAR POSTS