జిల్లెళ్ళమూడి "అమ్మ"గా పేరొందిన ఈవిడ అసలు పేరు అనసూయ. ఈమె, గుంటూరు జిల్లాలోని బాపట్లకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నజిల్లెళ్ళమూడి అనే కుగ్రామంలో 28 మార్చి, 1923 న సీతాపతి, రంగమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు. తండ్రి సీతాపతి గారు గ్రామాధికారి. నాలుగు సంవత్సరాల వయసునుండే ఆమె శారీరక, మానసిక స్థితి చాలా విభిన్నంగా ఉండేది. తరచుగా, trance లోకి వెళ్ళేవారు. ఒక సారి, ఏకంగా అలా పదకొండు రోజులు trance లో ఉండిపోయారు. నెమ్మదిగా స్పృహలోకి వచ్చేవారు. ఆ నాటి వైద్యులకు ఆమె స్థితి చాలా వింతగా తోచింది. వివాహం చేస్తే మార్పు రావచ్చునేమోనని భావించారు.
ఆమెకు 05 -05 -1936న, పదమూడవ ఏటనే వివాహం చేసారు. కానీ, వివాహానంతరం కూడా, ఆమె ఎప్పుడూ ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉండేవారు. ఆవిడ భర్త పేరు శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావుగారు. ఆయనను 'జిల్లెళ్ల మూడి కరణంగారు' అని పిలిచేవారు. అప్పటికే ఆమెలో దివ్యశక్తిని గ్రహించిన కొందరు భక్తులు ఆమెను."మీకు అంత ఆధ్యాత్మిక తృష్ణ, భక్తి ఉండగా, పెళ్లి చేసుకోవటం లోని అంతరార్ధం మాకు అర్ధం కావటం లేదు." అని అడిగారు. అందుకు, అమ్మ"ఆధ్యాత్మిక జీవితానికి వివాహం అడ్డు కాదు - అని చెప్పటానికే, నేను వివాహం చేసుకుంటున్నాను." అని చెప్పారట. తన భార్య వింత పోకడలకు కొంతకాలానికి అలవాటు పడి, ఆవిడలో ఒక దివ్యమూర్తిని చూసి, ఆవిడ భక్తుడిగా మారాడు శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావుగారు. కానీ, "అమ్మ" మాత్రం, తన భర్త పాద పూజ చెయ్యటం కొనసాగించారట. భక్తులు, ఆవిడ భర్తను "నాన్నగారు" అని పిలుచుకునేవారట. అయన, 1981లో మరణించారు 'ప్రపంచమంతా ఒక్కటే, ఒక్కడే దేవుడు' - అనేదే ఈమె వేదాంత బోధ.
ఈవిడ 1960-70 లలొ చాలా ప్రసిద్ధురాలు. ఈవిడ, జిల్లెళ్ళమూడిలోని ప్రజలకు మత విషయముల మీద సందేశాలు ఇస్తుండేవారు. భక్తులు ఆవిడను "అమ్మ" అని భక్తిగా పిలుచుకునేవారు. అమ్మకు చాలా విషయాలు తెలుసు. ఒక సందర్భంలో- 'సిద్ధుడికి', 'జ్ఞానికి' గల తేడాను చక్కగా వివరించారు. సిద్ధుడు ప్రజలను తన వద్దకు ఆకర్షించుకుంటాడు వివిధ శక్తుల వల్ల, జ్ఞానికి ఆ అవసరం లేదు. ప్రజలే వారంతట వారే ఆకర్షితులవుతారు. విచిత్రమైన విషయమేమంటే, ఆవిడకు గుడి కట్టడం 1953లో మొదలయ్యి 1985 లో పూర్తి అయింది. ఆ గుడి పేరు "అనసూర్యేశ్వరాలయం". ఆ కట్టిన గుడిలో, ప్రతి సంవత్సరం మే నెల 5వ తేదీన ఆవిడ తన పెళ్ళిరోజును జరుపుకునేవారు. గర్భగుడిలో, భక్తులు ఆవిడను పూజించేవారు. అమ్మ 12-06-1985 న భౌతిక దేహాన్ని విడిచారు. ఆ తరువాత, ఆవిడ భౌతిక కాయాన్ని, ఆవిడ కోరిక మేరకు, ఆ గుడిలోనే ఖననం చేశారు. 1987లో ఆవిడను ఖననం చేసిన ప్రదేశంలో ఆమె పాలరాయి విగ్రహాన్ని నెలకొల్పారు.
వీరికి, ఒక కుమార్తె, పేరు హైమ. ఆ అమ్మాయి, 1944లో జన్మించి, 1968లో మరణించినది. మొదటినుండి, ఆ అమ్మాయి రకరకాల అనారోగ్యాలతో బాధపడుతుండేది. "అమ్మ" తన కుమార్తె త్వరలోనే ఈ ప్రపంచాన్నివదలి వెళ్ళిపోతుందని తెలుసుకున్నారు. మరణించిన తన కుమార్తెను, ఖననం చేయించి అక్కడ ఒక గుడి కట్టించారు. ఆ గుడి "హైమాలయం" గా పేరొందినది. దానిలో కూడా నిత్యమూ పూజలు, పునస్కారాలు జరుగు తుంటాయి.
Mr. Richard Schiffman in his book "Mother of All" writes "We need not feel that Mother’s feeding of her children is restricted to nourishment for the physical frame alone. It might be said that the food which Amma distributes so lovingly is a maternal symbol of the subtler, spiritual nourishment, the grace, which she invariably showers on one and all who approached her... When a visitor asked her why she does not give any formal spiritual initiation, she answered: the food I give you is your Upadesha".
చలం లాంటి విభిన్న తత్త్వంగల వ్యక్తిని కూడా అమ్మ ఆకర్షించింది.
No comments:
Post a Comment