*'సామజ' అనగా "ఏనుగు🐘" అని అర్థం..'వరగమనా' అనగా "చక్కని నడక🚶🏽♂" అని అర్థం...అలానే ఈ సామవేదం అనగా సంగీతం.. మన భారతీయ సంగీతానికి మూలం సామవేదం.*
*🐘"సామజవరగమన" అంటే ఏనుగు లా గంభీరంగా, హుందాగా,ఠీవి నడిచేవారు అని అర్థం...🐘*
*🤔మరి అసలైన "సామజవరగమన" ఎవరో తెలుసా??... అసలైన "సామజవరగమన.. "శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు..🙏"*
*వాల్మీకి తన రామాయణం లో ‘అరణ్యవాసం’లో ఒకచోట రాముడిని “గజవిక్రాంతగమను”డంటారు...అంటే ఏనుగులా హుందాగా నడిచే వాడు అని...*
*ఇదే అర్థం వచ్చేలా త్యాగరాజు వారు తన కీర్తనలో 'సామజవరగమన' అంటూ శ్రీరాముణ్ణి స్తుతించారు...🙏*
*చాలా మంది పిల్లలకు "సామజవరగమన" అంటూ ధారాళంగా పడేస్తున్నారు....కానీ పాపం వారికి అసలు ఇది దేవుని కీర్తన అని కూడా తెలీదు.. దాని అర్థం ఏంటో తెలీదు...వారికి చెప్పేందుకైనా "సామజవరగమన" కీర్తన ,దాని అర్థం ఒకసారి తెలుసుకుందాం👇🏽..*
కీర్తన...
*🎶సామజవరగమనా! సాధుహృత్సారసాబ్జపాల! కాలాతీతవిఖ్యాత! ॥ సామజ॥*
*🎶సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల!* *దయాలవాల! మాంపాలయ! ॥సామజ॥*
*🎶వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా। స్వీకృత* *యాదవకులమురళీ!*
*గానవినోదన మోహనకర* *త్యాగరాజ వందనీయ ॥సామజ॥*
ఈ కీర్తన త్యాగ రాయ కీర్తనలన్నిటిలో ప్రసిద్ధి పొందినది.. ఈ కీర్తన లో ని ప్రతి పదం శ్రీ కృష్ణుడిని వర్ణిస్తూ ఉంటుంది...
కీర్తన అర్థం...
*🙏ఏనుగు నడకవంటి గంభీరమైన నడక తో, మునులు మనిషులు హృదయాలను ఏలుతున్న ఓ శ్రీ హరి, నువ్వు కాలం తో సంబంధం లేకుండా అందరి చేత పొగడ బడతావు..*
*🙏సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది.. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే, గుణమునకి, దయకి ఉదాహరణ నీవే.. నన్ను కూడా నీవే నడిపించాలి..*
*🙏సామవేదమునుండి పుట్టిన సప్తస్వరముల వల్ల, ప్రకాశిస్తూ.. గోవులని రక్షిస్తూ.. మురళి గానం తో మామ్మలందరిని ఆనంద పరుస్తూ.., ఈ త్యాగరాజ వందనములను అందుకో..*
No comments:
Post a Comment