Monday, March 23, 2020

ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది

ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది

*పుష్ప ప్రసాదం..!*
*ఓం నమః శివాయ..!*

*దేవునికి విడి పూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే ప్రత్యక ఫలితం లబిస్తుంది*
దేవునికి వేసే పుష్పాలు విచ్చుకున్నట్లు అయితే..
మీ జీవితం..భవిష్యతు.. భాగుంటుంది

1.దేవునికి కాగితం పూల మాలను  వేస్తే..
నిత్య దరిద్రులు అవుతారు

2.దేవునికి ప్లాస్టిక్ పూలమాలను వేస్తే..
చర్మ వ్యాధి వస్తుంది.

3.ఒకరు పూజ చేస్తున్నప్పుడు మరొకరు
ఒక పువ్వు తీసుకొని పూజ చేస్తే..
గ్యాస్ట్రిక్  వ్యాధి వస్తుంది.

4.పాడయిన పూలతో పూజ చేస్తే..
దేహంలో అయిన గాయాలు నయం కావు.

5.పురుగులు ఉన్న పూలతో పూజ చేస్తే..
పుండ్లలో పురుగులు ఎక్కువ అవుతాయి.

6.సువాసన నిండి ఉన్న పూలతో పూజ చేస్తే..
మీ జీవితం సుఖమయం అవుతుoది.

7.పూజకు ముందే పూల వాసనను ఎవరైతే చూస్తారో వారికీ అస్తమా ,హృదయ సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు.

8.ఎవరైతే దేవుని పూజకు మొగ్గలను వాడతారో
వారి చిన్న పిల్లలకు ఆరోగ్య లోపం ఏర్పడుతుంది.

9.ఎవరైతే దేవునికి కనకాంభరం పూలతో పూజచేస్తారో వారికీ జేవితంలో ప్రశాంతత లబించదు .
కనకాంబరం పూలు పూజకు పనికిరావు.

10.విచ్చని పూలతో పూజ చేస్తే..
మీ పనులు చాలా ఆలస్యం గానూ ,
కొన్ని సార్లు చేస్తున్న పనులు నిలిచిపోతాయి

*ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది..*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
1.దేవునికి జాజి పూలు..అర్పించి
ప్రసాదం స్వీకరిస్తే ..
మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి
మంచి గుణం వస్తుంది .
ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి

2.దేవునికి సంపెంగ పూలు అర్పించి..
ప్రసాదం స్వీకరిస్తే ..
మాంత్రిక ప్రయోగాలు మీఫై పని చేయవు .
శత్రువుల బాధ నివారణ సాధ్యం అవుతుంది

3.పారిజాత పువ్వుని అర్పిస్తే ....
కాల సర్ప దోషం నివారించబడి
మనస్సుకు శాంతి లబిస్తుంది.

4.రుద్రాక్ష పువ్వును అర్పిస్తే ...
ఎన్ని కష్టాలు వచ్చిన అంతిమ విజయం
మీదే అవుతుంది.

5.మొగలి పువ్వును అర్పిస్తే .....
అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడుతాయి.

6.లక్కీ పువ్వుతో పూజిస్తే ....
భార్య పిల్లలతో కలహాలు లేకుండా
సంతోషంగా ఉంటారు.

7.పద్మం లేదా కమలంతో పూజిస్తే .....
సమస్త దారిద్ర నివారణ.
శ్రీమంతులు అవుతారు.

8. మల్లె పువ్వుతో పూజిస్తే ......
అన్ని రోగాలు నయం అవుతాయి .
ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

9.గన్నేరు పూలతో పూజిస్తే..
కవులకు కల్పనా సాహిత్యం వృద్ది చెందుతుంది.

10.కల్హార పుష్పం తో పూజిస్తే ...
అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి
ఆకర్షణ పెరుగుతుంది.

11.పాటలీ పుష్పంతో పూజ చేస్తే ..
వ్యాపార వ్యవహారంలో అధిక లాభం వస్తుంది.

12.కంద పుష్పంతో పూజ చేస్తే ....
ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది.

13.తుమ్మ పూలతో ఈశ్వరునికి పూజ చేస్తే ...
దేవునిఫై భక్తి అధికం అవుతుంది.

14.నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే ... జేవితంలో సుఖం ,శాంతి ,ప్రశాంతత లబిస్తుంది.

15.కణగాలే పుష్పం ...దీనితో దేవునికి పూజ చేస్తే.. మనస్సును పట్టి పీడిస్తున్న భయం , భీతి తొలగిపోతాయి
గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక భాదలు తొలగిపోతాయి .
విద్య ప్రాప్తి సిద్దిస్తుంది .
దుర్గా దేవికి ఈ పూలతో పూజ చేస్తే
దేవి అనుగ్రహంతో శత్రువుల నిర్మూలన అవుతుంది.

16.అశోక పుష్పాలతో దేవికి పూజ చేస్తే .... జేవితంలో.. సంసారంలో ఉండే అన్ని దుఃఖాలు నాశనం అవుతాయి

17.నల్ల కలువ పుష్పాలతో శ్రీ శన్నైచ్చర మహారాజుకు పూజ చేస్తే అన్ని రకాల
శని సమస్యలు తొలగిపోతాయి

18.పాదరి పుష్పంతో పూజ చేస్తే ...
అన్ని రకాల పితృ దోషాలు తొలగిపోతాయి.

19.మాలతి పుష్పంతో దేవునికి పూజ చేస్తే..
అన్ని పాపాలు తొలగిపోతాయి.

20.పున్నాగ పుష్పం... ఈ పువ్వుతో శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి  ,శ్రీ గోపాల కృష్ణదేవునికి పూజ చేస్తే మగ సంతానం కలుగుతుంది .

21.వకుళ పుష్పం ... శ్రీ భూవరాహ స్వామికి ,
శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి ఈ పూలతో పూజ చేస్తే భూమి మరియు సొంత ఇల్లు పొందే యోగం వస్తుంది.

22.ఉత్ఫల పుష్పం ...జీవితంలో చాల కష్టాలు పడేవారు ప్రతిరోజు విష్ణు సహస్ర నామం
మహాలక్ష్మి సహస్ర నామం పఠించి..
ఉత్ఫల పుష్ఫంతో పూజ చేస్తే..
జీవితంలో చాలా అభివృద్ధి చెoదుతారు.

23. తెల్లని జిల్లేడు పువ్వుతో ... గణేశునికి ,శంకరునికి ,సూర్యదేవునికి చేసే పూజ వల్ల అన్ని రోగాలు తొలగి ,ఆరోగ్య్యం సిద్దిస్తుంది.

24.ద్రోణ పుష్పం ... ఈ పువ్వుతో సోమవారం ఈశ్వరునికి పూజ చేస్తే..శత్రువుల నాశనం , మిత్రలాభం అవుతుంది.
అధికారం ప్రాప్తిస్తుంది.

25. భందూక పుష్పం ... ఈ పుష్పంతో దుర్గా దేవికి మంగళవారం .శుక్రవారం పూజ చేస్తే..
బంధువులు క్షేమంగా ఉంటారు.

26.అగసి పువ్వుతో .... దేవికి పూజ చేస్తే..
పాపాలు తొలగిపోతాయి.

27.సురభి పుష్పం ... శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి సురభి పుష్పంతో పూజిస్తే ఇష్టార్ధం సిద్ధిస్తుంది.

28.పొద్దు తిరుగుడు పుష్పంతో పూజ చేస్తే .... పువ్వును హోమం పూర్ణాహుతికి వేస్తె
అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయి.
(సేకరణ)

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS