రామనారాయణ ఆలయం
విజయనగరం నకు నైఋతి దిశగా, 5 కీ.మీ దూరం, కోరుకొండ రోడ్ మార్గంలో శ్రీ రామనారాయణ ఆలయయ కలదు. ఇది శ్రీ రాముని ధనుస్సు ఆకృతి పొలి ఉంటుంది. ధనుస్సు ఆకృతికి కుడి భాగంన శ్రీ నారాయణ మందిరం మరియు ఎడమ భాగంన శ్రీ రామ మందిరం ఉన్నాయి. మధ్యన ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం కలదు. రెండు మందిరాలు కలుపుతూ అర్ధ చంద్రాకారములో ఒక మార్గం నిర్మించారు. ఈ మార్గం నందు రామాయణం లోని 72 దృశ్య ఘట్టాలును సుందర బొమ్మల రూపంలో తీర్చి దిద్ధినారు. రామాయణ దృశ్య కావ్యం సందర్శకులును విశేషంగా ఆకర్షించు చున్నది. దీని క్రింద భాగంలో ధ్యాన మందిరం, సీతారాముల కళ్యాణ మండపం, ఆధ్యాత్మిక గ్రంధాలయం మొదలగునవి ఉంటాయి. ప్రతి మాసం పునర్వసు నక్షత్రం నాడు సీతారాములుకు శాంతి కళ్యాణం నిర్వహించుతారు. వినాయక చవితి, హనుమాన్ జయంతి, కార్తీక దీపోత్సవం మొదలగునవి ఘనంగా జరుగుతాయి.
విశాలమైన ఆలయ ప్రాంగణం ఆహ్లోదకరం, ప్రశాంతితో నిండి ఉంటుంది . ముందుగా గణపతి సన్నిధి దర్శినమిస్తుంది. ఆలయ ప్రవేశం నకు రుసుం చెల్లించాలి. సందర్శకులుకు త్రాగు నీరు, మరుగు దొడ్డి మొదలగు వసతులున్నాయి. ఉదయం 10 గంటలు నుంచి రాత్రి 8 గంటలు వరకు దర్శనం లభ్యమవుతుంది. చెన్నై - హౌరా రైలు మార్గంలో విజయనగరం రైల్వే జంక్షన్ ఉంది. ఇక్కడ నుంచి ఆలయాన్నికి టాక్సీలు/ఆటోలు దొరుకుతాయి. విజయనగరం రైల్వే బ్రిడ్జి జంక్షన్ నుంచి కోరుకొండ షేరింగ్ ఆటోలు బయులుదేరుతాయి. ఇవి ఆలయం మీదగా సాగుతాయి. విజయనగరం - విశాఖపట్నం రోడ్ మార్గంలో "Y" జంక్షణ ఉంటుంది. Y జంక్షన్ నుంచి కోరుకొండ & విశాఖపట్నం రోడ్ మార్గములు విడిపోవును. ఇక్కడ నుంచి కోరుకొండ ఆటోలు దొరుకుతాయి. విజయనగరం - సింహాచలం బస్సులు ఆలయం మీదగా ఉంటాయి.
కె. కె. మంగపతి
Yatra - Telugu
No comments:
Post a Comment