Saturday, March 28, 2020

#ugadi2020 #panchangam# Rasi Phalalu 2020 || ఉగాది శార్వరి నామ |#ADIPUDI #SAIRAM #ఆదిపూడి సాయిరాం#సంవత్సరాది.. ఉగాది..

#సంవత్సరాది.. ఉగాది..

  ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.   https://youtu.be/S6Ug9W2Db_Y
ఉగస్య ఆది అనేదే ఉగాది. "ఉగ" అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అని అర్థాలు. వీటికి 'ఆది' అనగా మొదలు 'ఉగాది'. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటి రోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, 'యుగం' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది.. ఉగాది.. ఉగాది, వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. ఉగాది పుట్టుక... వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యవతారిదారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. చైత్రశుక్లపాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతుందని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం 'ఉగాది'.. శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా వుంటుంది. కోయిలలు కుహూకుహూ అని పాడుతాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. "ఉగాది పచ్చడి" ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనమె ఉగాది పచ్చడి... తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం).. ..అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేసారు. అక్కడ ఈ పండుగ గుడిపడ్వాగా పేరుపొందింది.
హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో పిలుస్తారు. తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అనే పేరుతోను, సిక్కులు "వైశాఖీ" గానూ, బెంగాలీలు "పొయ్‌లా బైశాఖ్" గానూ జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును...#Sri Sarvari Nama Samvatsara Rasi Phalithalu 2020 @ #Adipudi VenkataSivaSaiRam -#శ్రీ శార్వరి నామ సంవత్సర "ఉగాది" శ్రీ శార్వరినామ సంవత్సర పంచాంగ పఠనం#Sri SarvariNama Samvatsara Ugadi Panchangam 20-21 | శ్రీశార్వరినామ సంవత్సర రాశి ఫలాలు# Ugadi Panchangam 2020-2021 (Sri Sarvari Nama Samvatsara Panchangam ) (Telugu New Year) #శ్రీశార్వరినామ సంవత్సర రాశి ఫలాలు , ఉగాది పంచాంగ పఠనం | #(SarvariNama Samvatsara Panchangam ) Rasi Phalalu 2020-21, # ఉగాది పంచాంగ పఠనం 2020-2120, #Ugadi (SarvariNama Samvatsara )Panchangam (#Telugu #New #Year) - 2020 శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు - 2020, Ugadi Panchangam 2020, SarvariNama Samvatsaram Rasi Phalalu (Horoscope), శ్రీ శార్వరి నామ సంవత్సర తెలుగు పంచాంగం 2020, #telugu panchangam #2020, తెలుగు సంవత్సర రాశి ఫలాలు, panchanga patanam, #panchanga sravanam, ఉగాది పంచాంగ శ్రవణం, ఉగాది పంచాంగ పఠనం, శ్రీ శార్వరి నామ సంవత్సర రాశీ ఫలితాఫలాలు#,ప్రముఖ జ్యోతిష్య,వాస్తు నిపుణులు #ఆదిపూడి సాయిరాం గారు #Siddanthi, #Horoscope 2020-2120, Sri SarvariNama Samvatsaram #Predictions by Sri ADIPUDI VENKATA SIVA SAIRAM #Siddanthi, #Mesha Rasi (#Aries Horoscope) మేష రాశి, #Vrushaba Rasi (#Taurus Horoscope) వృషభ రాశి, #Mithuna Rasi (#Gemini Horoscope) మిధున రాశి, #Karkataka Rasi (#Cancer Horoscope) కర్కాటక రాశి, #Simha Rasi (#Leo Horoscope) సింహ రాశి, #Kanya Rasi (#Virgo Horoscope) కన్య రాశి, #Tula Rasi (#Libra Horoscope) తులా రాశి, #Vruschika Rasi (#Scorpio Horoscope) వృశ్చిక రాశి, #Dhanussu Rasi (#Sagittarius Horoscope) ధనస్సు రాశి, #Makara Rasi (#Capricorn Horoscope) మకర రాశి, #Kumba Rasi (#Aquarius Horoscope) కుంభ రాశి, #Meena Rasi (#Pisces Horoscope) మీన రాశి






No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS