Monday, March 23, 2020

ఉపమాక

ఉపమాక



     నక్కపల్లి కి ఆగ్నేయం దిశగా, సుమారు 5 కీ.మీ దూరాన, (జాతీయ రహదారి (NH-16) కి కొంత లోపలకి) ఉపమాక అను గ్రామం కలదు.  ఇచ్చట కొండ పైన పురాతన శ్రీ వేంకటేశ్వరాలయం ఉంది.  కొండ గరుడు ఆకృతి పోలియుండును. స్వామి స్వయంభూ మూర్తి.  గర్భాలయం నందలి స్వామి రూపం అవ్యక్తంగా ఉంటుంది.  అశ్వమును అధిరోహించిన శ్రీనివాసుడు ఆరు భుజములు కలిగి యుండును.  స్వామికి నిత్యం పంచామృత అభిషేకములు జరుపుతారు.  ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు వార్షిక కళ్యాణోత్సవాలు జరుగుతాయి.  అశ్వయుజ మాసం, శ్రావణ నక్షత్రం తో కూడిన తిది నాడు బ్రహ్మోత్సవాలు చాల వైభవం గా నిర్వహించుతారు.  కొండ క్రింద శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ఉంటుంది.  ఆలయం చాల ప్రాచీనమైనది.  విశేష్టమైన శిల్ప సంపద చూడగలము.  వైశాఖ శుద్ధ ఏకాదశికి వార్షిక కళ్యాణం జరుగుతుంది.  స్వామిని  ఆరాధించిన దంపతులుకు సంతానం కలుగుతుంది అని ఒక గట్టి నమ్మకం భక్తులుకు ఉంది.

     హౌరా - చెన్నై జాతీయ రోడ్ మార్గములో నక్కపల్లి అను చిరు పట్టణం కలదు.  నక్కపల్లి బస్ స్టాండ్ కు కొంత ముందుగా (హౌరా వైపు)  ఆలయ ముఖ ద్వారం దర్శనమిస్తుంది.  ప్రయాణికుల అభ్యర్ధన బట్టి బస్సులు ఆగుతాయి.  ముఖద్వారం నకు సుమారు 2 కీ.మీ లోపలకి ఆలయం ఉంటుంది.  ముఖద్వారం వద్ద ఆటోలు ఉంటాయి . 
     నక్కపల్లి కి సమీప రైల్వే స్టేషన్ తుని.  ఇది తూర్పు గోదావరి జిల్లా పరిధి లోనికి వస్తుంది.  జిల్లా సరిహద్దులో తుని, పాయకరావు పేట (విశాఖ జిల్లా) ఉంటాయి.  వీటి మధ్య తాండవ నది కలదు.  నదికి ఇరువైపుల తుని రైల్వే స్టేషన్ & పాయకరావు పేట స్ధానిక బస్ స్టాండ్ ఉంటాయి.  పాయకరావు పేట నుంచి అనకాపల్లి బస్సులు & యలమంచిలి షేరింగ్ ఆటోలు బయులుదేరుతాయి.  వీటి సహయంతో ఆలయ ముఖద్వారం చేరగలము.  వీటి మధ్య దూరం 18 కీ.మీ గా ఉండును.
                                          కె. కె. మంగపతి
                        

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS