Saturday, March 28, 2020

#ugadi2020 #panchangam# Rasi Phalalu 2020 || ఉగాది శార్వరి నామ |#ADIPUDI #SAIRAM #ఆదిపూడి సాయిరాం


*యుగయుగాలఉగాది..... ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు. https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A2D4P0X1w64e7D0PeY38wSZ

రామాయణంలో చైత్రం 12 వ నెల. రాముడు ఋతువులన్నీ గడిచి 12 వ నెల అయిన చైత్రమాసంలో శుద్ధ నవమినాడు జన్మించి నట్లు బాల కాండలో ఉంది. (తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిధౌ) దీనిని బట్టి రామాయణ కాలంలో వైశాఖ ప్రారంభమే సంవత్సరాది. మార్గశిర పుష్య మాసాలున్న హేమంతంతో సంవత్సరం ప్రారంభమని కౌత్యుడు మతం. అమరసింహుడు అమరకోశము కాలవర్గంలో మార్గశిర పుష్య మాసాలతోనే మొదటి ఋతువని అన్నాడు. మార్గశిర మాసానికి ఆగ్రహాయణికః అనేది పర్యాయ పదం. ఆగ్రంలో హాయనం కలది.. అంటే సంవత్సరమంతా ముందుండేది, లేక సంవత్సరాగ్రంలో ఉండేది. అంటే మన సంవత్సరాది మార్గశిర పుష్య, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖాల వరకు డేకుతూ వచ్చిందనడం స్పష్టం. అంటే ఆశ్వీజామావాస్య కార్తీక పూర్ణిమ, మార్గశిర పుష్యాలలో సంక్రాంతి పండుగ, మాఘ పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణిమ, హోలీ పండుగ, వసంతపంచమి, వైశాఖ పౌర్ణమీ ఇవన్నీ సంత్సరాదులే.



రామాయణంలో అన్నట్లు వైశాఖంలో సవత్సరం ప్రారంభించే ఆచారం వల్లనే కాబోలు నేడు ఉత్తరాపధంలో సూర్యమాన సంవత్సరాదికి బైసాఖి ( వైశాఖి) అనే వ్యవహారం ఉంది. భారతంలో చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువనే గణన ఉంది. భవిష్య పురాణంలో యుగాదులను గూర్చిన వర్ణన కూడా సంవత్సరాది వైవిధ్యాన్ని ధ్రువ పరుస్తాయి. కృతయుగం వైశాఖ తృతీయనాడు, త్రేతాయుగం కార్తీక నవమినాడు, ద్వాపరయుగం ఆశ్వీజ త్రయోదశినాడు, కలియుగం ఫాల్గుణ పౌర్ణమినాడు పుట్టాయని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్టు, వీటిని యుగాదులంటారని అన్నట్టు ఉంది. (యుగాదయశ్చ కథ్యంతే తధైతా స్సర్వ సూరిభిః) మరి ఈ దినమే ఉగాది ఎలా...















ఋతువులు కాలధర్మంతో సంబంధించినవి కనుక సాయనాలు. ఎప్పటికప్పుడు కదిలిపోతుంటాయి విషువత్తుని బట్టి. విషువత్ మారినా మనం ఇప్పటికీ చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు అంటున్నాము. రామాయణ కాలంలో వైశాఖ జ్యేష్ఠాలు వసంతం. భారత కాలంలో విషువత్ చలించడం వల్ల చైత్ర వైశాఖ మాసాల్లో పడ్డది. అంటే భారతకాలంలో విషువత్ మృగశిరంలో వచ్చి, వరాహమిహిరుని కాలానికి అశ్విన్యాదికి చలించింది. కనుకనే విష్ణు పురాణం "మేషాదౌచ మృగాదౌచ మైత్రేయ విషవః స్థితాః" అని చెప్పింది. తర్వాత మారుతూ వచ్చిందనే కదా..


నేడు మాఘ మాసంతోనే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చైత్ర వైశాఖ మాసాలలో ఎండలు. నేడు ధర్మసింధువుకారుడు ఉగాది కాలానికి వేప కొళ్ళు తినడం చేయమన్నాడు. కాని మన ఉగాది కాలానికి వేప చిగుళ్ళు ముదిరి పూతకూడ రాలిపోయి, పిందెలు పుడుతున్నాయి. వరాహమిహిరుడు క్రీస్తుశకం 5వ శతాబ్దివాడు. తనకు కొన్ని శతాబ్దాల ముందే విషువత్ మృగశిర నుండి అశ్వినీ నక్షత్రం ప్రథమ పాదానికి రావడం గుర్తించాడు. వేదాంగ జ్యోతిష్య కాలంకంటే ప్రాచీనమైన ప్రాహ్మణాల కాలంలో వసంత విషుత్కాలం కృత్తికా నక్షత్రంలో సంభవించిందని పరిశీలించాడు. తనకాలంలో వసంత విషువత్కాలం అశ్విన్యాదిలో సంభవించడం చేత ఆనాటి నుంచి ఉత్తరాయణం దేవమానదినం ప్రారంభం కావడం ప్రాచీన సాంప్రదాయం కనుక అదే వసంత కాల ప్రారంభం గాను, ఆనాడే సంవత్సర ప్రారంభం గాను నిర్ణయించి మాస ఋతు సామరస్యం చేసాడు. వసంత విషుత్కాలం చైత్రమాస ప్రారంభంగా పరిగణితమైందన్నమాట, కాని మనం ధర్మసింధు కారుడన్నట్టు శుక్ల ప్రతిపదాది నుంచి అమావాస్యతో ముగిసే కాలాన్ని నెలగా పరిగణిస్తున్నాము. నాటినుంచి నేటివరకు చైత్రమాసంలోనే ఉగాది పండుగ అనే ఆచారం ఏర్పడింది...by sri poorna mohan





No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS