Monday, March 23, 2020

దీపారాధనలు కొన్ని ప్రదేశాలలో వెలిగించడం వల్ల విశే షమైన ఫలితాలు ఇస్తాయి

దీపారాధనలు కొన్ని ప్రదేశాలలో వెలిగించడం వల్ల విశే షమైన ఫలితాలు ఇస్తాయి




మనము ఇంట్లో చేసే నిత్య దీపారాధన ను "వ్యష్టి " దీపారాధన అంటారు. అంటే ఇంటికి వెలుగునిచ్చి, 
ఆ ఇంటిల్లిపాదికి ఐశ్వర్యసంపద కలిగించేది.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
దేవాలయాలలో చేసే దీపారధనకు దేవతల అనుగ్రహం కలుగుతుంది...విశేష ఫలితాలు లభిస్తాయి.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
తులసి కోట వద్ద చేసే దీపారాధనని " బృందావన" దీపారాధన అంటారు.
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
దేవుడికి ప్రత్యేకించి చూపించే దీపారాధనను "అర్చనా" దీపాలు అంటారు.
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼


నిత్య పూజలలో ఉపయోగించే చిరుదీపాలను నిరంజన దీపాలంటారు.
🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜
గర్భగుడిలో వెలిగించే దీపాన్ని "నందా" దీపము అని అంటారు.
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
లక్ష్మిదేవి ఉన్న గర్భగుడిలో గుడిలో వెలిగించే దీపాన్ని "లక్ష్మి దీపం" అంటారు.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
దేవాలయ ప్రంగణములొనున్న బలిపీఠం పై వెలిగించే దీపాన్ని ఆ దేవాలయ దృష్టి నివారణగా "బలిదీపం" అని అంటారు.
🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋
ఆ సమీపాన ఉన్న ఎత్తూయిన స్థంబం పై వెలిగించిన దీపాన్ని "ఆకాశదీపం" అంటారు.
💧💧💧💧💧💧💧💧💧💧
అలాగ పంచాయతన దేవాలయాలలో దేవతలు..శివుడు,విష్ణువు,అంబిక,గణపతి,ఆదిత్యుడు
(సూర్యుడు) లున్న ఒక్కొక్క దేవత దగ్గర వెలిగించే దీపారధనకు వివిధ పేర్లు ఉన్నాయి. 
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
శైవరూపంలో నందిరూపంగా, నాగరూపంలో మేళవించిన దీపాలు కనిపిస్తాయి.
విష్ణువు వద్ద దీపకృతులు :శంఖు,చక్ర,గద,పద్మ"రూపాలు కనిపిస్తాయి.
ఏక ముఖం- మధ్యమం, ద్విముఖం - కుటుంబ ఐక్యత, త్రిముఖం-ఉత్తమ సంతాన సౌభాగ్యం, చతుర్ముఖం -పశుసంపద మరియు ధన సంపద, పంచముఖం సిరిసంపదుల వృద్ధి ఫలితములు ఉండును.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అలాగే మట్టి, వెండి పంచలోహాదుల ప్రమిదలు దీపారాధనకు వాడటం శ్రేష్టం.
వెండి కుందులు అగ్రస్థానం . పంచ లోహపు కుందులు ద్వితియ స్థనం.
దీపారాధన చేసేటప్పుడు తప్పనసరిగా ప్రమిదల క్రింద చిన్న పళ్ళెము పెట్టడం శ్రేష్టం. 
మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే, ఆ ప్రమిద క్రింద 
మరో ప్రమిద పెట్టాలి.
ఇంట్లో నిత్య దీపారాధన సంధ్యా సమయాలలో తప్పనసరిగ చెయ్యాలి. 
నిత్యం శుభఫలితాలను ఇస్తు, దుష్ట శక్తులు నశిస్తాయి. 
ఆ ఇంటా అందరు క్షేమముగా ఉంటారు
💐💐💐💐💐💐💐💐💐💐

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS