కలలో_పువ్వులు_కాయలు_చెట్లు_కనిపిస్తే... ఆ_కలల_అర్ధాలు...
--> తలలో పువ్వులు పెట్టుకున్నట్లు కల వచ్చినచో అధిక సంతోషం కలుగుతుంది.
--> పువ్వులు గల చెట్లను కలలో చూసినట్లైతే చేయు పనుల్లో ఆటంకాలు కలుగుతాయి.
--> పూవ్వు గల చెట్లను కలలో చూసినచో సంతానప్రాప్తి కలుగును.
--> పువ్వులను వాసన చూసినట్లు కల వచ్చినచో స్తీ సౌఖ్యం, స్త్రీ వలన ధనలాభం కలుగుతుందట.
--> పచ్చని కాయలు గల చెట్టును కలలో వస్తే మాత్రం అనుకున్న కార్యములు సకాలంలో పూర్తికావు.
--> కలలో తెలుపు రంగు పువ్వులు కనిపిస్తే ప్రశాంతత చేకూరుతుంది.
అలాగే రెడ్ రోజ్‌లు ప్రేమకు, పసుపు రంగు పుష్పాలు స్నేహానికి ప్రతీతంగా చెబుతారు.
--> కలలో పూలు గానీ, పండ్లు గాని కనిపించడం వలన శుభకార్యాల్లోనూ దైవకార్యాల్లోను పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది. సంతానం లేనివారికి సంతానం కలగడం వంటి కొన్ని కోరికలు నెరవేరుతాయి. అయితే కాలంకాని కాలంలో ఇవి కనిపించడం వలన అసంతృప్తిని కలిగించే సంఘటనలు ఎదురౌతాయి.
--> కలలో ఎర్రటి పూలతో నిండిన వృక్షాలు కనిపిస్తే అశుభం.
--> చెట్టు ఎక్కినట్లు కలవస్తే ఆరోగ్యం, ధనలాభం, విందు భోజనం, కార్యజయము లభ్యమవుతాయి.
--> పెరట్లో పూలచెట్టు, పండ్ల మొక్కలు, బావి ఉన్నట్లు కనిపిస్తే గుణవతి అయిన భార్య, పేరు కలిగిన పుత్రులు కలుగుతారు.
--> పచ్చని పైరు మీద నడిచిపోతున్నట్లు కనబడితే జీవితంలో చక్కటి అభివృద్ధి కలుగుతుంది. పొలం పైరు పంటలతో కనిపిస్తే ధనలాభం.
--> ప్రత్తి చెట్లు, పూలు పూయని చెట్లు కలలో కనిపిస్తే చెడు జరుగుతుంది.
No comments:
Post a Comment