Thursday, April 30, 2020

MAHABHARATAM 20 TELUGU MOVIES మహాభారతం 20 తెలుగు చలనచిత్రములు

  MAHABHARATAM 20 TELUGU MOVIES

మహాభారతం 20 తెలుగు చలనచిత్రములు



మీకు నచ్చిన సినిమా కోసం దానికి సంబంధించిన చిత్రం మీద క్లిక్ చెయ్యండి





 Maya bazar in Black and white మాయా బజార్ బ్లాక్ అండ్ వైట్ లో 1957

Maya bazar in color మాయా బజార్ పూర్తిగా రంగులతో 1957
usha parinayam .ఉషా పరిణయం- 1961

 Bheeshma భీష్మ 1962

 Nartanasala నర్తనశాల 1963

 Sri krishna Arjuna yuddham శ్రీ కృష్ణార్జునయుద్ధం 1963
Babruvahana బభ్రువాహన 1964

Karna కర్ణ 1964
 Veerabhimanyu. వీరభిమాన్యు 1965

 Prameelarjuneeyam ప్రమీలఅర్జునీయం 1965
Pandava vanasam only songs పాండవ వనవాసం 1965 పాటలు మాత్రమే
Srikrishna pandaveeyam శ్రీ కృష్ణ పాండవీయం 1966
Bheemaanjaneyayuddham భీమంజనేయ యుద్ధం 1966
Bala bharatam బాల భారతం 1972
Dana Veera Soora Karna 1977 దాన వీర శుర కర్ణ
Kurukshetram కురుక్షేత్రం 1977
శ్రీ మద్విరాట్ పర్వం Sri Madvirata Parvam 1 1979
శ్రీ మద్విరాట్ పర్వం Sri Madvirata Parvam 2 1979
Ekalavya ఏకలవ్య 1982
SriKrishnaArjunaVijayam శ్రీ కృష్ణార్జున విజయం 1996

             మహా భారతం బొమ్మలతో - 2014



Tuesday, April 28, 2020

YOGULU CHARITRALU 5 TELUGU MOVIES యోగుల చరిత్రలు 5 తెలుగు చలన చిత్ర ములు


YOGULU CHARITRALU 5TELUGU MOVIES యోగుల చరిత్రలు 5 తెలుగు చలన చిత్ర ములు

శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం ,జగద్గురు ఆదిశంకర ,శ్రీ షిర్ధి సాయిబాబా మహత్యం,శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర,

 వివేకానంద




 మీకు నచ్చిన సినిమా కోసం దానికి సంబంధించిన చిత్రం మీద క్లిక్ చెయ్యండి.
Sri Mantralayam Raghavendra Swamy Mahatyam శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం 1985

Jagadguru Adi Sankara జగద్గురు ఆదిశంకర 2013

Sri Shirdi Sai Baba Mahatyam శ్రీ షిర్ధి సాయిబాబా మహత్యం 1986

Sri Madvirat Veerabrahemdra Swamy Charitra శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర 1984



Vivekananda - TELUGU MOVIE  వివేకానంద తెలుగు చిత్రం



Monday, April 27, 2020

Sri Raghavendra Swami Mahatyam - శ్రీ రాఘవేంద్ర స్వామి మహత్యం | Full Episodes

 Sri Raghavendra Swami Mahatyam -

శ్రీ రాఘవేంద్ర స్వామి మహత్యం | Full 
(1 to 101) Episodes


 మీకు నచ్చిన దాని కోసం సంబంధించిన చిత్రం మీద క్లిక్ చెయ్యండి 101 Episodes
"మంచాల అనే కుగ్రామాన్ని మంత్రాలయంగా మహిమాలయంగా మార్చిన రాఘవేంద్రుడి జీవితంలో ఎన్నో అనూహ్యమైన మలుపులు మరెన్నో ఆసక్తికరమైన సంఘటనలు ఆశ్చర్య చకితుల్ని చేసే మహిమలు చోటు చేసుకున్నాయి. వాటికి దృశ్యరూపాన్నిస్తూ ""శ్రీ రాఘవేంద్ర స్వామి మహత్యం "" అనే భక్తి రస ధారావాహికను సవినయంగా అందిస్తోంది మీ జీ తెలుగు.





తెలుగువారు గొప్ప పుణ్యం చేసి ఉంటారు. కాకపోతే మరేంటి! దేశమంతా గోవిందా గోవిందా అని తల్చుకుంటూ చేరుకునే ఏడుకొండలు శ్రీనివాసుడు మన దగ్గరే ఉన్నాడు. వైష్ణవులంతా అవతార పురుషునిగా భావించే రాఘవేంద్రుడూ ఇక్కడే ఉన్నాడు. ఈ శ్రావణ బహుళ విదియనాటికి (ఆగస్టు 9), రాఘవేంద్రస్వామివారు సజీవసమాధిని పొంది సరిగ్గా 346 ఏళ్లు కావస్తున్నాయి. ఆ సందర్భంగా స్వామివారి తలపు...


స్వామివారు 1595లో తమిళనాడులోని భువనగిరి అనే గ్రామంలో తిమ్మనభట్టు, గోపికాంబ అనే దంపతులకు జన్మించారు. ఈ దంపతులు వేంకటేశ్వరుని భక్తులు కావడంతో తమ కుమారునికి వెంకటనాథుడు అని పేరు పెట్టారు. వేంకటనాథుడు అక్షరాభ్యాసం నుంచే సకల శాస్త్రాలనూ ఔపోసన పట్టసాగాడు. నాలుగు వేదాలతో సహా ఆధ్మాత్మికలోకంలో వినుతికెక్కిన సకల గ్రంథాల మీదా అతను పట్టు సాధించాడు. యుక్తవయసు వచ్చేసరికి తానే పదిమందికీ బోధించే స్థాయిలో జ్ఞానాన్ని సాధించాడు.




వెంకటనాథుడు తన విద్యను ముగించుకుని ఇంటికి తిరిగివచ్చేసరికి ఆయనకు సరస్వతీబాయితో వివాహం జరిపించారు. వారికి ఓ చక్కని కుమారుడు కూడా జన్మించాడు. అయితే వేంకటనాథడు ఆధ్మాత్మిక గ్రంథాలని కేవలం చదవలేదు. వాటిని మనసారా ఆకళింపు చేసుకున్నాడు. వాటిలో నిత్యం వినిపించే మోక్షమనే పదమే తన లక్ష్యం కావాలనుకున్నాడు. అందుకే కుంబకోణానికి చేరుకుని అక్కడ సుధీంద్ర తీర్థులు అనే పీఠాధిపతి వద్ద శిష్యరికం సాగించాడు.

వేంకటనాథుని జ్ఞానం, వాదనాపటిమ చూసిన సుధీంద్ర తీర్థులు ముగ్థులైపోయారు. ఒకానొక సందర్భంలో ఆయన కూడా రాయలేకపోయిన ఒక ఘట్టాన్ని వేంకటనాథుడు పూరించాడట. ఆ సందర్భంగా గురువుగారు ఆయనకు ‘పరిమళాచార్య’ అన్న బిరుదుని అందించారట. ఇక సుధీంద్ర తీర్థునికి అవసాన దశ రాగానే... తన వారసునిగా వేంకటనాథుడు తప్ప మరో పేరే స్ఫురించలేదు. గురువుగారి వారసత్వాన్ని కొనసాగించేందుకు, వేంకటనాథడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడు. తన ఇష్టదైవమైన రాముని పేరుమీదుగా ‘రాఘవేంద్ర తీర్థులు’గా మారి గురువుగారి శ్రీమఠం బాధ్యతలను తలకెత్తుకున్నాడు.

స్వామివారు చాలా ఏళ్లు కుంబకోణలోని శ్రీమఠాన్ని నిర్వహించారు. పిదప ధర్మప్రచారం చేస్తూ ఉత్తర దిక్కుగా బయల్దేరారు. స్వామి ఒకో ఊరు దాటుతూ... తన ఉపన్యాసాలతోనూ, తర్కంతోనూ ప్రజలందరినీ భక్తి మార్గానికి మరలిస్తూ సాగారు. ఆ సందర్భంగా ఆయనకు ‘గురుసార్వభౌమ’ అన్న బిరుదు వరించింది. ఇలా సాగుతున్న స్వామివారు కర్ణాటక సరిహద్దులోని పంచముఖికి చేరుకున్నారు. అక్కడ 12 సంవత్సరాలపాటు పంచముఖి ఆంజనేయుని ఉపాసించారట. ఆయన దీక్షకు మెచ్చి ఆ స్వామివారు పంచముఖి రూపంలోనే దర్శనమిచ్చారట. 


అక్కడి నుంచి స్వామి ఆదోనికి చేరుకున్నాడు. అప్పట్లో మసూద్‌ఖాన్‌ అనే ముస్లిం రాజు అదోనిని పాలించేవాడు. స్వామివారి మహిమలకు ముగ్ధుడైన మసూద్‌ఖాన్‌, తన రాజ్యంలో స్వామివారికి ఎలాంటి లోటూ ఉండదని హామీ ఇచ్చాడు. స్వామివారు సాక్షాత్తూ ఆ ప్రహ్లాదుని అవతారం అని భక్తులు విశ్వాసం. అందుకు తగినట్లుగానే ప్రహ్లాదుని రాజ్యంలోని భాగమని చెప్పబడుతున్న మాంచాల అనే గ్రాహానికి చేరుకున్నారు రాఘవేంద్రులు. అక్కడే తాను జీవసమాధి చెందబోతున్నట్లు ప్రకటించారు.

1671 శ్రావణ బహుళ విదియనాడు స్వామివారు సాలగ్రామాల తోడుగా, వేదమంత్రాల సాక్షిగా.... సజీవంగా మాంచాల గ్రామంలోని బృందావనంలోకి ప్రవేశించారు. అదే ఇప్పుడు మంత్రాలయం అన్న పేరుతో పిలవబడుతోంది. తాను బృందావనంలోకి ప్రవేశించినప్పటికీ, 700 ఏళ్లపాటు జీవించే ఉంటానని ఆయన చెప్పారట. అందుకు సాక్ష్యంగా ఇప్పటికీ స్వామివారు పలుభక్తులకు దర్శనమిచ్చినట్లు చెబుతారు. బ్రటిష్‌వారు పాలించే సమయంలో కర్నూలు కలెక్టరుగా విధులు నిర్వహించిన సర్ థామస్ మన్రోకు సైతం స్వామివారు కనిపించినట్లు తెలుస్తోంది.

మధ్వాచార్యులు స్థాపించిన ద్వైతమత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలోనే రాఘవేంద్రులు తన జీవితాన్ని గడిపేశారు. కేవలం ప్రవనచాల ద్వారానే కాకుండా సుధాపరిమళం వంటి అనేక గ్రంథాలను రచించడం ద్వారా మధ్వ సిద్ధాంతాన్ని బలపరిచారు. జ్ఞానాన్ని పలికించడంలోనే కాదు, సరిగమలు వినిపించడంలోనూ స్వామివారు దిట్ట. ఆయన వీణ మోగిస్తుంటే అలౌకికమైన అనుభూతి కలిగేదట. ఇప్పటికీ మంత్రాలయంలోని ఆయన సన్నిధికి చేరుకున్న ప్రతిఒక్కరికీ ఇదే అనుభూతి కలుగుతూ ఉంటుంది.


- నిర్జర.

Sunday, April 26, 2020

అప్పన్న స్వామికి... చందన సేవ!



అప్పన్న స్వామికి...
           చందన సేవ!

ఏడాది పొడవునా చందనలేపనంతో దర్శనమిచ్చే ఆ స్వామి... అక్షయ తృతీయ నాడు మాత్రం నిజరూపంలో సాక్షాత్కరిస్తాడు. ఆయనే సింహాచలం వరాహనరసింహుడు. చందనోత్సవం పేరుతో వైశాఖ శుద్ధ తదియ నాడు సింహాచలంలో ఎంతో వైభవంగా జరిగే ఈ కార్యక్రమం భక్తజనావళికి కన్నులపండుగే!

ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే సుందర ప్రదేశం సింహాచలం. ఆ కొండల్లో వెలసిన స్వామే వరాహనరసింహుడు. అప్పన్నగా చందనలేపనంతో కనిపిస్తూ, ఆ పరిమళాలను వెదజల్లుతూ భక్తులను అనుగ్రహించే వరాహనరసింహస్వామి... ఉత్తరాంధ్ర ప్రజలకు ఆరాధ్యదైవం. పేరుకు ఉగ్రరూపుడే అయినా శాంతవదనంతో దర్శనమిస్తూ... కోరిన కోర్కెలు తీర్చే ఈ దేవుడు ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే నిజరూపంతో భక్తుల పూజలు అందుకుంటాడు. ఆ ఒక్కరోజే వైశాఖ శుద్ధ తదియ. అంటే... అక్షయ తృతీయ. చందనోత్సవం పేరుతో జరిగే ఆ కార్యక్రమాన్ని ఆలయ పూజారులూ, పూసపాటి వంశస్థులూ కలిసి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ఎందుకంత ప్రత్యేకత అంటే... ముందు స్వామి ఆవిర్భావం గురించి తెలుసుకోవాల్సిందే.


పురాణాల ప్రకారం... హిరణ్యాక్షుడిని వధించింది వరాహస్వామి. అలాగే ప్రహ్లాదుడి కోరిక మేరకు హిరణ్యకశిపుడిని సంహరించిన అవతారం నరసింహస్వామి. ఉగ్రరూపాలైన ఈ రెండు అవతారాల సమ్మిళితమే వరాహ నరసింహస్వామి. సింహాచలం కొండల్లో వెలసిన ఈ స్వామిని శాంతింపజేసేందుకే చందనలేపనాన్ని సమర్పిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

చందనోత్సవం ఎందుకు.. ఎలా...
కొన్ని వందల ఏళ్లక్రితం అక్షయ తృతీయ నాడు పురూరవుడనే చక్రవర్తి వరాహనరసింహస్వామిని మొదటిసారి దర్శించుకున్నాడట. అప్పటినుంచే స్వామి వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే నిజరూప దర్శనభాగ్యాన్ని ప్రసాదించడం ఓ సంప్రదాయంగా వస్తోందని పురాణాలు చెబుతున్నాయి. వరాహ వదనంతో, మానవ శరీరంతో సింహాచల క్షేత్రంలో విలక్షణమూర్తిగా విలసిల్లిన స్వామి నిజరూపంతో దర్శనమిచ్చేది ఈ రోజే. సాధారణంగా మిగిలిన ఏడాదంతా స్వామికి పన్నెండు మణుగుల చందనాన్ని లేపనంలా అర్పిస్తారు. అక్షయ తృతీయ ముందురోజు ఆ చందనాన్ని తొలగించి, మళ్లీ కొత్త చందనాన్ని దశలవారీగా సమర్పించడం ఇక్కడ ఓ విశేషంగా జరుగుతుంది.

బంగారు గొడ్డలితో...
అక్షయ తృతీయకు వారం ముందునుంచీ ఈ చందనోత్సవం కార్యక్రమానికి అంకురార్పణ జరుగుతుంది. వారంముందుగా ఈ గంధాన్ని రంగరించే ప్రక్రియకు శ్రీకారం చుడతారు ఆలయ నిర్వాహకులు. స్వామికి సమర్పించే ఈ చందనాన్ని కేరళ నుంచి తెప్పిస్తారు. ఆ శ్రీగంధాన్ని మొదట ఆలయంలోని బేడా మండపంలో ఉండే రాళ్లపైన అర్చకులు నియమనిష్టలతో అరగదీసేందుకు ఉపక్రమిస్తారు. అక్షయతృతీయకు ముందురోజున బంగారుగొడ్డలితో స్వామిపైన ఉన్న చందనాన్ని పూర్తిగా తొలగిస్తారు. మర్నాడు స్వామికి సుప్రభాత సేవ చేసిన అనంతరం ఒక వెయ్యీ ఎనిమిది కలశాలతో సింహాచలం కొండలపై నుంచి వచ్చే గంగధార నీటితో అభిషేకిస్తారు. ఏకాంతంగా జరిగే ఈ కార్యక్రమాన్ని వీక్షించలేకపోవచ్చు కానీ... అదయ్యాక స్వామి నిజరూపాన్ని దర్శించేందుకు భక్తులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తారు. ఆ తరువాత ఆలయ స్థానాచార్యులు తూకం వేసి అరవైకిలోల వనమూలికలున్న సుగంధద్రవ్యాల్ని ముందుగా అరగదీసిన శ్రీగంధంతో మిళితం చేస్తారు. అలా మూడు మణుగుల చందనాన్ని స్వామికి అక్షయ తృతీయ రోజున సమర్పిస్తారు. అంటే దాదాపు ఇరవై కిలోల చందనం అన్నమాట. ఆ తరువాత మళ్లీ వైశాఖ పూర్ణిమ రోజున మరో మూడు మణుగులు సమర్పిస్తారు. మళ్లీ జ్యేష్ఠ పూర్ణిమ, అదయ్యాక ఆషాఢ పూర్ణిమరోజున మూడు మణుగుల చొప్పున గంధాన్ని స్వామికి అర్పిస్తారు. చివరకు శ్రావణ పూర్ణిమ నాడు మేలిముసుగు కరాళచందన సమర్పణతో ఈ క్రతువు ముగుస్తుంది. ఇందుకు మొత్తంగా దాదాపు 400 కిలోల చందనాన్ని వాడతారని చెబుతారు ఆలయ పూజారులు. చందనోత్సవం అయ్యాక మరుసటి రోజు నుంచే ఈ గంధాన్ని ప్రసాదంగా అందిస్తారు. స్వామిపైన ఉండే ఈ గంధానికి ఎన్నో ఔషధగుణాలున్నాయని భావించే భక్తులు.. దీన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తారు.

ఎలా చేరుకోవచ్చంటే..
విశాఖపట్నంలో కొలువైన సింహాచలం అప్పన్న క్షేత్రాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలున్నాయి. నగరానికి దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులు తిరుగుతుంటాయి

Saturday, April 25, 2020

అక్షయ తృతీయ విశిష్టత


అక్షయ తృతీయ విశిష్టత
అక్షయం అంటే నాశనం లేనిది. అనంత మైనది.
అక్షయ తృతియ విశిష్టతలు మన పురాణాల ప్రకారం
1  మహావిష్ణువు పరశు రామ అవతారం ధరించి న రోజు
2. త్రేతా యుగం ప్రారం బమైన రోజు
3. గంగమ్మ భువి పై ఉద్బవించిన రోజు
వ్యాస మహార్షి మహా భారతం రచన ప్రారంబించి న రోజు 
5. అన్నపూర్ణా దేవి అవతరంచిన రోజు
6. కుబేరుడు శివానుగ్రహం తో మహాలక్ష్మి ద్వారా అనంత సంపదను పొందిన రోజు
7. శ్రీ కృష్ణుడు దుశ్చా స ను ని బారి నుండి ద్రాపదిని కాపాడిన రోజు
8. శ్రీ కృష్ణుడు కుచేలుడు తెచ్చి న అటుకులు తిన్న రోజు
9 పొండ వరకు వనవాస కాలంలో సూర్యుని ద్వారా అక్షయ పాత్ర లభించిన రోజు
10 ఆదిశంకరుడు ఓ పే ద వృద్ధ జంట కోసం కనక దారా స్థవం స్తుతి 0 చిన రోజు 
11 భద్రినాథ్ ఆలయం తెరుచుకునే రోజు 
12. వూరి జగన్నాథ రథ నిర్మాణం ప్రారంభించే రోజు 
13. సింహాచలం అప్పున్న చందనోత్సవం ప్రారంభ రోజు
14. బృందావనం బంకే బిహారీ ఆలయం లో శ్రీకృష్ణుని పాదాల ను దర్మించే రోజు అందుకే ఈ రోజు సంప దను కాక
భక్తితో దైవీ సంపదను పొందుదాం🙏🙏🙏🙏🙏🙏🙏🙏

నవ కుంజర -1835 నాటి అద్భుత వర్ణ చిత్రం #నవగుంజర ఇది ఎప్పుడైనా విన్నారా???? ఇది ఇక జంతువు,ఇది 9 జంతువులు గా మారగలదు,కనిపించగలదు


నవ కుంజర -1835  నాటి అద్భుత వర్ణ చిత్రం   

మన దేశములో  కళింగ కట్టడాలతో  చాలావరకు  ఈ నవ కుంజర శిల్పాలు ఉంటాయి. పూరీ లో ఈ  నవ కుంజర శిల్పం ఉందిట. వెళ్ళినపుడు చూడాలి . మన ఇతిహాసాలలో ఈ అంశం  లేకపోయినా సరళదాస్ అనే  పదిహేనవ శతాబ్ధికి చెందిన కళింగ కవి తన మహాభారతములో ఈ అంశాన్ని ఉటంకించాడు. అరణ్య  వాస సమయములో  అర్జునుడు పాశుపతం కై తపస్సు చేసినపుడు శ్రీకృష్ణుడు ఓ సారి ఈ నవ కుంజర రూపములో దర్శనమిచ్చాడట. అర్జునుడు ఆ వింత రూపాన్ని చూసి మొదట అస్త్ర ప్రయోగం చేయబోయి మళ్ళీ ఆలోచించగా వెంటనే ఆ రూపం నుండి శ్రీ కృష్ణుడు అర్జునుని పలుకరించి తపస్సు  తీవ్రతరం చేయమని సూచనలు చేసి వెళ్లిపోయారట.
🙏🕉️🙏💐🙏🕉️🙏

#నవగుంజర ఇది ఎప్పుడైనా విన్నారా????
ఇది ఇక జంతువు,ఇది 9 జంతువులు గా మారగలదు,కనిపించగలదు.మహాభారతం లో దీని పాత్ర కూడా అద్భుతం గా ఉంటుంది. విష్ణు మూర్తి అవతారం అయిన మృగం గా ఇది వస్తుంది.ఎవరైతే విశ్వరూప దర్శనం అర్జునుడికి ఇచ్చారో.ఇది గీత లో కూడా చెప్పబడింది.

ఒడియా లో మహాభారతాన్ని పోయెట్ సరలదాస గారు రాశారు.అందులో ఈ నవగుంజర యొక్క గోప్పత్తనాన్ని వర్ణించాడు. ఒకప్పుడు,ఎప్పుడైతే అర్జునుడు ఒక కొండ మీద  తపస్సు చేయగా అప్పుడు విష్ణు మూర్తి ఈ నవగుంజర రూపం లో ప్రత్యక్షమయ్యాడు.

నవగుంజర అనేది ఇలా ఉంటుంది.దీని తల కోడిలా ఉండి, మొత్తం నాలుగు కాళ్లతో ఉంటుంది.అందులో మూడు కాళ్ళ మీద నిలబడి ఉంటుంది.ఆ కాళ్లు ఎలా అంటే,వరుసగా ఏనుగు కాలు,పులి కాలు,గుర్రం కాలు,నాలుగవ కాలు మాత్రం ఒక మనిషి చేతి గా మారి ఒక చక్రాన్ని పట్టుకున్నట్టు ఉంటుంది.దాని మెడ నెమలి మెడ లా,తల పైభాగం లో ఒక  దున్నపోతులా,పూర్తి వెనక భాగం ఒక సింహము లా దాని తోక  పాములా ఉంటుంది.దీనినే నవగుంజర అంటారు.

In Mahabharata, 'Navagunjara' is a creature composed of nine different animals. The beast is considered a form of the Hindu god Vishnu, or of Krishna, who is considered an Avatar (incarnation) of Vishnu. It is considered a variant of the virat-rupa (Omnipresent or vast) form of Krishna, that he displays to Arjuna, as mentioned in the Bhagavad Gita, a part of the epic Mahabharata.

The version of the Mahabharata, written by the Odia poet Sarala Dasa, narrates the legend of Navagunjara (no other version has the story). Once, when Arjuna was doing penance on a hill, Krishna-Vishnu appears to him as Navagunjara.

 Navagunjara has the head of a rooster, and stands on three feet, those of an elephant, tiger and deer or horse; the fourth limb is a raised human arm carrying a lotus or a wheel. The beast has the neck of a peacock, the back or hump of a bull and the waist of a lion; the tail is a serpent.

Copied & Edited: Odiart Museum

Friday, April 24, 2020

RAMAYANAM 20+ TELUGU MOVIES రామాయణం 20+ తెలుగు చలనచిత్రములు.


RAMAYANAM 20+ TELUGU MOVIES రామాయణం 20+ తెలుగుచలనచిత్రములు.
మీకు నచ్చిన సినిమా కోసం దానికి సంబంధించిన చిత్రం మీద క్లిక్ చెయ్యండి

రామాయణం తెలుగు చలన చిత్రాలు

మీకు నచ్చిన సినిమా కోసం దానికి సంబంధించిన చిత్రం మీద క్లిక్ చెయ్యండి









                 Bhookailas 1958 భూకైలాస్




SEETHARAMAKALYANAM 1960 సీతారామకల్యాణం



Seetha Kalyanam 1976 సీతా కల్యాణం


PadukaPattabhishekam 1966పాదుకా పట్టాభిషేకం


Veeraanjaneya 1968 వీరాంజనేయ 



SeetharamaVanavasam1977 
   సీతా రామ వనవాసం



         Sri Rama Pattabhishekam 1978   శ్రీరామ పట్టాభిషేకం



           Sampoorna Ramayanam 1971 సంపూర్ణ రామాయణం




           Sri Rama Katha 1968 శ్రీరామ కథ


       Indrajeet ( Sati Sulochana ) 1961   ఇంద్రజిత్  (సతీ సులోచన)




  Bala Ramayanam1996బాల రామాయణం



               SriAnjaneyaCharitra1981శ్రీ ఆంజనేయ చరిత్ర

SRI RAMA BHAKTHA VEERA HANUMAN 1976  శ్రీ రామ భక్త వీర హనుమాన్   

 Ramayanam Animated Movie in Telugu 2019  రామాయణం బొమ్మలతో

Ramayan-Full Animated Movie-Telugu 2014రామాయణం బొమ్మలతో




   Hanuman Telugu Animated Movie 2010 హనుమాన్ బొమ్మలతో



                    LavaKusa 1963 లవకుశ


        SEETHA LAVAKUSA  1980 సీతా లవకుశ



         Sri Rama Rajyam 2011శ్రీరామ రాజ్యం



               BrahmarshiViswamitra1991      బ్రహ్మర్షి విశ్వామిత్ర



                     Valmiki 1963  వాల్మీకి

Sri Rama Anjaneya Yuddham శ్రీ రామ ఆంజనేయ యుద్ధం 1975


Brief History of Telugu Ramayanam Movies - Antha Ramamayam Special Part- 1   రామాయణం సంబంధించిన చలనచిత్రముల గురుంచి అంతారామమయం భాగం-1




Brief History of Telugu Ramayanam Movies - Antha Ramamayam Special Part -2   రామాయణం సంబంధించిన చలనచిత్రముల గురుంచి అంతారామమయం భాగం-2



Brief History of Telugu Ramayanam Movies - Antha Ramamayam Special Part -3   రామాయణం సంబంధించిన చలనచిత్రముల గురుంచి అంతారామమయం భాగం-3


RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS