Saturday, April 4, 2020

షిరిడి లో శ్రీరామ నవమి ఉత్సవం @ 2020 వీడియో మీరు చూసారా

 Sri Rama Navami Utsavam In Shiridi @ 2020 
మొదటిసారిగా శ్రీ రామనవమి ఉత్సవం 1911 సం .లో షిరిడీలో సాయినాథుని సన్నిధిలో భక్తులచే జరుపబడినది .అనగా రామ జన్మోత్సవం జరుపబడినది .సాయబాబా అవతార కార్యక్రమం హిందూముస్లిం సమైక్యత .1897 సం.లో శ్రీరామ నవమినాడు మొదటి సారిగా ఉరుసు ఉత్సవాన్ని బాబా ద్వారకా మాయిలో ప్రారంభింప చేశారు .అదే పునాది .షిరిడీలో జరిగిన మొదటి శ్రీరామనవమి
సాయబాబా ముస్లింగా కనిపించినా మద్రాసు భజన సమాజ్ మహిళ అరుంధతీ అమ్మాళ్ కు 
రామునిగా సాక్షత్కరించాడు .రామభక్తుడైన డాక్టరు కు రామునిగా దర్శనమిచ్చాడు .
భక్తులకు భావార్థ రామాయణం ,ఆధ్యాత్మ రామాయణము, పారాయణము చేయమనీ 
అదేశించారు .బాబా మహసమాధికి ముందు తాను స్వయముగా వజే అను భక్తునితో రామవిజయం అను గ్రంథాన్ని మూడుసార్లు 
పారాయణ చేయించుకున్నారు .ఉపాసనీ మహరాజ్ తాను రచించిన " సాయినాథ మహిమ 
స్తోత్రం " లో సాయిరూప ధర రాఘవోత్తమం అని 
కీర్తింపబడినాడు .ఈ కలియుగములొ ఆ శ్రీరాముడే సాయిరాముడై అందరినీ అనుగ్రహిస్తున్నారు  .
సాయి గురుబంధులందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు .జై సాయిరామ్ .

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS