Sunday, April 5, 2020

శని భగవానుడు




శని భగవానుడు

 ముఖ్యంగా ఏలినాటి శని మిమ్మల్ని పీడిస్తున్నట్లైతే..?  గుఢ సహిత తిలదాన, హోమ, జపాదులను  చేయడం మంచిది.  శనివారం పూట నవగ్రహాలకు తొమ్మిది సార్లు ప్రదక్షణ చేసి, శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపమెలిగించడం ద్వారా కొన్ని సమస్యలు దరిచేరవని , ఇలా తొమ్మిది వారాలు చేస్తే ఏలినాటి శని ప్రభావంతో కలిగే దోషాలు, కష్టనష్టాలు దూరమయ్యే అవకాశం వున్నది.  అలాగే ఏలినాటి శని దోష నివారణకు శని విగ్రహాన్ని ఇనుముతో చేయించి, దానిని ఓ మట్టి కుండలోగానీ, ఇనుప పాత్రలో గానీ ఉంచాలి. దానిపై నల్లని వస్త్రమును కప్పి నల్ల పుష్పములు నల్ల గంధము, నల్లని పత్రములతో పూజించి బ్రాహ్మణునికి సువర్ణ సహితముగా దానమివ్వాలి. దానితో పాటు నువ్వులు, పులగము దానము చేసినచో ఏలినాటి శని కొంతమేరకైనా నివృత్తి అగును. మరియు  మయూరి నీఎలం ధరించుట,  శని జపం ప్రతి రోజు జపించుట, శని కి తిలభిషేకం చేయించుట, ఈశ్వరాభిషేకం ప్రతి శనివారం రోజు  చేయుట, శని వారం రోజు నవగ్రహాల ఆలయంలో ప్రసాదం పంచుట, ప్రతి రోజు నువుల వుండలు కాకులకు పెట్టుట వలన మరియు శని వారం రోజు రొట్టి పై నువుల నూనే వేసి కుక్కలకు పెట్టుట వలన,  హనుమంతుని పూజ వలన,  సుందరకాండ లేదా నల చరిత్ర చదువుట వలన, కాలవలో కానీ నది లో కానీ బొగ్గులు నల్ల నువులు మేకు కలపటం వలన ,  శని ఏకాదశ నామాలు చదవటం వలన ( శనేశ్వర ,కోన, పింగల , బబ్రు, కృష్ణ , రౌద్ర ,అంతక , యమ, సౌరి, మంద ,చాయపుత్ర ) ప్రతి రోజు చడువటం వలన, బియపు రవ్వ మరియు పంచదార కలిపి చిమలకు పెట్టుట వలన, ప్రతి శని వారం రావి చెట్టుకు ప్రదక్షణం చేసి నల్ల నువులు మినుములు కలిపి నీటిని రాగి చెట్టు కు పోయటం వలన, ఇనుము తో చేసిన ఉంగరం ధరించుట వలన,  నల్ల వంకాయ, నల్ల నువులు, మేకు , నల్లని దుప్పటి దానం, ప్రతి శని వారం శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాళ్ల కు ఆహరం పెట్టుట వలన నల్లని దుప్పటి దానం చేయటం వలన , అయ్యప్ప మాల ధరించుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి కి తల నీలాలు ఇచ్చుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి మాల ధరించుట  ప్రతి శని వారం వెంకటేశ్వర స్వామి,శివుని,  హనుమంతుని దర్శనం, కాలభైరవ పూజ  ఇవి అన్నియు శని భగవానుని యొక్క అనుగ్రహం కొరకు పరిహారములు. 


No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS