Thursday, March 10, 2022

అట్టుకల్ పొంగలా ఉత్సవం (కేరళ) :

అట్టుకల్ పొంగలా ఉత్సవం (కేరళ) :


అ ట్టుకల్ పొంగలా ఉత్సవ సమయంలో తిరువనంతపురంలోని ప్రతీ రహదారి.. ప్రతీ వీధి ఇటుకల పొయ్యిలతో నిండిపోతాయి. కేరళ నుంచే గాక.. ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన మహిళలు... భగవతీ అమ్మవారికి పొంగలి నైవేద్యం సమర్పించేందుకు బారులు తీరతారు. ఉత్సవం జరిగే రోజున.. తిరువనంతపురంలోని ప్రధాన రహదారులపై సైతం.. పొంగళ్లు వండేందుకు మహిళలు పొయ్యిలు ఏర్పాటుచేసుకుంటారంటే అతిశయోక్తి కాదు. చారిత్రక గాధ ప్రకారం.. తిరువనంతపురంలో వెలసిన అట్టుకల్ భగవతీ అమ్మవారిని సాక్షాత్తూ పార్వతీదేవి అవతారంగా భక్తులు విశ్వసిస్తారు. కేరళలోని ప్రసిద్ధమైన దేవీ క్షేత్రాల్లో అట్టుకల్ అమ్మవారి ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది. పార్వతీదేవి ఓ బాలిక రూపంలో ఈ క్షేత్రంలో వెలసిందని.. భక్తులు నివేదించిన పాయసాన్ని నైవేద్యంగా స్వీకరించిందని ప్రతీతి. అందుకు గుర్తుగా ప్రతీ ఏటా ఈ క్షేత్రంలో అట్టుకల్ పొంగలా ఉత్సవం నిర్వహిస్తారు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS