Wednesday, March 9, 2022

జాతక దోషాలు-పరిహార దీపం

 జాతక దోషాలు-పరిహార దీపం



గ్రహాలు మానవ జీవితంపై చాలా వరకూ ప్రభావం చూపిస్తాయి.జాతక చక్రంలో గ్రహాలు బలహీనమైనప్పుడు ఆయా గ్రహాలకు తగిన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.ఆర్థిక సమస్యలు,ఆర్థికంగా ఎప్పటికీ ఉన్నతి సాధించలేకపోవడం లేదా పూర్వీకులు ఇచ్చిన ఆస్తిని పోగొట్టుకోవడం,ఉద్యోగ సమస్యలు,ఉద్యోగంరాకపోవడం, ఆలస్యంగా రావడం,ప్రమోషన్లు,ఇంక్రిమెంట్లు  విషయంలో చిక్కులు ఎదురవడం,  వివాహ సమస్యలు,అకాల మరణాలు,   కుటుంబ సమస్యలు,భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం దూరంగా ఉండడం విడాకుల సమస్యలు,సంతాన సమస్యలు,వ్యవహార చిక్కులు, వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.జాతక చక్రం పరిశీలనలో ఏ గ్రహాలు బలహీనంగా ఉన్నాయో ఆయా గ్రహాలకు సంబంధించిన దీపాలను పెట్టినపుడు ఆ గ్రహ దోషాలు తగ్గి జాతకులు మరింత ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు.నవగ్రహాల అనుగ్రహం కొరకు ఎలాంటి ప్రత్యేకమైన దీపాలు  పెడితే గ్రహదోషాల తీవ్రత తగ్గుతుందో తెలుసు కుందాం.జాతకంలో సూర్యగ్రహ దోషం వున్నవాళ్లెవరైనా లేత ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని ఆ వస్త్రాన్ని ఒత్తులుగా చేసి తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే  సూర్య గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే జాతకంలో చంద్రగ్రహ దోషాలు ఉన్నట్లయితే తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకుని  వత్తులుగా చేసి ఇంట్లో వాయువ్యం మూల దీపం పెడితే చంద్ర గ్రహ దోషాలు తొలగిపోతాయి.కుజదోష నివారణకు ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని ఒత్తులుగా చేసి దక్షిణదిక్కులో ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం పెట్టాలి. జాతకంలో బుధ గ్రహ దోషాలు పోవాలంటే ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని వత్తులు గా చేసి  ఇంట్లో ఉత్తర  దిక్కులో దీపం పెట్టాలి. గురువారం ఈశాన్యమూల పసుపు రంగు వస్త్రం వత్తులతో దీపం పెడితే గురు గ్రహ దోషాలు తొలగిపోతాయి.శుక్ర దోషాలు పోవాలంటే తెలుపు రంగు వస్త్రాన్ని  ఆరు వత్తు లాగా చేసి ఉత్తర దిక్కులో శుక్రవారం పూట దీపం పెట్టాలి. ఆ విధంగా  శుక్ర గ్రహ దోషాలు పోతాయి.శని భగవాన్ దోషాల ఉన్నవాళ్లు నలుపు రంగు వస్త్రం తీసుకొని దానిని ఒత్తులు గా చేసి  శనివారం పడమర దిక్కుల్లో ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం పెట్టండి శనిబగవాన్ గ్రహ దోషాలు తొలగిపోతాయి.అలాగే రాహు గ్రహ దోషాల ఉన్నవాళ్లు బూడిద రంగు వస్త్రం నాలుగు వత్తులు చేసి ఇంట్లో ఆదివారం పూట పడమర దిక్కున దీపం పెట్టాలి అలాగే కేతు గ్రహ దోషాలు వాళ్లెవరైనాసరే చిత్రవర్ణ అంటే  రెండు మూడు రంగులు వస్త్రం  ఏడు వత్తులు మంగళవారం పూట దక్షిణదిక్కులో దీపం పెట్టాలి.జాతక చక్రాన్ని అనుసరించి ఏ ఏ గ్రహాలు బలహీనంగా ఉన్నాయో గమనించి ఆ ప్రకారం ఎన్ని ఒత్తులు వేయాలి,ఏ దిక్కులో దీపం పెట్టాలి,ఏ నూనె వేయాలి అనేది ఆధారపడి ఉంటుంది. సమస్యలు ఉన్నవాళ్లు మీ జాతకచక్రాన్ని పరిశీలింప చేసుకొని దాని ఆధారంగా దీపాలు పెట్టి  సమస్యల నుండి బయట పడి మీ జీవితాన్ని మరింత సుఖమయం చేసుకోగలరని ఆశిస్తూ  ....

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS