జీవితంలో వచ్చే తీవ్రమైన సమస్యలకు
- ఆధ్యాత్మిక తాంత్రిక పరిష్కారాలు.
1.నాలుగు చిన్న మేకులు తీసుకుని నృసింహ మంత్రాన్ని చెబుతూ మీ సింహ ద్వారానికి ఇరుప్రక్కలా దించేయండి. ఎలాంటి దుష్టాత్మలు ఇంట్లోకి ప్రవేశించవు.
2.ఇంట్లోకి వచ్చేముందు ద్వారానికి ఎదురుగా చెప్పులు విడవకండి.
3.మీ పిల్లలు మాట వినడం లేదా?ఆదివారం అష్టాక్షారీ మంత్రంతో వారిపై నుండి ఒక బూరు కొబ్బరి కాయను తిప్పి కూడలిలో పారవేయండి.
4.ఇంట్లో డబ్బు నిలవకుంటే నాలుగు గచ్ఛకాయలు లక్ష్మి మంత్రాన్ని నూట ఎనిమిదిసార్లు చేసి బీరువాలో పెట్టండి.
5.ఎప్పుడూ ఏదో సమస్యతో బాధపడేవారు భైరవుని పేరుమీద కొంచెం మద్యాన్ని తీసుకొని భైరవాష్టకాన్ని చదివి తాగేవారికి ఇవ్వండి.
చిట్టి తంత్రాలు
1.తాంబూలంలో కొద్దిగా జాజికాయను కలిపి వేసుకోవడం ద్వారా ముఖంలో చక్కని వర్చస్సుని పొందగలరు,
2.కొన్ని తెల్ల ఆవాలు తీసుకొని భైరవమంత్రం చదువుతూ మీ యింటికి ఎనిమిది పక్కలా చల్లండి,భైరవుడు మీకు రక్షణ గా ఉంటాడు,
3.కొద్దిగా పాతబెల్లం తీసుకొని ముద్దలా చేసి పదకొండు లవంగాలు గుచ్చి నైఋతిలో పాతి పెట్టండి.ఇంటికి పీడలు తొలగిపోతాయి.
4.శుక్ర వారం రాహుకాలంలో రెండు రొట్టెలు వాటిలో కొద్దిగా బెల్లం కలిపి ఆవుకి తినిపించండి.రాహుగ్రహ దోషాలనుండి విముక్తి లభిస్తుంది.
5.గణపతి ప్రీతి కొరకు మీకు వీలయినపుడల్లా పిల్లలకు తీపి పదార్థాలు పంచండి,
చిట్టి తంత్రాలు
1.బ్యాంకు లో డబ్బులు వేసేముందు ఏదైనా లక్ష్మీ మంత్రాన్ని జపించండి,
2.మీరు ఏరకమైన పొదుపు చేయాలనుకుంటే భరణీ నక్షత్రం లో చేయండి
3.ఆర్థికంగా అర్థం కాని స్థితి ఏర్పడిన సుందరాకాండ పారాయణం చేయండి,
4.శంకపుష్పి వేరుని గురుపుష్యమి రోజు తెచ్చి పూజించి శ్రీ సూక్తం చదివి మీరు డబ్బు లు పెట్టేచోట ఉంచండి,
5.మీరు చేసే ఏదైనా హోమంలో కమలా భీజాలు,నల్లనువ్వులుఇప్పనూనె,ఆవునెయ్యి వేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది .
చిట్టి తంత్రాలు
1.ఋణవిముక్తి కొరకు 108 మందార ఆకులు తీసుకొని శుభ్రంగా తుడిచి వాటిపై ఓంకారాన్ని అష్టగంధం తో దానిమ్మ పుల్లతో వ్రాసి గణపతికి సింధూరం పెట్టి ఆకులు అతికించి గణపతి ని శ్రీ గణేశ ఋణం చింది చింది మంత్రంతో పూజించండి,5 మంగళవారాలు,
2.మంగళవారం ఎర్రపప్పుతో శివలింగం పై పెట్టి ఓం ఋణముక్తేశ్వరాయ నమః చెబుతూ పూజించండి.
3.ఎర్ర గుడ్డలో కొన్ని బియ్యం కట్టి వంటగదిలో పెట్టి అక్కడ ఒక స్వస్తిక్ వేసిఉంచడంవల్ల ధన ఆవాహనం జరుగుతుంది,
4.నెమలి ఫించాన్ని తీసుకొని 21 రోజులు లక్మీ మంత్రాన్ని చదివి పూజించి సింహద్వారం పై లేదా బీరువాలో పెట్టండి ,ధనం రావడం జరుగుతుంది
శత్రుబాధా నివారణకు ........
1.తెల్ల జిల్లేడు వేరు కృత్తికా నక్షత్రం రోజు సాయం సంధ్య వేళలో తెచ్చి కుడిచేతి ముంజేతికి కట్టుకోండి.
2.తెల్ల ఆవాలు నృసింహ,లేదా భైరవ మంత్రంతో మంత్రించి మీ ఇంటి ఆవరణ లో చల్లడం వల్ల శత్రువు మిమ్మల్ని బాధించడు
No comments:
Post a Comment