Sunday, March 29, 2020

జనవరి నెల: సాయి డైరీలో ముఖ్యాంశాలు


జనవరి నెల:    సాయి డైరీలో ముఖ్యాంశాలుఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు. https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A1PO60kCbCjin5JfvoiyqEP

జనవరి -1:      A).ఖపర్డే తన డైరీలో బాబాగారు గత జన్మలో తాను, ఖపర్డే, శ్యామా, దీక్షిత్,  జోగ్ అందరూ ఒక గురువుతో కలిసి ఉన్న సంగతిని వివరించడం.       B).బి. వి. దేవ్ గారి నిర్యాణం.    C).బి. వి. దేవ్ గారి తల్లిగారు నోముల ఉద్యాపన నిమిత్తం బాబాగారిని భోజనానికి ఆహ్వానించడం.     D).ధుమాల్ ని నాసిక్ ప్రజలు ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం.    E).రాజమండ్రి- మంగళారం పేట- సాయి సేవా సమితి వారు ఏర్పాటుచేసిన కాగడ హారతి కార్యక్రమం.     F). తూర్పు గోదావరి జిల్లా రేపూరు గ్రామంలో 116 అడుగుల సాయి విగ్రహ ప్రతిష్ఠ.    G). రాజమండ్రి- మంగళారం పేట- సాయిసేవా సమితి వారు సామూహిక సచ్చరిత్ర పారాయణ ప్రారంభం.    H).జగ్గంపేటలో శ్రీ సాయి సచ్చరిత్ర సామూహిక పారాయణ ప్రారంభం.     I). తణుకులో శ్రీ సాయి సచ్చరిత్ర సామూహిక పారాయణం ప్రారంభం.    జనవరి- 2:     A).జానకీబాయి తంబ్లే భర్త మరణం.    B).జానకీబాయి తంబ్లే తన యావదాస్తిని సాయి సంస్థానానికి రాయటం.      C).రాధాకృష్ణమాయి సాయి సంస్థానాన్ని నడపడం.     D). "షిరిడి పుణ్యభూమి" అనే పుస్తకం విడుదల.     జనవరి- 3:      A).గణపతిరావు కోతే పాటిల్ (శ్యామా తండ్రి) నిర్యాణం.     B).బాయిజాబాయి సేవకి గుర్తుగా షిరిడి సంస్థానం వారు పల్లకి సేవలో వారి కుటుంబానికి ప్రత్యేక స్థానం.    C).మేఘశ్యాముడు గాయత్రి జపం విందు. D).సోమనాథ్ నిమోన్కర్ బాబాను బలవంత పెట్టి విభూతిని తీసుకొనుట.     E)."కలియుగ హనుమ శ్రీ  సమర్థ రామదాసు చరిత్ర" పుస్తకం విడుదల.    జనవరి- 4:   ఖపర్డే డైరీ ప్రకారం బాబాగారు చెప్పిన మహారాణి కథ.  జనవరి -7:    A). కోయంబత్తూరులో ఉన్న నాగసాయి మందిరం విశేషాలు.      B).సాయి మందిరంలోకి నాగుపాము ప్రవేశించుట.    జనవరి- 8:    A).ఖపర్డే తర్ఖడ్ కి బాబా గురించి రాసిన లేఖ.     నాగేశ్వర ఆత్మారాం సావంత్ నిర్యాణం.   B). నాగేశ్వర్ C).ఆత్మారాం సావంత్ సాయి లీల మాసపత్రికకు అందించిన సేవ.    జనవరి- 9:     A).డాక్టర్ వి.వి. బాలకృష్ణగారు నిర్యాణం.    B).బాలకృష్ణ గారి సద్గురు సాయి స్మరణం పుస్తక రచన.    C).గురుదేవులు శ్రీ ఆదిపూడి వేంకట శివ సాయిరామ్ గారు బాలకృష్ణ గారి భార్య అనుమతితో వారపత్రికలో వ్యాసాల ప్రచురణ.  జనవరి -10:     A). బాబా దగ్గరకు వచ్చిన మార్వాడి తనకు వచ్చిన స్వప్నం గురించి బాబా గారికి చెప్పటం. B). మార్వాడి స్వప్నానికి బాబా విశ్లేషణ.     జనవరి-11: A). రాధాకృష్ణమాయి బాబాగారి కోసం తెప్పించిన గ్రామఫోన్ రికార్డు.      B).అంబరం గారు చిత్రీకరించిన సాయి చిత్రపటం.      C). దత్తాత్రేయ నిమోన్కర్   నిర్యాణం.    D).శ్రీ సాయి భక్త మాల పుస్తకం విడుదల.     జనవరి- 12:  A).ఖపర్డే తన డైరీలో రాసుకున్న మాటలు.    B).కల్లూరు శ్రీ రామిరెడ్డి తాతగారు షిరిడి దర్శనం.   C). శివ నేసన్ స్వామివారు ద్వారకామాయి సాయి చిత్రపటాన్ని కల్లూరు రామిరెడ్డి తాత గారికి పంపటం.    D).గురుదేవులు శ్రీ ఆదిపూడి వేంకట శివ సాయిరామ్ గారు తండ్రిగారితో కలసి రామిరెడ్డి తాతగారిని దర్శించుకోవడం.    జనవరి- 13:   సాకోరిలో గోదావరి మాత ఉపాసనీ (బాబాసజీవంగా ఉన్నప్పుడే) పాలరాతి విగ్రహం పాదుకలు ప్రతిష్ట.     జనవరి- 14:    A). మేఘశ్యాముడు సాయికి చేయించిన గంగాస్నానం.    B). వామన్ నామదేవ్ అష్టేకర్ గారిని బాబా గొప్ప గాయకుడిగా చేయుట. C).నానాసాహెబు చాందోర్కరు జననం.     D).గోపాల్ రావు సోమనాథ్ నిమోన్కర్ జననం.    E). ఎన్.వి. గుణాజిగారు  శ్రీ సాయి సచ్చరిత్రకి  రెండోసారి ముందుమాట రాయడం.    F).తిరువన్నామలైలో ఉన్న శేషాద్రి స్వామి ఆశ్రమం విశేషాలు.     G).ద్వారావతి భక్త నివాస్ ప్రారంభోత్సవం.    H).శ్రీ సాయి పాదానంద రామకృష్ణ స్వామీజీ నిర్యాణం.   I). శ్రీ సాయి పాదానంద రామకృష్ణ స్వామీజీ గారు, ఒక భక్తుడికి 25 రోజుల పాటు విష్ణు సహస్రనామావళి పారాయణం చేయడం.    జనవరి- 15:   A). సాయిని దర్శించుకున్న గుప్తేగారికి బాబా చెప్పిన కథ.     B). సాయి మహిమ పుస్తకం విడుదల.   C). 11 మంది సాయి భక్తుల జీవిత విశేషాలతో "సాయి మహిమ" పుస్తకం విడుదల.    D).సాయి జపం -సర్వరోగ నివారిణి పుస్తకం విడుదల.    E).మార్తాండ మహారాజ్ మనోహర్ జననం.    F).కల్లూరు శ్రీ రామిరెడ్డి తాతగారు అవతారం చాలించుట.   G). శ్రీ రామావదూత జీవిత చరిత్ర పుస్తకం విడుదల.     జనవరి-16:     A). దీక్షిత్ గారికి ఒక భక్తుడు రాసిన లేఖ.     B).దీక్షిత్ గారికి రాసిన లేఖలో బాబా ఫోటో ఊదీ యొక్క మహిమ.     జనవరి -17:   A). మేఘశ్యాముడుకి అనారోగ్యం.    B).బాపూ సాహెబ్ జోగ్ సాయిబాబాకి హారతులు ఇవ్వడం.  C). హారతి సమయంలో బాబాగారి చిరునవ్వు.    జనవరి-18:   A). సాయికి మధ్యాహ్న శేజ్ హారతి ఇచ్చిన సీతారాం.  B). గణపతిరావు కోతే పాటిల్ నిర్యాణం  కారణంగా షిరిడిలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లు.     C). ఖపర్డే డైరీ ప్రకారం బాబాగారు చెప్పిన అంధుడి కథ.   D). బాపట్ల వెంకట పార్థసారథిగారు నిర్యాణం.     జనవరి- 21: A). సదాశివ్ దీక్షిత్ (దీక్షిత్ తమ్ముడు) అన్నగారి కోసం షిరిడి రావడం.   B). దీక్షిత్ ని బొంబాయి తీసుకువెళ్లడానికి సదాశివ్ దీక్షిత్ ప్రయత్నం.    C). సింగంశెట్టి విగ్నేష్ అంజన్ గారు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కడం.   D).  పూజా ద్రవ్యములతో వేసిన సాయి చిత్రపటం.      జనవరి- 26:    ఎం. బి.  రేగే గారు సమాధి మందిరంలో శ్రీ బి.వి. నరసింహ స్వామిజి గారి చిత్రపటం ఆవిష్కరణ. జనవరి -27:   A). సాయిబాబా హిజ్ డివైన్ గ్లిమ్సెస్ పుస్తకం విడుదల.     B). తాజుద్దీన్ బాబా జననం.      C).కాలిపోతున్న తాజుద్దీన్ బాబా కుటీరాన్ని షిరిడిలో ఉంటే సాయి ఆర్పటం.    D).తాజుద్దీన్ బాబాని దర్శించుకున్న బూటీ.    E).బూటీనని తాజుద్దీన్ బాబా షిరిడికి పంపుట.   జనవరి- 28:  A). హజరత్ బాబాజాన్ జన్మదినం.    B).మెహర్ బాబా పంచ సద్గురువులు.     జనవరి- 29:    A). ఆళింది స్వామి షిరిడి రావటం.    B). ఆళింది స్వామి చెవిపోటుని బాబా వాక్కు ద్వారా నయం చేయుట.     C). ఖపర్డే  డైరీ ప్రకారం మధ్యాహ్న హారతికి  ఖపర్డేని సాయి నిద్రలేవటం.    జనవరి -30:   A).అవతార్ మెహర్ బాబా సమాధి చెందడం.    B).బాబాగారు  ఖపర్డేని మధ్యాహ్నం ఎలా గడిపావు అని అడగడం

ఫిబ్రవరి నెల: సాయి డైరీ లో ముఖ్యాంశాలు:


ఫిబ్రవరి నెల: సాయి డైరీ లో ముఖ్యాంశాలు: ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు. https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A3iZMwVCoaGBa-iz4foWQJu

ఫిబ్రవరి -3: సద్గురు భగవాన్ శ్రీ నిత్యానంద లీలామృతం పుస్తకం విడుదల. ఫిబ్రవరి -4: A). శ్రీ సాయి కరుణ పుస్తకం విడుదల. B).సరోజినీ మూలే సాయి మ్యాగజైన్ కి తన అనుభవాలు తెలపడం. C). శ్రీరామనవమికి బాబాగారు కాకా మహాజని ఇంటికి వెళ్ళటం. ఫిబ్రవరి- 5: A). ఖపర్డే డైరీ ప్రకారం బాబాగారు లక్ష్మీబాయ్ షిండే కు రొట్టె ముక్క ఇవ్వడం. B).ఖపర్డే మొట్టమొదటిసారిగా షిరిడి ప్రవేశం. ఫిబ్రవరి- 6: A).లేఖ ద్వారా ఉపాసనీ బాబా తన భార్య మరణాన్ని తెలుసుకోవడం. B).ఖపర్డే, దీక్షిత్ ఉపాసనీ బాబాని పరామర్శించటం. C).వి.వి. స్వామినాథన్ అయ్యర్ ఏర్పాటు చేసిన బాబా పూజ. D). సనాతన గణపతికి స్వప్నంలో పరమాచార్య కంచి కామకోటి పీఠాధిపతి కనిపించడం. ఫిబ్రవరి -7: బాబాగారి దగ్గరకి ఒక కోతిని ఆడించే వాడు వచ్చి కోతిని ఆడించడం. ఫిబ్రవరి- 8: A).బాబాగారి చిత్రపటం ద్వారా హార్దాకి చేరుట. B).సదాశివ్ కి, దీక్షిత్ బాబా చిత్రపటం మీ దగ్గరకు వస్తుంది అని లేఖ ద్వారా తెలపడం. C).హార్దాకి చేరిన సాయి చిత్రపటాన్ని పండుగలాగా గ్రామస్తులందరూ సాధు భయ్యా గృహానికి చేర్చడం. ఫిబ్రవరి- 9: A). భరద్వాజ మాస్టర్ గారు మొట్టమొదటిసారిగా షిర్డీ వచ్చి సాయిని ఆశ్రయించడం. B). ఖపర్డే తన డైరీ ప్రకారం 'కిష్యా' అనే బాలుడు పూర్వజన్మ వృత్తాంతాన్ని సాయి తెలపడం. C). బాలల కోసం- బాబా కథలు పుస్తకం విడుదల. D). ఎస్. బి. మహళే కుమార్తెకు రాబోవు మరణం గురించి సాయి హెచ్చరించడం. ఫిబ్రవరి- 10: A). శివమ్మతాయి బాబాగారిని దర్శించుట. B). శివమ్మతాయి బిక్షాటన సాయి మూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించుట. ఫిబ్రవరి -11: A). షిరిడీలో గల దక్షిణ ముఖ హనుమాన్ మందిరం ఎదురు శివలింగం ప్రతిష్ట. B). సాధుభయ్యా గృహంలో కొలువైన సాయి మందిరానికి జండా కట్టాలని భక్తారాం ప్రయత్నించడం. ఫిబ్రవరి-12: A). శ్రీ శివ నేసన్ స్వామి నిర్యాణం. B). గురుదేవులు శ్రీ ఆదిపూడి వేంకట శివ సాయిరామ్ గారు తండ్రిగారితో కలసి శివనేసన్ స్వామిని దర్శించుట. C). సాయి సచ్చరిత్రని ఎన్. వి. గుణాజీ ఇంగ్లీషులోకి అనువాదం. ఫిబ్రవరి- 15- A). శివరాత్రి సందర్భంగా శివుని దర్శించాలని జోకగ్, ఖపర్డే, కుటుంబసభ్యుల ప్రయత్నం. B). హార్దాకి చేరిన సాయి చిత్రపటం ద్వారా సాధుభయ్యాకి నా అనుమతిలేనిది శిరిడి రావద్దు అని సాయి సందేశం. C). సాధుభయ్యాకి జరిగిన పన్ను కుట్టు పుల్ల లీల. D). సాధుభయ్యాని షిరిడి రమ్మని ఆహ్వానం. E). సాధుభయ్యా ద్వారకామాయిలో తనకు కలిగిన పన్ను కుట్టు లీలని బడేబాబాకి వివరించడం. F).సాయిబాబా దర్శనం ఇవ్వలేదని బడే బాబా దుఃఖించడం. G). ఖపర్డే డైరీ విశేషాలు. H). తాగుడు మానివేసిన సంభారేగారిని తాగకుండా సాయి కాపాడుట. ఫిబ్రవరి -16: A). శ్రీ సాయి లీల గుచ్చము పుస్తకం విడుదల. B). శిరిడి సాయి అనుగ్రహ సేవా రహస్యం పుస్తకం విడుదల. C). శిరిడి సాయి అనుగ్రహ సేవా రహస్యం ఒకేరోజు లక్ష గ్రంథాల పంపిణీ. D). కేశవ్ బల్వంత్ ఖపర్డే జననం. ఫిబ్రవరి- 17: A). కృష్ణారావ్ నారాయణరావ్ పరూల్కర్ గారు దీక్షిత్ కి రాసిన లేఖ. B). హార్థాకు చేరినది సాయి చిత్రపటం కాదు, సాక్షాత్తు సాయి బాబాయే అని పరూల్కర్ నిరూపణ. C). పరూల్కర్ తన సోదరుడికి, భార్యకి అనుభవాలు తెలుపమని లేఖ. D). నారాయణ దాదా స్వప్న దృశ్యం. E). పరూల్కర్ భార్యకి స్వప్నం ద్వారా బాబా పంపిన సారే. F). రాజమండ్రిలో ద్వారకామాయి సాయి మందిరం శంకుస్థాపన. G). గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహారాజ్ గారు "ఓం శ్రీ సాయిరాం" నామాన్ని వ్యాప్తి చేయుట. ఫిబ్రవరి- 18: నీలకంఠ సహస్ర బుద్ధే శ్రీ సాయి లీలా మాసపత్రికకు రాసిన లేఖ. ఫిబ్రవరి- 20: ఖపర్డే డైరీ ప్రకారం బాబా పలుకులు. ఫిబ్రవరి- 21: A). గుంటూరులో సాయిమందిరానికి మెహర్ బాబా చేతులమీదుగా శంకుస్థాపన. B). మెహర్ బాబా భక్తులను ఉద్దేశించి సాయిబాబా గురించి ప్రసంగం. C). గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహారాజుగారు చేసిన "ఓం శ్రీ సాయిరాం" నామ జపయజ్ఞం. ఫిబ్రవరి- 23: A). షిరిడి సాయి సంస్థానం వారు రికార్డులను డిజిటలైజేషన్ చేయుట. B).దత్తాత్రేయ రాస్నేకు ఒక మగ శిశువు జననం. C).దత్తాత్రేయ రాస్నే తండ్రితో కలిసి షిరిడి దర్శనం. D). దత్తాత్రేయ రాస్నే తండ్రి బాబా గారిని ఇంకొక మనవడిని ప్రసాదించమని కోరడం. E). సాయిదాస్ రాస్నేకి కుమారుడి జననం. F). షేగాన్ లో గజానన మహారాజ్ గారు ప్రకటితమవడం. ఫిబ్రవరి- 24: A).సాకోరీలో ఉపాసనీ మహారాజ్ సమాధి. B).ఉపాసనీ మహారాజ్ సమాధి పక్కనే సతీ గోదావరి మాత సమాధి. ఫిబ్రవరి- 25: A). మెహర్ బాబా జన్మదినం. B). గుంటూరు ఆటోనగర్ లో గల మెహర్ బాబా మందిరం. C). శ్యామా గ్వాలియర్, నాగపూర్ వెళ్లడానికి బాబా అనుమతి. D). ఎం.బి. రేగే నిర్యాణం. E). ఎం బి రేగే గారు సాయి గురించి పలికిన పలుకులు. ఫిబ్రవరి -27: A). ఖపర్డే డైరీ ప్రకారం బాబా చెప్పిన కథ. B). నలుపు రంగుతో ఎం. రామకృష్ణరావు గారు వేసిన సాయి చిత్రపటం. C). ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి పెన్సిల్ ముక్కుపై రెండు మీటర్ల పొడవున్న సాయి చిత్రం. ఫిబ్రవరి- 29: A). డి.డి. నిరాయ్ జననం. B). డి.డి. నిరాయ్ వేసిన సాయి చిత్రాలు. C).గురుదేవులు శ్రీ ఆదిపూడి వెంకట శివ సాయిరామ్ గారి గృహంలో, డి.డి. నిరాయ్ గారు ఇచ్చిన సాయి చిత్రపటం...

మార్చి నెల:సాయి డైరీలో ముఖ్యాంశాలు:



మార్చి నెల:    సాయి డైరీలో ముఖ్యాంశాలు:ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు. https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A1Pjke1cTdaLA5wkOw0IR2D
 మార్చి- 8:     A). షిరిడిలో సాయి మందిరం మీద వేసవిలో కాటన్ వస్త్రాలు పడి ఉన్న లీల.        B). హేమాడ్ పంత్ ఇంటికి బాబా భోజనానికి (చిత్ర పటం ద్వారా) వెళ్ళడం.      C). జి.వి. నాయుడు గారి నిర్యాణం.      D). అమోల్ చంద్ చంద్రభాను సేఠ్ గారిని శ్రీ బి.వి.నరసింహస్వామిజీ గారు కలుసుకోవడం.     E). కాకాజీ వైద్య బాబాగారికి రాసిన లేఖ.      F).  షిరిడి చూసొద్దాం రండి పుస్తకం విడుదల.       మార్చి- 10:     A).   ఖపర్డే డైరీ విశేషాలు.      B).  భిక్షకు బయలుదేరిన సాయి భక్తుల మీద కోప్పడటం.          మార్చి- 12:    A).  తాత్యాకోతే పాటిల్ నిర్యాణం.       B). దీక్షిత్ వాడా గృహప్రవేశం.      C).  విద్యా నగర్ శ్రీ సాయి కరుణాలయం ప్రారంభోత్సవం.       D).   శ్రీ మాణిక్య మహాప్రభుగారు సమాధి చెందడం.       మార్చి- 13:      A).  కృష్ణారావ్ నారాయణరావ్  పరూల్కర్ గారి అనుభవం.     B).  సాయి కృష్ణారావు కుటుంబాన్ని నర్మదానది ఆవలి ఒడ్డుకు చేర్చుట.      C).  ఖపర్డే షిరిడీ విడిచి అమరావతి రావడం.       మార్చి -14:      A).  షినాయ్ నగరంలో శ్రీ సాయిబాబా మందిరం ప్రారంభోత్సవం.     B).   షినాయ్ నగరంలో శ్రీ సాయిబాబా మందిరంలో గల సాయి నిలువెత్తు చిత్రపటం.         C).  కేశవయ్యజీ స్నేహితుడు సురేంద్ర గారికి వచ్చిన స్వప్నదృశ్యం.        మార్చి- 15:       A).  ఖపర్డే బాబా అనుమతితో అమరావతి నుండి స్వగృహానికి రాక.       B).  లెండీబాగ్ మొదటి హక్కుదారుడు వామన్ గోండ్ కర్ నిర్యాణం.    C). నిచ్చెన వేసిన వ్యక్తికి బాబా 2/- రూ కూలీ ఇవ్వడం.    D).  సంతానం లేని వెంకు షింపే కాంబ్లేకర్ గారికి సంతానాన్ని ప్రసాదించడం.    E). లెండి బాగ్ ని యం.వి. ప్రధాన్ కొని సాయి సంస్థానానికి అప్పగించడం.   మార్చి- 18:     A). ఖపర్డే తన స్వగృహంలో ఉండి షిరిడి స్థితిగతులు జ్ఞాపకం చేసుకోవడం.    B). ద లైఫ్ స్కెచ్ ఆఫ్ సాయిబాబా పుస్తకం విడుదల.      C).   శ్రీ సాయి లీల మ్యాగజైన్ ప్రారంభం.     D).  శ్రీ సాయి లీల మ్యాగజైన్ కి మొదటి సంపాదకుడిగా కాకామహాజని.        మార్చి -20:    A).  శ్రీ సాయి ప్రభ పుస్తకం విడుదల.      మార్చి- 21:    A).    శ్రీ సాయి మంగళ కార్యాలయం ప్రారంభోత్సవం.     B).  బిస్మిల్లా ఖాన్ షెహనాయి ఉస్తాద్ జననం.     C).   శ్రీమతి  మణెమ్మ గారి శ్రీ సాయి సచ్చరిత్ర (Ov to Ov) పుస్తకం విడుదల.   D).   శ్రీ సాయి సందేశామృతం పుస్తకం విడుదల..

నవరత్నాలు NAVARATNALU

నవరత్నాలు NAVARATNALU  వీటిని కిరీటాలు, భుజకీర్తుల్లో ఎక్కువగా వాడినట్లు చరిత్ర చెపుతోంది.  ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.  https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A2bb0wVPc3QKax8L94OlHWu




కెంపు (మాణిక్యం)
వజ్రం,
నీలం,
పుష్యరాగం,
మరకతం,
ముత్యం,
పగడం, (ప్రవాళం)
గోమేదికం,
వైడూర్యం
వీటిన్నింటిని కలిపి నవరత్నాలు అని వ్యవహరిస్తారు.

ఆదివారము - సూర్యుని కోసము కెంపుల కమ్మలు, హారాలు మొదలగున్నవి.

సోమవారము - చంద్రుని కోసం ముత్యాల హారాలు, గాజులు మొదలగునవి.

మంగళవారం - కుజుని కోసం పగడాల దండలు, ఉంగరాలు మొదలగునవి.

బుధవారం - బుధుని కోసం పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి.

గురువారము - బృహస్పతి కోసం పుష్యరాగం కమ్మలు, ఉంగరాలు మొదలగునవి.

శుక్రవారం - శుక్రుని కోసము వజ్రాల హారాలు, ముక్కుపుడక మొదలగునవి.

శనివారము - శని ప్రభావం పడకుండా ఉండడం కోసం నీలమణి హారాలు మొదలగునవి.  మెడలో వేసుకొనే నగలలో అయినా చేతికి ధరించేవి అయినా నవరత్నాలను పొదగడం ఒక చదరపు పద్ధతిలో ఉంటాయి. అయితే తప్పనిసరిగా మధ్యలో రూబీ ఉండాలి. రూబీ సూర్యగ్రహరత్నం. ఈ విశ్వానికి సూర్యుడు కేంద్రం కాబట్తి ఆ గ్రహానికి ప్రాతినిధ్యం వహించే రూబీని మధ్యలో పొదుగుతారు.

శుక్ర గ్రహ రత్నమైన వజ్రాన్ని రూబీకి తూర్పుగా, శని గ్రహరాయి సఫైర్ ని పశ్చిమాన, కేతు గ్రహ రత్నామైన కేట్స్ ఐని ఉత్తరం వైపున, అంగారకుని రత్నమైన పగడాన్ని ఈశాన్య భాగాన, చంద్రుని రత్నమైన ముత్యం ఆగ్నేయ భాగాన, రాగు గ్రహ రత్నమైన జిర్కాన్ ని నైరుతి మూలన, బృహస్పతి గ్రహ రాయి టోపాజ్ ని వాయువ్య మూలన పొదుగుతారు.

నలు చదరంగా, దీర్ఘ చతురస్రాకారంగా కాక ఇతర రూపాలలో కూడా నగలు తయారుచేస్తారు. అయితే సూర్య గ్రహ రత్నమైన రూబీ మాత్రం తప్పనిసరిగా అమధ్యలో ఉండాల్సిందే. బ్రాన్‌లైట్స్ లో నవరత్నాలు వరుసగా ఒకదానిపక్కన మరొకటి ఏర్పాటు చేసినప్పుడు కూడా రూబీ మధ్యలో ఉండేలా చూస్తారు.      నవరత్నాల నగలు తయారీకి ఉపయోగించే అన్ని రాళ్ళు ఒకే సైజులో ఉండాలి. అవి కూడా స్వచ్ఛమైనవి కావాలి. నాసిరకం రత్నాలు వాడితే సత్ఫలితాలు రాకపోగా చెడు ఫలితాలను చవిచూడాల్సి ఉంటుంది. మగవారికోసం నవరత్నాలు పొదిగిన ఉంగరాలు తయారుచేస్తుంటారు. పన్నెండు వరుసలలో నవరత్నాలను వాడి 108 రత్నాల ఉంగరాలను తయారుచేసే పద్ధతి దక్షిణాది రాష్ట్రాలలో ఉంది.

నవరత్నాలలో మేలు ఉన్నప్పటికీ వాటిని ధరించటంలో కొన్ని నియమాలు, జాగ్రత్తలు వహించాలంటుంది శాస్త్రం. నవరత్న శాస్త్రాన్ని నమ్మితే ఆ పద్ధతులను పాటించాల్సిందే. నవరత్న ఎంపిక దగ్గర నిపుణులను సంప్రదించాలి. ఒక్కొక్క రత్నానికి ఒక్కొక్క పద్ధతిలో ధారణకు సిద్ధం చేస్తారు.

పూజ ముగించిన తరువాత ఖగోళ శాస్త్రాన్ని చదివిన పండితులు సూచించిన సమయంలో మాత్రమే నగల తయారీకి ఇవ్వాలి. ఒక్కొక్క తరహా రత్నానికి ఒక్కొక్క ముహూర్త సమయముంటుంది. అదే విధంగా తయారైన నగను తిరిగి ఒక శుభ ముహూర్త సమయంలో మాత్రమే తిరిగి వేసుకోవాలి. నవరత్నాల మీద నమ్మకం మహారాజులనుండి సామాన్యుల వరకు అన్ని వర్గాల వారికీ ఉంది.          మానవ జీవితంలో జ్యోతిషం చాల ప్రాముఖ్యం వహిస్తున్నది, ప్రపంచములోని అన్ని దేశాల ప్రజలు తమ తమ జాతకాలకు సంభందించిన మంచి, చెడుల గురించి తెలుసుకోవడానికి, తగిన దోష నివారణ మార్గాలు గుర్తించి ఆచరించడానికి జ్యోతిష శాస్త్రం మీదనే ఆధార పడుచున్నారు. దేశములూ, జాతులూ, భాషల భేదాలను బట్టి స్వల్ప తేడాలున్నప్పటికీ ప్రపంచములోని జ్యోతిష శాస్త్రాలన్నీ కూడా నవగ్రహాలు మరియు వాటి చలనాల ఆధిపత్యములను అనుసరించే ఫలితాలను తెలుపుతున్నాయి.

      నవగ్రహములు సౌరకుతుమ్బమునకు చెందినవి. భారతీయులు, ముఖ్యంగా హిందువులు ఈ నవగ్రహములను దేవతతలుగా విశ్వసిస్తారు. ఈ నవగ్రహములను రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు శుక్రుడు, శని, రాహువు, కేతువు, లను పేర్లతో గుర్తిస్తారు. ఈ నవగ్రహముల సంచారము మానవుని వ్యక్తిగత జాతకముపై చూపే ప్రభావాన్ని బట్టి ఆ జాతకుని జీవన విధానం నడుస్తూ వుంటుంది. ఏది ప్రపంచదేశాల జ్యోతిష శాస్త్రజ్ఞులు, పండితులందరూ అంగీకరించిన సత్యం.

జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి మానవజాతి వారి వారి జనన కాలాన్ని బట్టి 27 నక్షత్రాలకు చెందినా వారుగా విభజించారు. ఈ 27 నక్షత్రాలకీ, మళ్ళీ ఒక్కూక్క నక్షత్రానికి 4 పాదాలను అంటే మొత్తం 27 నక్ష్ట్రాలకీ 108 పాదాలను నిర్ణయించారు. ఈ 108 పాదాలల్లో జన్మించిన వారిని తొమ్మిది పదాలకు ఒకరాశి చొప్పున మొత్తం 12 రాశులుగా ఏర్పరిచారు. ఈ 12 రాశులు వరుసగా మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనము అనే పేర్లతో పిలవబడుతున్నాయి.

   మనకి నవగ్రహాలు ఉన్నట్లే నవరత్నాలు వున్నాయి. ఈ నవరత్నాలు వాటి వాటి ప్రభావాలను బట్టి కొన్ని గ్రహదోషాల తీవ్రతలను నివారిచి ఉపద్రవాలను నిలువరిస్తాయి. ఈ నవరత్నాలు కెంపు, ముత్యం, పగడం, పచ్చ, పుష్యరాగం, వజ్రం, నీలం, గోమేధికం, వైడూర్యం. ఈ నవరత్నాలు ఏ ఏ దోషాలను నివారిస్తాయో, ఏయే జాతకులకు ఎలా మేలు చేస్తాయో తెలుసుకుందాం.

Saturday, March 28, 2020

శ్రీ లలితా చాలీసా:

శ్రీ లలితా చాలీసా:

లలితామాతాశంభుప్రియా జగతికి మూలం నీవమ్మా
శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం

హేరంబునికి మాతవుగా హరిహరాదుల అవతారం
చండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారం

పద్మరేకుల కాంతులలో బాలత్రిపురసుందరిగా
హంసవాహనారూఢిణిగా వేదమాతవైవచ్చితివి

శ్వేత వస్త్రముధరించి అక్షరమాలను పట్టుకొని
భక్తిమార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి

నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ
ఆదిభిక్షువై వచ్చాడు సాక్షాత్‌పరమేశ్వరుడు

కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా
కామితార్ధ ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు

శ్రీ చక్రరాజనిలయినిగా శ్రీమత్‌ త్రిపురసుందరిగా
సిరిసంపదలు ఇవ్వామ్మా శ్రీ మహాలక్ష్మిగా రావమ్మా

మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో
మహిషాసురుని చంపితిని ముల్లొకాలను ఏలితివి

పసిడి వన్నెల కాంతులతో పట్టువస్త్రపుధారణలో
పారిజాతపు మాలలలో పార్వతిదేవిగ వచ్చితివి

రక్తవస్త్రము ధరియించి రణరంగమున ప్రవేశించి
రక్తబీజుని హతమార్చి రమ్యకపర్ధినివైనావు

కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి
కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలిసితివి

రామలింగేశ్వరురాణివిగా రవికులసోముని రమణివిగా
రమావాణీ సేవితగా రాజరాజేశ్వరివైనావు

ఖడ్గం, శూలం ధరియించి పా్శుపతాస్త్రము చెబూని
శుంభనిశంభుల దునియాడి వచ్చింది శ్రీ శ్యామలగా

మహామంత్రాది దేవతగా లలితాత్రిపురసుందరిగా
దారిద్ర్యబాధలు తొలగించి మహదానందము కలిగించె

ఆర్తత్రాణపరాయణవే అద్వైతామృతవర్షిణివే
ఆదిశంకర పూజితవే అవర్ణాదేవి రావమ్మా

విష్ణు పాదమున జనియించి గంగావతారము ఎత్తితివి
భాగీరధుడు నినుకొలువ భూలోకానికి వచ్చితివి ||లలితా||

ఆశుతోషుని మెప్పించి అర్ధశరీరం దాల్చితివి
ఆది ప్రకృతి రూపిణిగా దర్శ్నమిచ్చెను జగదంబ

దక్షుని ఇంట జనియించి సతీదేవిగా చాలించి
అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదాంబ

శంఖుచక్రము ధరియించి రాక్షససణారము చేసి
లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు

పరాభటారిక దే్వతగా పరమశాంత స్వరూణిగా
చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరియించితివి

పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో
ప్రమధగణములు కొలువుండు కైలాసంబే పులకించే

సురులు, అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కగా
మాణిక్యాలకాంతులతో నీ పాదములు మెరసినవి

మూలాధార చక్రములో యోగినులకు ఆధీశ్వరియై
అంకుశాయుధధారిణిగా బాసిల్లును శ్రీ జగదాంబ

సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణిగా రూపొంది
శంఖనాదము చేసితివి సింహవాహిణిగా రూపొంది

మహామేరుపు నిలయనివి మందార కుసుమమాలలతో
మునులందరు నినుకొలవంగ మోక్షమార్గము చూపితివి

చిదంబరేశ్వరి నీలీల చిద్విలాసమే నీ సృష్టి
చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించె

అంబాశాంభవి అవతారం అమృతపానం నీ నామం
అధ్బుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం

అమ్మలగన్న అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా
జ్ఞాన ప్రసూనారావమ్మా జ్ఞానము నదరికివ్వమ్మా

నిష్ఠతో నిన్నె కొలచెదము నీ పూజలనే చేసెదము
కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మమ్ముకాపాడు

రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్ధింప
అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి

అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో
అసురుల నందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి

గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా
భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి

పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా
అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి

కరుణించవమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా
దరిశనమియ్యగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా

ఏ విధముగ నినుకొలిచినను ఏ పేరున నిను పిలిచినను
మాతృహృదయవై దయచూపు కరుణమూర్తిగ కాపాడు

మల్లెలు తెచ్చితిమి మనసు నీకే ఇచ్చితిమి
మగువలంతా చేరితిమి నీ పారాయణము చేసితిమి

త్రిమాతృరూపా లలితమ్మా సృష్టి స్ధితి లయకారిణివి
నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమవునా

ఆశ్రితులందరు రారండి అమ్మ రూపము చూడండి
అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము

సదాచార సంపన్నవుగా సామగానప్రియలోలినివి
సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతపు

మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి
మహాదేవికి మనసంతా మంగళహారతులిద్దాము. ||లలితా||

#ugadi2020 #panchangam# Rasi Phalalu 2020 || ఉగాది శార్వరి నామ |#ADIPUDI #SAIRAM #ఆదిపూడి సాయిరాం


*యుగయుగాలఉగాది..... ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు. https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A2D4P0X1w64e7D0PeY38wSZ

రామాయణంలో చైత్రం 12 వ నెల. రాముడు ఋతువులన్నీ గడిచి 12 వ నెల అయిన చైత్రమాసంలో శుద్ధ నవమినాడు జన్మించి నట్లు బాల కాండలో ఉంది. (తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిధౌ) దీనిని బట్టి రామాయణ కాలంలో వైశాఖ ప్రారంభమే సంవత్సరాది. మార్గశిర పుష్య మాసాలున్న హేమంతంతో సంవత్సరం ప్రారంభమని కౌత్యుడు మతం. అమరసింహుడు అమరకోశము కాలవర్గంలో మార్గశిర పుష్య మాసాలతోనే మొదటి ఋతువని అన్నాడు. మార్గశిర మాసానికి ఆగ్రహాయణికః అనేది పర్యాయ పదం. ఆగ్రంలో హాయనం కలది.. అంటే సంవత్సరమంతా ముందుండేది, లేక సంవత్సరాగ్రంలో ఉండేది. అంటే మన సంవత్సరాది మార్గశిర పుష్య, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖాల వరకు డేకుతూ వచ్చిందనడం స్పష్టం. అంటే ఆశ్వీజామావాస్య కార్తీక పూర్ణిమ, మార్గశిర పుష్యాలలో సంక్రాంతి పండుగ, మాఘ పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణిమ, హోలీ పండుగ, వసంతపంచమి, వైశాఖ పౌర్ణమీ ఇవన్నీ సంత్సరాదులే.



రామాయణంలో అన్నట్లు వైశాఖంలో సవత్సరం ప్రారంభించే ఆచారం వల్లనే కాబోలు నేడు ఉత్తరాపధంలో సూర్యమాన సంవత్సరాదికి బైసాఖి ( వైశాఖి) అనే వ్యవహారం ఉంది. భారతంలో చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువనే గణన ఉంది. భవిష్య పురాణంలో యుగాదులను గూర్చిన వర్ణన కూడా సంవత్సరాది వైవిధ్యాన్ని ధ్రువ పరుస్తాయి. కృతయుగం వైశాఖ తృతీయనాడు, త్రేతాయుగం కార్తీక నవమినాడు, ద్వాపరయుగం ఆశ్వీజ త్రయోదశినాడు, కలియుగం ఫాల్గుణ పౌర్ణమినాడు పుట్టాయని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్టు, వీటిని యుగాదులంటారని అన్నట్టు ఉంది. (యుగాదయశ్చ కథ్యంతే తధైతా స్సర్వ సూరిభిః) మరి ఈ దినమే ఉగాది ఎలా...















ఋతువులు కాలధర్మంతో సంబంధించినవి కనుక సాయనాలు. ఎప్పటికప్పుడు కదిలిపోతుంటాయి విషువత్తుని బట్టి. విషువత్ మారినా మనం ఇప్పటికీ చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు అంటున్నాము. రామాయణ కాలంలో వైశాఖ జ్యేష్ఠాలు వసంతం. భారత కాలంలో విషువత్ చలించడం వల్ల చైత్ర వైశాఖ మాసాల్లో పడ్డది. అంటే భారతకాలంలో విషువత్ మృగశిరంలో వచ్చి, వరాహమిహిరుని కాలానికి అశ్విన్యాదికి చలించింది. కనుకనే విష్ణు పురాణం "మేషాదౌచ మృగాదౌచ మైత్రేయ విషవః స్థితాః" అని చెప్పింది. తర్వాత మారుతూ వచ్చిందనే కదా..


నేడు మాఘ మాసంతోనే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చైత్ర వైశాఖ మాసాలలో ఎండలు. నేడు ధర్మసింధువుకారుడు ఉగాది కాలానికి వేప కొళ్ళు తినడం చేయమన్నాడు. కాని మన ఉగాది కాలానికి వేప చిగుళ్ళు ముదిరి పూతకూడ రాలిపోయి, పిందెలు పుడుతున్నాయి. వరాహమిహిరుడు క్రీస్తుశకం 5వ శతాబ్దివాడు. తనకు కొన్ని శతాబ్దాల ముందే విషువత్ మృగశిర నుండి అశ్వినీ నక్షత్రం ప్రథమ పాదానికి రావడం గుర్తించాడు. వేదాంగ జ్యోతిష్య కాలంకంటే ప్రాచీనమైన ప్రాహ్మణాల కాలంలో వసంత విషుత్కాలం కృత్తికా నక్షత్రంలో సంభవించిందని పరిశీలించాడు. తనకాలంలో వసంత విషువత్కాలం అశ్విన్యాదిలో సంభవించడం చేత ఆనాటి నుంచి ఉత్తరాయణం దేవమానదినం ప్రారంభం కావడం ప్రాచీన సాంప్రదాయం కనుక అదే వసంత కాల ప్రారంభం గాను, ఆనాడే సంవత్సర ప్రారంభం గాను నిర్ణయించి మాస ఋతు సామరస్యం చేసాడు. వసంత విషుత్కాలం చైత్రమాస ప్రారంభంగా పరిగణితమైందన్నమాట, కాని మనం ధర్మసింధు కారుడన్నట్టు శుక్ల ప్రతిపదాది నుంచి అమావాస్యతో ముగిసే కాలాన్ని నెలగా పరిగణిస్తున్నాము. నాటినుంచి నేటివరకు చైత్రమాసంలోనే ఉగాది పండుగ అనే ఆచారం ఏర్పడింది...by sri poorna mohan





RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS