Tuesday, April 7, 2020

పెళ్ళిలో మాంగల్యధారణ సమయంలో మాంగల్యాన్ని కళ్యాణ వేదికలో ఉన్న ముత్తైదువుల అందరి మేడలలో తాకించిన తరువాత వరుని చేత వధువు మేడలో మాంగల్యధారణ చేయిస్తూ ఉంటారు

పెళ్ళిలో ప్రతీ ఆచారం అద్భుతం, పైగా ప్రతీ ఆచారం వెనుక ఎంతో అర్ధం ఉంటుంది. పెళ్ళిలో మాంగల్యధారణ సమయంలో మాంగల్యాన్ని కళ్యాణ వేదికలో ఉన్న ముత్తైదువుల అందరి మేడలలో తాకించిన తరువాత వరుని చేత వధువు మేడలో మాంగల్యధారణ చేయిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేయిస్తారంతే… ఎంత జాగ్రత్తగా వధూవరుల జాతకాలను చూపించినా, ప్రతినక్షత్రానికి ఒక గండకాలం ఉంటుంది. అలాంటి గండకాలం వస్తే? అన్నటువంటి విషయాన్ని కూడా ఏ కన్యాదాత (తండ్రి) ఆలోచించలేడు. హృదయస్థానంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు. అందుకనే మాంగల్యధారణ చేయించే సమయంలో కూడా మంగళసూత్రాలను వచువు హ్రుదయస్థానానికి తాకేటట్టుగా పట్టుకొమ్మంటారు.

వధువు కళ్యాణవేదిక మీదకి వచేటప్పుడు కూడా గౌరీ పూజ చేసి వస్తుంది. అందరి స్త్రీలకీ ఉపాసనా శక్తి ఒకే రకంగా ఉండదు కదా! ఒక్కొక్కరి స్థాయి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇలా ప్రతి ముత్తైదువు యొక్క మేడలో ఆ మంగళసూత్రాలను తాకించడం చేత ఏ తల్లి ఉపాసన ఎక్కువగా ఉన్నదో తెలియదు. అలా తాకించి కట్టడం వల్ల ఆ ఉపాసన శక్తి కొంత ఆ మంగళ సూత్రాలు తీసుకుంటాయి. తీసుకొని వధువుని దీర్ఘసుమంగళిగా ఉండేటట్లుగా అనుగ్రహించగలిగిన శక్తి వస్తుంది ఇలా చెయ్యడం వలన. ఇలా ముత్తైదువులకు మాంగల్యం తాకించే సమయంలో కొంతమంది లలితా సహస్రం చదువుతారు. పూర్తిగా చదివే సమయం లేకపోయినా “కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరా” అన్న నామం వరకు అయినా చదువుతారు. అలా చదవడం వల్ల ఆ తల్లి యొక్క కృప అప్పుడే మాంగల్యం కట్టించుకోబోతున్న వధువు మీద ఉండి తీరుతుంది.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS