Sunday, April 5, 2020

వ్యాపార వృద్ది



వ్యాపార వృద్ది


 *  నగదు పెట్టె క్రింద నల్ల గురిగింజలు ఉంచటం చేత వ్యాపారం లేదా పరిశ్రమ వృద్ధిచెందును. 

 *  తెల్లని వస్త్రం జెండాగా చేసి రావిచెట్టు పైన ఎగరవేయాలి . వ్యాపార బాధ నివారణ అయ్యి వ్యాపారం వృద్ది అగును. 

 *  బయటకి వెళ్లే ముందు కొన్ని డబ్బులు విడిగా ఒకచోట ఉంచాలి. పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాక ఆ ధనాన్ని ఒక పేదవాని భోజనానికి ఉపయోగించాలి. ఎప్పుడు ఏ కార్యం పై బయటకి వెళ్లినా ఈ ఉపాయం పాటిస్తే ఆదాయంలో నిరంతరం వృద్ది మరియు బీదలకు భుక్తి దొరుకుతుంది కావున కోరిన కొరిక తప్పక నెరవేరును. 

 *  ప్రతినిత్యం ఆంజనేయ స్వామిని స్మరించి పూజించాలి. పాత చెప్పులు బీదవానికి దానం చేయాలి . అయిదు గురిగింజల బరువైన ముత్యం ధరించాలి . వ్యాపారంలో వృత్తిలో ఊహించని ధనలాభం పొందుతారు. 

 *  ప్రతిరోజు వ్యాపార సంస్థ నందు ఉదయం నీళ్లతో చిమ్మి శుభ్రంగా ఉంచాలి. సాయంకాలం చిమ్మకూడదు. అలా చేయడం వలన వ్యాపార సమృద్ధి దెబ్బతింటుంది. 

 *  వ్యాపార స్థలంలో బిచ్చగాడు వచ్చి యాచిస్తే వొట్టి చేతులతో పంపకూడదు. ఏదో ఒక నాణెం తప్పక ఇచ్చి పంపాలి . వ్యాపారం వృద్ది చెందును . ప్రతిరోజు వచ్చేవారికంటే నిజమైన వారికే వర్తించును. 

 *  ఇంట్లో లేదా కార్యక్షేత్రంలో ఏ చెట్టు ఉన్నా దాని మొదట్లో సాయంకాలం పాలు పోసి , అగరుబత్తి వెలిగించుచున్న వృత్తిపరిశ్రమల్లో ఏర్పడే చికాకులు తొలగును. 

 *  భాగస్వామితో వ్యాపారం చేసేవారు మంగళవారం కాని శనివారం కాని పని ప్రారంభించ కూడదు. భాగస్వామిపత్రం పైన గురువారం పసుపు నీటి చుక్కలు చిలకరించాలి. భాగస్వామ్యం సఫలమై వ్యాపారం చిరకాలం నడుస్తుంది. 

 *  దుకాణంలో నష్టం కలుగుతూ , అభివృద్ది సాగకుంటే నెలలోని శుక్లపక్షంలో సూర్యోదయానికి ముందుగా ఒక చిటికెడు పిండి వ్యాపారస్థలంలో ముఖద్వారం పైన చల్లి రావాలి. ఇది చాలా ప్రభావవంతమైన తాంత్రిక చిట్కా. 

 *  చక్కగా సాగే వ్యాపారం హఠాత్తుగా చతికల పడిపోయిన సమయంలో ప్రతి మంగళవారం రావిచెట్టు ఆకులు 11 తీసుకొనిరావాలి. వాటిని శుద్ధజలంతో శుభ్రంగా కడిగాలి . ఒక్కో ఆకుపైన ఎర్రచందనంతో " శ్రీరామ" నామం ఏడుసార్లు 11 ఆకులపైన రాశాక ఆంజనేయస్వామి ప్రసాదం భక్తులకు పంచాలి. యధాశక్తి అధికసంఖ్యలో నేను చెప్పబోయే మంత్రం జపించాలి . 

 జయజయజయ హనుమాన్ గోసాయీ !
 కృపాకరో గురుదేవకి నాయీ !!  

 *  ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండటం కొరకు స్నానం చేసే నీటిలో గన్నేరు , యాలుకలు , విప్పపువ్వులు వేసుకొని స్నానం చేయాలి . అనుకూల ఫలితం వస్తుంది. 

 *  ప్రభుత్వ గౌరవం కొరకు  జైష్టా నక్షత్రం ఉన్నప్పుడు నేరేడు వేరు తెచ్చి దగ్గర ఉంచుకుంటే ప్రభుత్వగౌరవం లభిస్తుంది. 

 *  ఆర్ధిక సంకటం తొలగుట కొరకు ఉదయం నిద్రలేవగానే ధ్యానపూర్వకంగా అరచేతులు చూసుకోవాలి. మూడుసార్లు ముద్దు పెట్టుకోవాలి. తరువాత దంతధావనం చేయాలి . చీమలకు పిండి చక్కర , బూందీ వంటివి వేయాలి . ఈ ప్రయోగాలు తిరుగులేనివి . ఉపయోగిస్తే ఆర్థిక సంకటం తొలగి సుఖసమృద్ధి కలుగును. 

 *  జీవితంలో స్థిరత్వం మరియు సుఖసమృద్ది కలుగుట కొరకు రావిచెట్టు కింద నిలుచుని దానికి జలం సమర్పించాలి. నీటిని ఇనుపపాత్రలో నింపి పోయాలి . ఆ నీటిలో కొంచం చక్కర , నెయ్యి , పాలు కలపాలి. జీవితంలో కల్లోలం , సంఘర్షణ ఎక్కువుగా ఉంటే ఈ ప్రయోగం శనివారం నాడు ప్రారంభించాలి. ప్రతిరోజు స్నానం చేయగానే రావిచెట్టుకు నీటిని అర్పించడం అలవాటు చేసుకోండి . ఆశ్చర్యకరంగా జీవితంలో అనుకుల స్థితి ఏర్పడును.


No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS