Sunday, April 5, 2020

పూజా విధి లో నిషిద్ధ కర్మలు...




పూజా విధి లో నిషిద్ధ కర్మలు...

సువర్ణం చేతికి లేకుండా ఆచమనం చేయ కూడదు. అలా చేస్తే రక్తం తో చేసినట్టు అవుతుంది.
మంత్ర పుష్పం, సుప్రభాతం కూర్చుని చదవరాదు. 
ఈశ్వరుడు కి పవళింపు సేవ నిలబడి చేయరాదు.
బొట్టు, విభూతి లేదా కనీసం బొట్టు అయిన లేకుండా పూజ చేయకూడదు.
ఈశ్వరుడి కి, గురువు కి ఒక చేతి తో నమస్కారం చేయరాదు. అలా చేస్తే పై జన్మ లో చేతులు లేకుండా జన్మించటం కానీ, మధ్య లో చేతులు పోవటం కానీ జరుగుతాయి.
ఈశ్వరుడి కి వీపు చూపరాదు. ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయరాదు.
ఈశ్వరుడి కి చేసే దీపారాధన పర దేవత తో సమానం (యా దేవి సర్వభూతేషు జ్యోతిరూపేణ సంస్థితా). ఆ దీపారాధన తో పుల్లలు కానీ, సాంబ్రాణి కడ్డి కానీ, హారతి కర్పూరం కానీ మరి ఏదైనా కానీ వెలిగించ కూడదు.
పూజ సమయమున ఈశ్వరుడు మన కంటే ఎత్తు లో వుండాలి. అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి. ఎడమ చేయి పూజా విధులలో నిషేధం.
ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకుండా చేయ వలెను.
ఇంట్లో దేవతా విగ్రహాలు బొటన వేలు కన్నా పెద్ద గా ఉండరాదు.
ఈశ్వర నిర్మాల్యం కాలి తో తొక్కరాదు. అలా చేస్తే ఈ జన్మ లో చేసుకున్న పుణ్యం తో పాటు పూర్వ జన్మ లో చేసుకున్న పుణ్యం కూడా నశించును.
రుద్రాక్షలు ధరించే వారు మద్యం, మాంసము తీసుకోరాదు. 

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS