Sunday, April 5, 2020

దీపం లక్ష్మీదేవిరూపం


: దీపం లక్ష్మీదేవిరూపం

*దీపం జ్యోతి పరబ్రహ్మమ్ దీపం జ్యోతి పరాయణమ్*
*దీపేన హారతే పాపమ్ దీప దేవి నమోనమః*

*దీపం పరబ్రహ్మ స్వరూపం. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది. ఆ కాంతి వలయం అందరిదీ. దీపం పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది.*

*అదే...అంధకారాన్ని పటాపంచలు చేయడం. అంధకారమంటే కేవలం చీకటిగా ఉండడమే కాదు.... మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే!*

*ఈ అంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే మాత లక్ష్మీదేవి. ఈ అద్భుతశక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి.*

*కాబట్టే దీపానికి మనం నమస్కరిస్తున్నాము. దీపానికి నమస్కరించడమే కాదు. నమస్కరించి ప్రదక్షిణలు చేసి, పండుగలు చేసుకుంటున్నాం. దీపావళి ఇటువంటి  పండుగేకదా!*

*ఈ దృష్టితో చూస్తే దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టే....ఏ పని ప్రారంభించాలన్నా దీపం వెలిగించి ప్రారంభిస్తాం.*

 *దైవారాధననూ దీపం వెలిగించే ప్రారంభిస్తాం. దీపారాధన చేయకుండా అసలు ఏ పుణ్యకార్యం చేయరు.*



*దీపానిది ఎప్పుడూ ఊర్ధ్వదృష్టే. అధో దృష్టి దానికిలేదు. అంటే కిందకి చూడదు.*

*ఎప్పుడూ పైకే చూస్తూ వెలుగుతుంది. మన మనసు ఊర్ధ్వ జగత్తుపైనే లగ్నం కావాలని చెబుతుంటుంది దీపం. ఇక్కడ ఊర్ధ్వ జగత్తు అంటే కేవలం స్వర్గ లోకం మాత్రమే కాదు.*

*జీవితంలో ఎదుగుదల అని. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆశావాదంతో జీవిస్తూ, శక్తివంతమైన దీపాన్ని దైవారాధన చేసే సమయంలో కొన్ని సూత్రాలు పాటిస్తూ దేవుని వద్ద ఉంచాలి.*

: *దీపం వెలిగించడం వలన కలిగే లౌకిక ప్రయోజనాలు....*

*దీపం జ్యోతిః పరబ్రహ్మం, దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే*

ॐ *దీపపు జ్యోతి పరబ్రహ్మ స్వరూపం, దీపం అన్ని విధములైన చీకట్లను తొలగిస్తుంది, దీపారాధాన అన్నిటిని సాధించిపెడుతుంది. అందుకని నేను సంధ్యా దీపానికి నమస్కరిస్తున్నాను అని పై శ్లోకం అర్ధం.* 

ॐ ఒక్కో దీపానికి ఒక్కక్క ప్రత్యేకత ఉంటుంది. ఆవునేతితో వెలిగించిన దీపాపు కాంతి రోజు కనీసం 1 గంట సమయమైనా చిన్నవయసు నుండి చూడగలిగినట్లైతే దీర్ఘకాలంలో గ్లూకోమా రాదు (కంటికి సంబంధించిన వ్యాధి. షుగరు వ్యాధిగ్రస్తులకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల పూర్తిగా కంటి చూపు కోల్పోవచ్చు. దక్షిణ భారత దేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో షుగరు వ్యాధిగ్రస్తులు చాలా ఎక్కువ).

ॐ నువ్వుల నూనె దీపపు కాంతి కిరణాలు రోజు కనీసం 1 గంట పాటు కళ్ళ మీద పడితే కంట్లో శుక్లాలు (cataract) రావు. ఆవునేయి, నువ్వులనూనెతో వెలిగించిన దీపపు కిరణాలు కళ్ళ దృష్టి (eye sight) ని మెరుగుపరుస్తాయి.

ॐ అందువల్ల మనం చేసే ప్రతి శుభకార్యంలో దీపం తప్పక ఉంటుంది. మనం పూజ సమయంలో దీపం వెలిగించడం చేత ఈ కిరణాలు మన కంటిలోనికి ప్రవేశించి, మనకు మేలు చేస్తాయి. శ్లోకంలో "సర్వ తమోపహం" అంటే అన్ని విధములైన చీకట్లను తొలగిస్తుందని. ఇక్కడ కూడా చూపూ కోల్పోవడం వల్ల జీవితంలో ఏర్పడే అంధకారాన్ని తొలగిస్తొంది దీపం.        

ॐ ఒక గది మధ్యలో ఆవునేతి దీపం వెలిగించి, హృద్రోగులు (heart patients), రక్తపోటు (B.P) తో బాధపడేవారు, ఎక్కువగా ఒత్తిడి (stress) కి లొనయ్యేవారు రోజు 1 గంట సమయం కనుక ఆ దీపం దగ్గర కూర్చుని  చూస్తే కొద్దిరోజులలోనే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని, రక్తపోటు(B.P) అదుపులో ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది.

ॐ మనం చదువుకున్నాం, కాంతి(light)కి విద్యుత్-అయస్కాంత స్పెక్ట్రం (electro-magnetic spectrum)  ఉంటుందని, ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత (temperature) ఆ ప్రాంతంలో ఉన్న కాంతికిరణాల రంగు (color of light rays) మీద ఆధారపడి ఉంటుందని, ఒక్కక్క రంగు కిరణానికి ఒక్కక్క ఫ్రీక్వేన్సి(frequency) ఉంటుందని. అలాగే మనం వెలిగించే దీపపు కాంతికి ఉన్న విద్యుత్-అయస్కాంత శక్తి (electro-magnetic force) ఆ ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత మీద, వాతావరణం మీద తన ప్రభావాన్ని చూపించి ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణాన్ని మారుస్తుంది. గాలిలో మార్పులు తీసువచ్చి, దాని ద్వారా మన శరీరంలోనికి ప్రవేశించి, నాడులను శుభ్రపరచి, వాటి ద్వారా రక్తంలోకి ప్రవేశించి దానికున్న దోషాలను తీసివేస్తుంది. ఇది చాలా సూక్ష్మంగా జరిగే ప్రక్రియ (process).

ॐ *ఆవునేతి దీపపు కాంతికి,* నువ్వుల నూనె దీపపు కాంతికి, మిగితా దీపాల కాంతికి కూడా చాలా సూక్ష్మమైన తేడా ఉంటుంది. అందువల్ల ఒక్కో దీపం ఒక్కొక్క విధమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది.

ॐ *కార్తీక దీపాలను చూసిన* చెట్లు, జంతువులు, కీటకాలకు కూడా పునర్జన్మ ఉండదంటే ఇక వెలిగించిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది కదా. అందుకని దీపాలను వెలిగించండి. వెలిగించే అవకాశం లేనప్పుడు కనీసం గాలికి కొండెక్కిన/శాంతించిన  దీపాలను తిరిగి వెలిగించండి. కుదిరితే కొంచెం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వెలుగుతున్న దీపపు ప్రమిదలలో పోయండి.

దీపం జ్యోతి పరబ్రహ్మ
: *దీపాన్ని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి.*

*చుట్టూరా ఆవరించి ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే, ప్రయత్నించి  చిన్న దీపాన్నయినా వెలిగించడం మంచిది*

*దీపం లక్ష్మీదేవిరూపం*

*దీపం జ్యోతి పరబ్రహ్మమ్ దీపం జ్యోతి పరాయణమ్*
*దీపేన హారతే పాపమ్ దీప దేవి నమోనమః*

*దీపం పరబ్రహ్మ స్వరూపం. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది. ఆ కాంతి వలయం అందరిదీ. దీపం పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది.*

*అదే...అంధకారాన్ని పటాపంచలు చేయడం. అంధకారమంటే కేవలం చీకటిగా ఉండడమే కాదు.... మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే!*

*ఈ అంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే మాత లక్ష్మీదేవి. ఈ అద్భుతశక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి.*

*కాబట్టే దీపానికి మనం నమస్కరిస్తున్నాము. దీపానికి నమస్కరించడమే కాదు. నమస్కరించి ప్రదక్షిణలు చేసి, పండుగలు చేసుకుంటున్నాం. దీపావళి ఇటువంటి  పండుగేకదా!*

*ఈ దృష్టితో చూస్తే దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టే....ఏ పని ప్రారంభించాలన్నా దీపం వెలిగించి ప్రారంభిస్తాం.*

 *దైవారాధననూ దీపం వెలిగించే ప్రారంభిస్తాం. దీపారాధన చేయకుండా అసలు ఏ పుణ్యకార్యం చేయరు.*

*దీపానిది ఎప్పుడూ ఊర్ధ్వదృష్టే. అధో దృష్టి దానికిలేదు. అంటే కిందకి చూడదు.*

*ఎప్పుడూ పైకే చూస్తూ వెలుగుతుంది. మన మనసు ఊర్ధ్వ జగత్తుపైనే లగ్నం కావాలని చెబుతుంటుంది దీపం. ఇక్కడ ఊర్ధ్వ జగత్తు అంటే కేవలం స్వర్గ లోకం మాత్రమే కాదు.*

*జీవితంలో ఎదుగుదల అని. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆశావాదంతో జీవిస్తూ, శక్తివంతమైన దీపాన్ని దైవారాధన చేసే సమయంలో కొన్ని సూత్రాలు పాటిస్తూ దేవుని వద్ద ఉంచాలి.*

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS