జనవరి ఒకటి - దాని కథ:-
ఇప్పుడు మనం అనుసరించే క్యాలెండర్ గ్రెగేరియన్ క్యాలెండర్. ఇదంతా తప్పులతడక, లోపాల పుడక.క్రీశ 1582 లో పోప్ గ్రెగేరియన్ సరిచేసిన క్యాలెండర్ ఇది.ఈ క్యాలెండర్ ప్రకారం మనం యదార్థ సంవత్సరం కంటే 24.6 సెకన్ల ఎక్కువ సమయాన్ని లెక్కించుకుంటున్నాము. ఆప్రకారం 3,513. సంవత్సరాలకు ఒక రోజు ఎక్కువ వస్తుంది. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త JOHN VERSHAL. ఈ లోపాన్ని సవరించటానికి ఒక ఉపాయం చెప్పాడు. అదేంటంటే, క్రీశ 4,000 సంవత్సరంను లీప్ ఇయర్ గా లెక్కించకుండా వదిలేయడం.
ఈ క్యాలెండర్ లోని లోపాలను సరిచేయడం అవసరమని సూచనలు చేస్తూ "నానాజాతిసమితి" ఒక కమిటీ ఏర్పాటుచేసింది. ఆ కమిటీ 185 రకాల ప్కాన్లను పరిశీలించి, క్రీశ 1926 లో ఒక రిపోర్టు ఇచ్చింది. ఇప్పటి దాకా అది ఎటూ తేలలేదు లెండి. ఇంకా ఇలాంటి చిన్నచిన్న చిక్కులు చాలానే ఉన్నాయి. మంచిది...
ప్రపంచమంతా ఒకప్పుడు నూతన సంవత్సరం ఉగాదినాడు ప్రారంభమయ్యేది. బైబిల్ లోని ""ఎజ్రా "" పుస్తకం 10:17 వ వచనం సంవత్సరం లోని మొదటి నెల మార్చి - ఏప్రిల్ లో ప్రారంభమౌతుందని సాక్ష్యం పలుకుతోంది. ఫ్రాన్స్ లో క్రీశ 1582 వరకూ, ఇంగ్లాండులో క్రీశ 1752 వరకూ నూతన సంవత్సరం మార్చి 25 న ప్రారంభం అయ్యేదని చరిత్ర చెబుతూంది. అయితే, కాలగమనంలో ఇది ఎప్పుడు మారిందో తెలియదు కానీ, అది ఏప్రిల్ కు మారింది. అయితే నూతన సంవత్సరం మార్చి లో ఉంచాలా, ఏప్రెల్ లో ఉంచాలా అనేది వారికి కొంత సమస్యగా మారింది. సంవత్సరం ఆరంభం ఎప్పుడూ ఒకే నెలలో ఒకే తేదీన వస్తే బాగుంటుంది అని వారు ఆలోచించసాగారు. ఆ సమయం లో క్రీశ 15 శతాబ్ది చివరి కాలంలో ఫ్రాన్స్ చక్రవర్తి " చార్లెస్ "అంతవరకూ 11 వ నెలగా ఉన్న జనవరి ని ఒకటవ నెలగా నూతన సంవత్సరం గా ప్రారంభించాడు.ఈ విధంగా నేటి మన నూతన సంవత్సరం ప్రారంభమైంది.
ఇందుకు ఎలాంటి శాస్త్రీయ, ప్రకృతి పరమైన, ఆధారమూ లేదు. ముందుగా ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగీసు, స్పెయిన్ దీనిని అంగీకరించాయి. క్రీశ 1699 లో జర్మనీ, క్రీశ 1752లో ఇంగ్లండు, క్రీశ 1873 లో జపాన్, క్రీశ 1912 లో చైనా, క్రీశ 1916 లో బల్గేరియా, క్రీశ 1918 లో రష్యా లు ఈ క్యాలెండర్ ను అంగీకరించాయి. 17,18 శతాబ్దంలో తమ ఆధీనంలో ఉన్న అన్ని దేశాలలో బ్రిటిషు వాడు దీన్ని ప్రవేశపెట్టాడు.
కానీ భారతీయ క్యాలెండర్ ఋషులచే తయారుచేయబడింది. ఆర్యభట్టు, భాస్కరాచార్య వంటి మహాన్ శాస్త్రజ్ఞులచే పరిశోధించబడింది. కొన్నివేల సంవత్సరాల తర్వాత ఏ సంవత్సరం లో, ఏ నెలలో, ఏ రోజున ఏ గ్రహణం వస్తుందో, వారం వర్జ్యము తో సహా చెప్పగలిగేంతగా శోధించబడింది.
ప్రకృతి కి అనుగుణంగా, వసంత ఋతువు చైత్రశుద్ధ పాఢ్యమి రోజున ఉగాది ప్రారంభ మవుతుంది. (కొన్నిచోట్ల వసంత ఋతువు మేశరాశి లో సూర్యుడు ప్రవేశించటాన్ని ఉగాదిగా చేస్తారు.)
ప్రపంచమంతా మొదటి నుంచీ అనుసరిస్తున్న ఉగాదిని కాదని, వాడెవడో ఫ్రాన్స్ వాడు ఏ ఆధారమూ లేకుండా ప్రతిపాదించిన నూతన సంవత్సరం ను ఫాలో అవడం కంటే, ఆత్మాభిమానం కలిగి భారతీయుల మందరమూ మన సాంప్రదాయక ఉగాది నూతన సంవత్సరం ను ఫాలో కావటం ఉత్తమము మరియు మన కర్తవ్యము.
ఏ లోపాలు లేని మన కాలమానం గొప్పతనాన్ని ప్రచారం చేయటమే మన తక్షణ కర్తవ్యం
No comments:
Post a Comment