Monday, January 4, 2021

కుజ దోషం పరిహారం

 చాలామంది అడిగే ప్రశ్న ఏమిటంటే....


మా రోజుల్లో జాతకాలు చూడలేదు అయిన మేము బాగోలే మా అన్న మాట విన పడుతుంటుంది. ఆ రోజుల్లో ఓణీలు కట్టుకునే వాళ్ళు. ఓణీ అనేది, కుజదోష స్థానాలకి ఎండ పడేటట్టుగా చేయబడిన డిజైన్. తద్వారా కొంత దోషపరిహారం అయ్యేది. గోరింటాకు పెట్టే వారు, ఆచార వ్యవహారాలు చెబుతూ పెంపకం ఉండేది. దగ్గర దగ్గర ఊర్లలో ఇచ్చేవాళ్ళు పిల్లలను లేక బందువర్గాలలో ఇచ్చేవాళ్ళు. ఆడ పిల్లలు కూడా ఆరుబయట వెన్నెల్లో ఆడుకునే వారు... సముద్ర స్నానాలు నదీస్నానాలు చేసేవారు... ఇవన్నీ కుజదోషానికి పరిహారాలు గా ఉండేవి. రూపాయి ఖర్చు లేకుండా పరిహారాల అయ్యేవి. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండేది. ఇప్పుడు నమ్మకాలు పోయాయి. చదువులు ఎక్కువ అయ్యేటప్పటికీ తల్లిదండ్రుల మాట వినడం తగ్గింది. ఇప్పుడు పిల్లలకు చెప్పే వాళ్ళు లేకుండా పోతున్నారు. దాదాపుగా చంద్రుడి నుంచి వచ్చే కుజ దోషం పెద్దల మాట వినటం వల్ల తగ్గేది. శుక్రుడి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సమయానికి పెండ్లి అయ్యేది, కాబట్టి శుక్రదోషం ఉండేవి కాదు. ఇప్పుడు అన్ని పోయినాయి. ఆలోచించండి అందరూ🙏🌹🙏🌹పంజాబి డ్రెస్సులు వేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత, కుజ దోషము యొక్క పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. ఈ ఆడపిల్లలకి చెప్పినా వినరు, చెప్పిన మారరు. పంజాబీ వాళ్లు చాలా ఆవేశంగా ఉంటారు...... అదే డ్రస్సులు వేసుకొని మన వాళ్ళు కూడా ఆవేశపూరితులు అవుతున్నారు. ఎవరైకైనా కుజదోషము ఉంది అంటే ముందుగా  లంగా ఓణి దరించ మని చెప్పండి. ఇది పెద్ద రెమిడీ  కింద పని చేస్తు ఉంటుంది.కుజ దోషం పరిహారం కు ఆడ పిల్లలకు గోరింటాకు తప్పకుండా పెట్టేవారు. కానీ ఇప్పుడు మెహింది పేరుతో రెండు మూడు రోజులు లలో గోరింటాకు పోయ విధంగా పెడుతున్నారు. అలా కాకుండా చేతి నిండుగా గోరింటాకు పెట్టుకుంటే కుజ దొషం పరిహారం కాగలదు. ఎరుపురంగు రంగు కుజ గ్రహనికి ప్రతీక......

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS