Monday, January 4, 2021

సూర్యుడు

 సూర్యుడు 


 కశ్యప మహర్షికి దక్షుని పుత్రికయగు అదితికిని ప్రభవ నామ సంవత్సర మాఘ మాస శుద్ద సప్తమి నాడు "వివస్వంతుడు (సూర్యుడు)" జన్మెంచెను కశ్యపుని కొడుకు కనుక "కాశ్యపుడు" అని అదితి కొడుకు కనుక "ఆదిత్యుడు" అని అండమున మృతము లేనివాడు కనుక "మార్తాండుడు" అని నామములు వచ్చెను. సూర్యునకు సంజ్ఞాదేవికిని "వైవస్వతుడు" "యముడు" "యమున" లు జన్మించెను సూర్యుని తీక్షతను భరించలేక సంజ్ఞాదేవి తన నీడను (ఛాయను) తనకు బదులుగా వెల్లి పుట్టింటికి వెల్లిపోయెను. తరువాత ఛాయకు "శని" భగవానుడు జన్మించెను. యముడు ధర్మరాజు అను నామముతో పితృలోకపాలకుడయ్యెను శని గ్రహ పదవిని పొందెను. వైవస్వతుడు రాబోవు మన్వంతరాలలో మనువు కాగలడు. సూర్యుడు పురుష గ్రహం. సూర్యుని స్వభావం రీత్యా పాపి.  సూర్యుడు రాశి చక్రంలో సింహంలో రాజ్యాధికారంలోను, మేషంలో ఉచ్ఛ స్థితిలోను, తులలో నీచ స్థితిలోనూ ఉంటాడు. సూర్యుడికి ఉన్న ఇతరనామాలలో కొన్ని అర్కుడు, ఆదిత్యుడు, అరుణుడు, తపసుడు, పూష, హేళీ, భానుడు, దినకరుడు, మార్తడుడు.

సూర్యుని జాతి క్షత్రియ, తత్వం అగ్ని, వర్ణం రక్తవర్ణం, రజోగుణం, పాప స్వభాభావం, స్థిర స్వభావం, జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు కారకత్వం వహించే రుచి కారం, కారకత్వం వహించే జీవులు పక్షులు, పృష్టోదయం, తూర్పుదిక్కుకు ఆధిపత్యం,  జలభాగం నిర్జల, లోహం  రాగి, శక్తి రాజు, ఆత్మాధికారం శరీరం, ధాతువు ఎముక, కుటుంభ సభ్యుడుగా తండ్రి, శ్యాల వర్ణం,గ్రహ పీడకు   శిరోవేదన, శరీర తాపం, గృహంలో భాగములు ముఖ ద్వారం, పూజా మందిరం, గ్రహ వర్గం  గురువు,

కాల బలం వీరికి పగటి సమయం, దిక్బలం దశమ స్థానం, ఆధిపత్య కాలం ఆయనం,శత్రు క్షేత్రంలు మకరం, కుంభం, విషమ క్షేత్రంములు వృశ్చికం, ధనస్సు, మకరం. మిత్రక్షేత్రం మీనము. సమ క్షేత్రములు మిధునం, కన్య. మిత్రగ్రహాలు :- కుజుడు, చంద్రుడు, గురువు. శత్రు గ్రహాలు :- శుక్రుడు, శని. సమ గ్రహం :- బుధుడు. నైసర్గిక బల గ్రహం :- శుక్రుడు,వ్యధా గ్రహం, :- శుక్రుడు. దిన చలనం :- 1 డిగ్రీ. ఒక్కొక్క రాశిలో ఉండే సమయం :- 30 రోజులు, రాశిలో ఫలమిచ్చే భాగం :- మొదటి భాగం, ఋతువు :- గ్రీష్మ ఋతువు, గ్రహ ప్రకృతి :- పిత్తము. దిక్బలం :- దక్షిణ దిక్కు. 

స్థానభ్రష్టం, భయం , సంపదా , మానభంగం , మహాద్భయ

శత్రు క్షయం , వ్యధా , రోగం , దుఃఖం ,సిద్ది , ధనాదనే

క్రమేణ జన్మ రాష్యాది కురుతేతే పద్మ భాంధవః

తాత్పర్యము : సూర్యుడు జన్మ రాశిలో సంచరించునపుడు స్థాన మార్పిడి , 2 వ రాశికి వచ్చినపుడు భయమును 3 సంపదను 4 మాన హానిని 5 విశేష భయమును 6 శత్రు నాశనం 7 దుఃఖము 8 రోగము 9 విచారమును 10 కార్య సిద్ధిని 11 ధన లాభమును 12 ధన వ్యయమును కల్గించును.

సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఇతర ఖగోళ వస్తువుల సముదాయమే సౌర కుటుంబం. దీన్ని సౌర వ్యవస్థ  అని కూడా అంటారు. నేరుగా సూర్యుని చుట్టూ తిరిగే వస్తువుల్లో అతి పెద్దవి గ్రహాలు. మిగతావి మరుగుజ్జు గ్రహాల వంటి చిన్న ఖగోళ వస్తువులు. సూర్యుడి చుట్టూ పరోక్షంగా తిరిగే వస్తువులు సహజ ఉపగ్రహాలు. వీటిలో రెండు, బుధ గ్రహం కంటే పెద్దవి. సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం ఖగోళంలో ఓ మహా పరమాణు మేఘం దాని గురుత్వ శక్తి కారణంగా కుంచించుకు పోయి సౌర వ్యవస్థ ఏర్పడింది. దీని మొత్తం ద్రవ్యరాశిలో అత్యధిక భాగం సూర్యుడిలోనే ఉంది. మిగతా దానిలో అత్యధిక భాగం బృహస్పతిలో ఉంది. అంతర సౌర వ్యవస్థలోని నాలుగు గ్రహాలు, ఈ గ్రహాలు ప్రధానంగా రాయి, లోహాలను కలిగి ఉంటాయి. ఇవి చిన్న గ్రహాలు కూడా. బాహ్య సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలు రాతి గ్రహాల కంటే చాలా పెద్దవి. వాటిలో అతి పెద్దవైన గురుడు, శని వాయువులతో కూడుకుని ఉంటాయి. ఆ వాయువుల్లో ముఖ్యమైనవి హైడ్రోజన్, హీలియమ్. అన్నిటి కంటే బయట ఉన్న గ్రహాలు - యురేనస్, నెప్ట్యూన్ లు అతిశీతల గ్రహాలు. మీథేన్, అమ్మోనియా వంటి వాయువులతో అవి కూడుకుని ఉంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా దాదాపు వృత్తాకార కక్ష్యలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూంటాయి. సూర్యుడు జ్యోతిష శాస్త్రంలో ఇలా వర్ణించారు. గుండ్రని ముఖం, రక్తవర్ణం, పొడగరి, గోధుమ వర్ణం కలిగిన జుట్టు కలిగిన వాడుగా వర్ణించబడ్డాడు. గుణత్రయాలలో సూర్యుని స్వభావం రజోగుణం. రుచులలో సూర్యుడు కారం రుచికి కారకత్వం వహిస్తాడు. చాతుర్వర్ణములలో సూర్యుడు క్షత్రియ జాతికి కారకత్వం వహిస్తాడు. తత్వం అగ్ని తత్వం, ప్రకృతి పిత్త ప్రకృతి. దిక్కు తూర్పు దిక్కు, లోహము రాగి, రత్నము మాణిక్యము, దిక్బలం దశమ స్థానం, రాశి సంఖ్య 1, కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తర ఆషాఢ నక్షత్రాలకు నక్షత్రాధిపత్యం వహిస్తాడు. శరీరావయవాలలో గుండే మరియు పురుషులకు కుడి కన్ను, స్త్రీలకు ఎడమ కన్ను, రాశ్యాధిపత్యం సింహరాశి, మేహరాశిలో 10 డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిని, సింహరాశిలో 20 ఇగ్రీలలో రాజ్యాన్ని, తులా రాశి 10 డిగ్రీలలో నీచను పొందుతాడు. సూర్యుని ప్రభావం ఉన్న వారు ఆత్మాభిమానం, చురుకు తనం కలిగి ఉంటారు. సంఘంలో పలుకుబడి ఉంటుంది. దుబారా వ్యయం, పొగడ్తలకు లొంగుట, ఆవేశపడుట, సమయస్ఫూర్తి కలిగి ఉంటారు. చక్కని సంపాదన ఉంటుంది. కంటి జబ్బులు, గుండె జబ్బులు, వడదెబ్బకు గురి అగుట వంటి శారీరక అవస్థలకు గురి ఔతుంటారు. పిత్త ప్రకృతి కలిగి ఉంటారు. సూర్యుడు ఆత్మకు, తండ్రికి, శక్తికి, అగ్నికి, ప్రతాపానికి, ఆకాశము, దిక్కు తూర్పు, దేశాధిపత్యములకు కారకత్వము వహిస్తాడు. ముళ్ళ చెట్లకు, పంటలలో మిరియాలు, మిరపకాయలు, కొబ్బరి, వాము, బియ్యం మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు. శివ భక్తులు, శివ పూజ, శివాలయాలకు కారకత్వం వహిస్తాడు, జంతువులలో సింహం, ఎలుగుబంటి, గుర్రము, సర్పములకు కారకత్వం వహిస్తాడు. పక్షులలో కాకి కోకిల, కోడి, హంసలకు కారకత్వం వహిస్తాడు. వృత్తులలో ప్రభుత్వ కార్యాలయాలు, హృదయ సంబంధిత మందులు, వైద్యులు, రిజర్వ్ బ్యాంక్ సంబంధిత వృత్తులకు కారకత్వం వహిస్తాడు. ఆకాశ సంబంధిత విమానాలు, విమానాశ్రయము, ఖ్హగోళము, వాతావరణము, విమాన చోదకులు, విద్యుత్ సంబంధిత బ్యాటరీలు, విద్యుత్తు ఉత్పత్తి, భూకంపాలు, ఆకాశ వాణి, దూరదర్శన్వంటి ప్రసార సంబంధిత మాద్యమ వృత్తులు, విద్యుత్తు ఉపకరణ సంబంధిత వృత్తులకు కారకత్వం వహిస్తాడు. సూర్యుడు మేష రాశి 10 డిగ్రీలలో ఉచ్ఛ స్థితిని పొందుతాడు. సిం,హరాశిలో 20 డిగ్రీల వద్ద రాజ్యా స్థితిని పొందుతాడు. సింహం సూర్యునికి స్వక్షేత్రం మరియు మూల త్రికోణ క్షేత్రం. సూర్యుడికి కుంభరాశి, మకర రాశి శత్రు క్షేత్రాలు, కాగా కన్యా రాశి, మిధున రాశి సమ క్షేత్రాలు. మీనం మిత్ర క్షేత్రం. వృశ్చిక, ధనస్సు, మకరాలు విషమ క్షేత్రాలు. సూర్యుడికి గురువు, చంద్రుడు, కుజుడు మిత్ర గ్రహాలు. శుక్రుడు, శని శత్రు గ్రహాలు. బుధుడు నైసర్గిక బలం కలిగిన గ్రహం. వ్యధా గ్రహం శుక్రుడే. లగ్నం లో సూర్యుడు ఉన్న అల్పకేశములు కలిగి ఉంటాడు. పొడగరి, గర్వి, అల్పదృష్టి, ఉద్రేకి, క్రూరహృదయుడు, నిర్గుణుడు, నిన్న మాటకే రోషం కలిగిన వాడు, ప్రచంఢస్వభావి ఔతాడు. కటకలగ్నజాతకులకు లగ్నంలో రవి ఉంటే కన్నులలో పూవు పూయువాడు, మేషలగ్న జ్ఞాతకులకు లగ్నంలో రవి ఉంటే నేత్రవ్యాధిపీడితుడు, సింహలగ్నజాతకులకు లగ్నంలో రవి ఉన్న రేచీకటి కలిగిన వాడు, తులాలగ్న జాతకులకు లగ్నంలో రవి ఉంటే దారిద్యపీడితుడు, సంతాన నష్టం కలిగిస్తాడు.

ద్వితీయంలో రవి ఉన్న జాతకుడు నిర్ధనుడు, విద్యావినయం లేని వాడు, దుర్వచనాలు పలికేవాడు ఔతాడు.

తృతీయంలో రవి ఉన్న జాతకుడు బలవంతుడు, ధనవంతుడు, ధైర్యవంతుడు ఉదారుడు ఔతాడు. అప్తుల ఎడల ద్వేషం కలిగి ఉంటాడు.

చతుర్ధస్థానంలో రవి ఉన్న ఎడల బంధుహీనుడు, సుఖహీనుడు, క్షేత్రహీనుడు అంటే భూసంబంధిత సంపద లేని వాడు, స్నేహనుడు, గృహహీనుడు ఔతాడు. పిత్రార్జితం ఖర్చు చేయవాడు. ప్రభుత్వం ఉద్యోగి ఔతాడు.

పంచమస్థానంలో రవి ఉన్న జాతకుడు సుఖపుత్రహీనుడు, అల్పాయుష్మంతుడు, జ్ఞాని, అరణ్యప్రదేశములందు తిరుగువాడు ఔతాడు.

ష్టమ స్థానమున రవి ఉన్న జాతకుడు రాజు, ఖ్యాతివంతుడు, ధనవంతుడు, విజయవంతుడు ఔతాడు.

సప్తమ స్థానమున రవి ఉన్న జాతకుడు ఆధిక్యభావము కలిగిన కళత్రం కలిగిన వాడు ఔతాడు. భాగస్వాముల ఆధిక్యత కలిగి ఉంటాడు.

అష్టమ స్థానమున రవి ఉన్న జాతకుడు ఆస్తిని పోగొట్టుకొనుట, అల్పాయుషు కలిగి ఉండుట, దృష్టి లోపం కలిగి ఉన్న వాడు ఔతాడు.

నవమ స్థానమున రవి ఉన్న జాతకుడు తండ్రి లేని వాడు, బంధువులు, మిత్రులు, పుత్రులు కలవాడు ఔతాడు.

దశమస్థానంలో రవి ఉన్న జాతకుడు పుత్రులు కలవాడు, వాహనము కలవాడు, భాగ్యవంతుడు, కీర్తి యశస్సు కలవాడు, ప్రభువు కాగలడు.

రవి లాభస్థానమున ఉన్న జాతకుడు బహుధనవంతుడు, శోకములు లేని వాడు ఔతాడు.

ద్వాదశమున రవి ఉన్న జాతకుడు పితృద్వేషి, నిర్ధనుడు, దోషదృష్టి కలవాడు, పుత్రులు లేని వాడు ఔతాడు....మీ... చింతా గోపీ శర్మ సిద్ధాంతి*

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS