Monday, January 4, 2021

అభిజిత్ లగ్నం అంటే ఏమిటి.!!?

 అభిజిత్ లగ్నం అంటే ఏమిటి.!!? 



అహస్సు 60 ఘడియలు 24 గంటలున్నప్పుడు 30 ముహుర్తముల వ్యవస్థ ఏర్పడును... 

అంటే ఒకొక్క ముహూర్తము రెండు ఘటికలు అనగా నలభై ఎనిమిది నిమిషాల ప్రమాణము.... 

పగలు ఎనిమిదవ ముుహూర్తము "అభిజిత్ ముహుర్తము"అని దీనినే "విజయ ముహుర్తము"అని కొందరి అభిప్రాయము.... 


"అష్టమే దివస స్వార్దేత్వభిజిత్ సంజ్ఞకఃక్షణం"


మధ్యాహ్నము గం!! 11:45 ని!! నుండి గం!!12:30ని!! వరకు అభిజిత్ ముహుర్తము అని అంటారు.... 


నారద పురాణం ప్రకారం మధ్యాహ్నం 

గం!!12:00లకు పూర్వము ఒక ఘడియ తరువాత ఒక ఘడియ అనగా ఉదయం గం!!11:36 ని!! నుండి మధ్యాహ్నం గం!!12:24 ని!! వరకు అభిజిన్ముహుర్తము.... 


ఈప్రకారముగ సూర్యోదయం నుండి నాల్గవ లగ్నం అభిజిత్ లగ్నము అభిజిత్ కాలము సుదర్శన చక్రము వలే సర్వ దోషములను నశింపజేస్తుందని చెప్పబడినది.... 


"దిన మధ్య గతే సూర్యే ముహుర్తే హ్యాభిజిత్ ప్రభు! చక్రమాదాయ గోవిందః సర్వాన్ దోషాన్ నికృన్తతి" !!


కానీ బుధవారము అభిజిత్ నింద్యము

దక్షిణ దిశకు ప్రయాణం చేయరాదు.... 

"అభిజిన్ని బుధే శస్తం యామ్యంతం గమనే తథా"

నారద సంహిత తొమ్మిదవ అద్యాయం దివారాత్రి ముహుర్త విచారణ అందలి ఆరవ శ్లోకము.. 


శ్లో!!పౌరాణికా రౌద్ర సిత మైత్ర వారభవాఃక్షణాః

సావిత్రవైరాజికాఖ్యో గంధర్వాశ్చష్టమోభిజిత్!!


!!తాత్పర్యము!! 

పౌరాణికుల మతము నందు దివా ముహుర్తములు ఈ విధముగా చెప్పిరి..... 

రౌద్ర,సిత,మైత్ర,సూర్య,సావిత్ర,వైరాజిక, గంధర్వ,అభిజిత్ అని ఎనిమిదవ ముహుర్తమే కుతపకాలమని చెప్పిరి.... 


తరువాత పదవ శ్లోకము నందు నక్షత్రాధిపతులు ముహుర్తములలో శుభకాములు చేయవచ్చని చెప్పుచున్నారు.... 


శ్లో!!అభిజిద్భలయుక్తాస్తే సర్వ కార్యేషు సిద్ధిదాః!

ఏషు చుక్షేషు యత్కర్మ కథితం నిఖిలం చయత్!!

తదైవత్యే తన్ముహుర్తే కార్యే యాత్రాధికం సదా!!


!!తాత్పర్యము!! 

దినమందు ఎనిదవ ముహుర్తమగు అభిజిత్ ముహుర్తము మిక్కిలి బలమైనది మరియు సకల కార్యములను చేయునది అగుచున్నది.... 

అని చెప్పిరి ఆయా నక్షత్రములయందు విధింపబడిన ఆయా కార్యములు చేయుట కుదరక పోయినచో ఆ నక్షత్రమునకు తగిన ముహుర్తమున ఆ కార్యమును చేయవచ్చని చెప్పిరి.... 


!!వశిష్ఠ సంహిత!! 

వివాహాధ్యాయంలో రెండు వందల ఇరవై ఆరవ శ్లోకము

శ్లో!!మధ్యం దినగతే భానౌ ముహుర్తో2భిజిదాహ్వయః!

యో అష్టమః సర్వదోషఘ్నస్త్వం 

థకారంయథా రవిః!!


!!తాత్పర్యము!! 

సూర్యుడు 

ఆకాశ మధ్య భాగములో వచ్చినప్పుడు అభిజిత్ ముహుర్తమంటారు... 

ఇది రోజులో ఎనిమిదవ ముహుర్తము,సూర్యుడు ఏ విధముగా నైతే చీకటిని నశింపచేయునో అలాగే అభిత్ ముహూర్తం సర్వ దోషములను నశింపజేయును.... 


శ్లో!!సూర్యచ్ఛతుర్థం యల్లగ్నమభిజిత్సంజ్ఞకం యతత్!

సర్వ దోషం నిహంత్యాశు,పినాకే త్రిపురం యథా!!


!!తాత్పర్యము!! 

సూర్యోదయమునుండి నాల్గవ ముహుర్తము అభిజిత్ ముహుర్తము అందురు.... 

పినాకపాణి త్రిపురాసురున్ని నశింపజేసినట్టు ఈ లగ్నము కూడ సర్వ దోషములను నశింజేయును... 


శ్లో!!సర్వదేశేష్విదం ముఖ్యం సర్వ వర్ణేషు సర్వదా!

సర్వ దోష హరః యద్వద్ధరిత్యక్షర ద్వయమ్!!


!!తాత్పర్యము!! 

శ్రీ హరి నామ స్మరణ ఏ విధముగా దోషములను తొలగించునో అదేవిధముగా ఈ అభిజిత్ ముహుర్తము సర్వ దోషములు తొలగించును ఇది సమస్త దేశీయులకు,సమస్త వర్ణములవారికి ప్రశస్తమైనది.... 


!!ముహుర్త రత్నావళి!! 

యాత్రా ప్రకరణము నందు 

యాత్రాభిజిత్ త్ప్రాసస్త్యము అను అంశము నందు

శ్లో!!అష్టయోహ్యభిజి దాహ్వాయక్షజో!దక్షిణాభిముఖ యనమమతరా!!

కీర్తతో వరక కుప్సు సూరిభి!ర్యాయినామభిమతర్ష సాధనే!!


!!తాత్పర్యము!! 

యాత్రా సమయము నందు దక్షిణ దిక్కుకు తప్ప తక్కిన దిక్కులకు పగలు పదనాలుగు ఘడియల పిదప పదహారు ఘడియల వరకు అభిజిన్ముహుర్తము మిక్కిలి ప్రశస్తమైనదని ఇష్ట సిద్ధిని ఇచ్చునని శ్రీ పతి వచనము.... 


!!నారద సంహిత!! 

యాత్రా ప్రకరణ మందు

శ్లో!!అభిజిక్షణ యోగో యమ చేష్ఠా ఫల సిద్ధిదః!

పంచాంగ శుద్ధ రహితే దివసే అపి ఫలప్రదః!!


!!తాత్పర్యము!! 

యాత్రాకాలము నందు అభిజిత్ కాల మైనచో పంచాంగ శుధ్ధి లేనిదైనా శుభకరమే అగును... 


శ్లో!!అభిజిత్ సర్వ కార్యేషు ప్రశస్తం నాత్రోపనయనమ్!!


!!తాత్పర్యము!! 

అభిజిత్ ముహుర్తమందు అన్ని కార్యములకు ప్రశస్త్యం కాని ఉపనయనమునకు పనికిరాదు.... 


!!ముహుర్త వల్లరి!!

 

అనే సంకలన గ్రంధ మందు ఈ విధముగా కలదు

"అభిజిత్ సర్వ దోషఘ్నం" అనే వచనము ప్రయాణమునకు మాత్రమే వర్తించును.... 

మిగిలిన అన్ని శుభకార్యములకు దానిని వర్తింప జేయుట తగదు.... 


ఈ అభిజిత్ లగ్నము సర్వ దోషములను నశింపజేయును కాని వివాహం,ఉపనయనం,గర్భాధానము తప్ప మిగిలిన సర్వ శుభకార్యముల యందు ప్రశస్తమైనది అని మహర్షుల వాక్యము..... 

ఈ అభిజిత్ లగ్నము "అశేష దోషాపహరం" అని ఋషి వాక్యం... 

ఈ లగ్నం సుమారుగా మిట్ట మధ్యాహ్నము ఉండును ఈ లగ్నములో వివాహము చేసినచో నష్టము వాటిల్లునని బ్రహ్మ శపించునట్లు నారద సంహిత నందు గలదని వ్రాసినారు.... 


!! నారద సంహిత వివాహ ప్రకరణము నందు!! 

శ్లో!!చతుర్థ అభిజిల్లగ్నముదయరాక్షత్తు ఏప్తియమ్!

గోధూలికం తదుభయం వివాహేపుత్ర పౌత్ర దమ్!!


!!తాత్పర్యము!! 

సూర్యోదయము నుండి నాల్గవ లగ్నం అభిజిత్ ఏడవ లగ్నం గో ధూలి లగ్నం వీని యందు వివాహం చేసిన దంపతులు పుత్ర పౌత్రాభివృద్ధిగా నుండును.!! 


శ్లో!!ప్రాచ్యానాంచ కలింగానాం ముఖ్యం గోధూలికం స్మృతమ్!

అభిజిత్ సర్వదేశేషు ముఖ్యం దోష వినాశకృత్!!

🙏🙏🙏

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS