కలియుగములో దత్తావతారులుగా ఉన్నవారిలో
మధ్యముడుగా భావింపబడే మాణిక్య ప్రభువు ,
మిగిలిన నలుగురికి ఒక వారధిలాగా ఉంటారు .
దత్త పంచకంలో ' సమాధి ' వీరితోనే ప్రారంభమైనది .తల్లితండ్రులు ,పుట్టిన ప్రదేశాలు
వీరి తోనే అంతమవుతాయి .అక్కల్కోట మహరాజు ,షిర్డి సాయిబాబా లలో ఆ విషయాలు
తెలియవు .శ్రీపాద శ్రీవల్లభునకు ,నృశింహ సరస్వతి స్వాముల వారికి ముస్లింలతో సంబంధాలు అతి తక్కువ .మాణిక్య ప్రభువు ల
వారినుండి ముస్లిం సంబంధాలు పెరిగిపోతూ
చివరకి సాయిబాబా ముస్లిమా ? హిందువా ?
అనే సమస్యకూడా మొదలైనది .షిర్డి సాయి నాథునికి ,మాణిక్యప్రభువులవారికి అనేక పోలికలు కనిపిస్తాయి .మాణిక్య ప్రభువు
22 -12 -1817 సం .న జన్మించారు .వీరిద్దరూ
రోగులకు విచిత్ర చికిత్సలు చేశారు .కోరిన భక్తులకు సంతానమును ప్రసాదించారు .మూగ
జీవాలపై కరుణను చూపారు .తమ మహత్తును
తాము తెలుపుకోలేదు .సాయిబాబా మాణిక్య
ప్రభువును దర్శించారని ఒక గాధ ఉన్నది .
ఒకసారి మాణిక్యప్రభువులు దర్బారు చేస్తుండగా
సాయిబాబా ఒక లోటాను ఆయన ముందు ఉంచి
"ప్రభుజీ ! ఈ లోటా ను నింపండి ." అని బాబా అన్నారు .ఆ లోటాలో మణిక్యప్రభువు సోదరుడు
ఎంత ధనము వేసినాకూడా లోటా నిండలేదు .
అది గమనించిన మాణిక్యప్రభువు దివ్య దృష్టితో
సాయిబాబాను గుర్తించి " సాయీ ! తీసుకొండి "
అని రెండు ఎండు ఖర్జురములు ,కొన్ని పుష్పములు ఆ లోటాలో వుంచారు .ఆశ్చర్యము గా ఆ లోటా నిండినది .సాయిబాబా వాటిని
తీసుకుని ,ప్రభువులకు వందనం చేసి నిష్క్రమించారు .అవతారములన్నియు ఒకటే .
No comments:
Post a Comment