బియ్యపు గింజలపై భగవద్గీత..
అద్భుత కళానైపుణ్యం....
బియ్యపు గింజలపై భగవద్గీత 18 అధ్యాయాల్లోని 700 శ్లోకాలను 4,042 బియ్యపు గింజల పై రాశారు. మొత్తం 36,378 అక్షరాలతో కూడిన 9,839 పదాలను రాయడానికి 150 గంటల సమయం..
ఇంతటి అద్భుతమైన శోక్షాలను పాతబస్తీ గాలిపురా డివిజన్ పటేల్ నగర్‌కు చెందిన సూక్ష్మ కళాకారిణి రామగిరి స్వారిక 700 శ్లోకాలను బియ్యం గింజలపై అక్షరాలను అణిముత్యాలుగా తీర్చిదిద్దారు.
ఈ పేరు రామగిరి స్వారిక (మైక్రో ఆర్టిస్ట్). ఈమె ఎల్‌ఎల్‌బి ఫైనల్ ఇయర్ చదువుతోంది. భారతదేశంలో మొదటి యువ మహిళా మైక్రో ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు.
మూడేళ్ల క్రితం బియ్యపు గింజలపై ఆంగ్ల అక్షరమాల రాసినందుకు గాను అత్యత్తుమ సూక్ష్మ కళాకారిణిగా అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆమె గుర్తింపు పొందారు.
గతేడాది నార్త్ దిల్లీ కల్చరల్ అసోసియేషన్ స్వారికకు రాష్ట్రీయ పురస్కార్‌ను ప్రదానం చేసింది. వెయ్యికి పైగా సూక్ష్మ చిత్రాలను గీసిన అనుభవం. భవిష్యత్ ల్లో మరీన్ని ఉత్తమ కళాప్రదర్శనలు చేయాలని, ప్రతిష్టాత్మకమైన సన్మాన,సత్కార్యలు పొందాలని కోరుతున్నాం..
No comments:
Post a Comment