కొత్త ఇంటి నిర్మాణంలో ఎక్కువగా స్తంభాలు, గోడల మధ్య, కాలమ్స్ - గోడలు కలిసే చోట, దర్వాజాలు - గోడల మధ్య పగుళ్లు ఏర్పడుతుంటాయి. దగ్గరుండి ప్రతిరోజు నీళ్లు పోసి క్యూరింగ్ చేసినా కొన్నిసార్లు పగుళ్లు కనిపిస్తుంటాయి. చాలా మందికి ఇంటి నిర్మాణం మొదటిసారి కావడంతో అవగాహన లేక పూర్తిగా మేస్త్రీపై ఆధారపడటంతో ఇలాంటి లోపాలకు దారి తీస్తుంటాయని సివిల్ ఇంజినీర్లు అంటున్నారు. పగుళ్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలిలా...
* ఇంటికి సరైన ఇసుక ఎంపిక కీలకమే
నదుల నుంచి తీసుకొచ్చే ఇసుకను కడిగి ఉపయోగించుకుంటే అందులో ఉండే నల్లటి బంకమట్టి పోతుంది. పగుళ్లకు ఆస్కారం ఉండదు.
* ఇసుక స్థానంలో రాతిఇసుక వాడుతున్న సందర్భంలో ప్రామాణికమైన సర్టిఫైడ్ ఇసుక వాడాలి. మూమూలు రకం వాటిలో ఎక్కువ శాతం డస్ట్ కలపడంతో నాణ్యత లేక కొద్ది రోజులకే గోడలు పగుళ్లు వస్తున్నాయి.
* క్యూరింగ్‌కు సాధ్యమైనంత వరకు మంచినీళ్లే ఉపయోగించాలి. గోడల క్యూరింగ్ పూర్తయిన వెంటనే కాకుండా కొంత వ్యవధి ఇచ్చి ప్లాస్టరింగ్ చేసుకోవడం మంచిది.
* మార్కెట్లో పగుళ్ల నివారణకు రసాయనాలు అందుబాటులోకి వచ్చాయి. నిర్మాణ సమయంలో అందులో సూచించిన మేర మాత్రమే సిమెంట్ మిశ్రమంలో కలుపుకోవడం ద్వారా చిన్నచిన్న లోపాలతో పగుళ్లు రాకుండా చూసుకోవచ్చు.
* నైపుణ్యం కలిగిన మేస్త్రీని పనిలో పెట్టుకుంటే పగుళ్లు రావడానికి కారణమైన 90 శాతం సమస్యలు అసలు ఉత్పన్నమే కావని ఇంజినీర్లు చెబుతున్నారు.
* వాతావరణానికి తగ్గట్టుగా క్యూరింగ్ చేయాలి. తడి ఆరకుండా చూసుకోవాలి. అందుకు కొన్నిసార్లు మూడుసార్లకు మించి కూడా నీళ్లు పట్టాలి. సిమెంట్ మిశ్రమంలో వేడి ఉంటుంది. ఇది బయటకు రాకుండా ఎప్పటికప్పుడు నీళ్లు కొడుతూ చల్లబరుస్తుండాలి. 14 రోజుల పాటు తడి ఆరకుండా చూసుకోవాలి. ఈ లోపు నిర్మాణానికి దృఢత్వం సంతరించుకుంటుంది. పగుళ్లు రావడానికి అవకాశం ఉండదు.
* ప్రస్తుతం మనం స్తంభాలు వేసి తర్వాత గోడలు కడుతున్నాం. సాధారణంగా గోడలు, స్తంభాలు, శ్లాబు కలిసే కలిసేచోట ఎండాకాలం, చలికాలంలో సంకోచ వ్యాకోచాలతో పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఈ రెండు కలిసేచోట అటుఇటు రెండేసీ అంగుళాల మేర గోడకు, స్తంభానికి పై నుంచి కింద వరకు పల్చటి ఇనుపజాలి కొట్టాలి. దీనిపై రెండుదశల్లో ప్లాస్టరింగ్ చేయాలి. ఎండాకాలం, చలికాలంలో సంకోచ వ్యాకోచాలు ఏర్పడితే సర్దుబాటు అవుతుంది తప్ప పగుళ్లు రావు. పెద్ద నిర్మాణ సంస్థలు ఈ పద్ధతినే అనుసరిస్తున్నాయి.
* గోడలు కట్టేప్పుడు స్తంభాలు, కాలమ్స్, స్లాబుకు సిమెంట్ మిశ్రమం పట్టేలా ముందుగా అక్కడ గరుకుగా చేయాలి. దీనికి సిమెంట్ కొట్టాక ఇటుకలు పెడితే గట్టిదనం వస్తుంది
గోడలు పగుళ్లు ఏర్పడతే పితృ దోషం కింద పరిగణిస్తారు.
No comments:
Post a Comment