ఇందు లగ్నం
కాళిదాసు తన ఉత్తర కాలా మృతం గ్రంధం నాలుగవ అధ్యాయం లో 27 వ శ్లోకం లో ధన యెాగం గురించి ఓక పద్ధతి చెప్పినాడు. ఈ విశేష విధానం ఇతర గ్రంథాలలో కానరాదు. ఈ విధానం ద్వారా ధన యెాగం వుందా లేదా ఉంటే ఏ దశ లో ధనయెాగం ఫలించును అన్న విషయం తెలుసుకోవడానికి ఉపయెాగ పడును. ఇందు లగ్నం కనుగు విధానం : ఈ విధానం లో గ్రహము లకు కొన్ని కళలలు అపాదించ బడినవి. రవి కి 30 కళలు చంద్రుడు కి 16 కళలు, కుజడు కి 6 కళలు, బుధుడు కి 8 కళలు, గురువు కి 10 కళలు, శుక్రుడు కి 12 కళలు, శని కి 1 కళలు. ఛాయ గ్రహములు యైన రాహు మరియు కేతువు లకు కళలు కేటాయించ లేదు. ఇందు లగ్నం కనుగొను విధానం : లగ్నాత్ భాగ్యధిపతి ఎవ్వరూ అని తెలుసు కోని వాటికి కేటాయించిన కళలు కనుగోన వలెను. అదే విధముగా చంద్ర లగ్నాత్ భాగ్యధిపతి కళలు కనుగోన వలేను. ఈ రెండింటి కళలు కలిపి 12 చేత భాగహారం చేసి శేషం కనుగోని చంద్రాత్ అన్నవ స్థానం ఇందు లగ్నం అగును. ఇందు లగ్నం లో శుభ గ్రహ స్థితి లేదా వీక్షణ కలిగి వుంటే మంచి ధనయెాగం కలిగివుండుట, పాప గ్రహం స్థితి లేదా వీక్షణ వుంటే సామాన్య ధన యెాగం కలిగివుండును. ఇందు లగ్నం కు కోణములలో శుభ గ్రహములు ఉండినా అమిత ధన యెాగం, పాప గ్రహములు వుండిన సామాన్య ధన యెాగం. ఉదాహరణ కు నందమూరి రామారావు గారి జాతకం లో లగ్నం తుల చంద్ర రాశి తుల. లగ్నం నుండి భాగ్యధిపతి, బుధుడు .బుధుడు యెక్క కళలు 8 అటులనే చంద్ర రాశి భాగ్యధిపతి బుధుడు అయ్యేను. బుధుని కళలు 8 ఈ రెండు కళలు కూడిన 16 అగును. దానిని 12 చేత భాగాహారం చేసిన శేషం నాలుగు వచ్చును. కావున చంద్రుడు నుంచి 4 వ స్థానం మకరం అయ్యేను. మకరం కు అధిపతి శని, శని ఇందు లగ్నం కు కోణ స్థితి లో కలడు. శని మహదశ లో సినీరంగం లో ప్రవేశం మరియు ధనార్జన కలిగేను. ఓక వేళ ఇందు లగ్నం యెక్క శేషం సున్నా అయితే చంద్రాత్ 12 వ రాశి ఇందు లగ్నం అగును.
మీ మిత్రుడు యస్.నాగేశ్వరశర్మ(ప్రకాష్)
No comments:
Post a Comment