Tuesday, January 5, 2021

గవ్వలని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం.

 గవ్వలని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. మరి మన ఇళ్లల్లో దేవుడి గూటిలో కూడా ఉంటాయి, వీటిని ఆటల్లో బాగా వాడతారు, దీపావళి సమయంలో గవ్వలతో ఆటలు ఆడతారు, పెద్ద పెద్ద గవ్వలు ఇంటిలో అలంకరణలకు వాడతారు.



అయితే గవ్వలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కొత్తగా కొన్న వాహానాలకు నల్లని తాడుతో గవ్వలని కట్టి దృష్టిదోషం లేకుండా చేసుకునే సంప్రదాయం ఉంది.

ఇక కొత్త ఇంటిలోకి వెళ్లినా గృహప్రవేశం చేసినా ఎక్కడో ఓచోట ఈశాన్యం వైపు కాకుండా గవ్వలు దారంతో తగిలించినా దండ కట్టినా మంచిది.

అలా చేయటం వలన గృహాంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే.


కుంకుమ పసుపుతో గవ్వలను దేవుడి దగ్గర శుక్రవారం పెట్టి పూజిస్తే ధనానికి ఇబ్బంది ఉండదు, ఇక వ్యాపారులు క్యాష్ కౌంటర్లో గవ్వలు వేసుకుంటే వారికి ధనానికి ఇబ్బంది ఉండదు.

మీరు వ్యాపార పనుల మీద బయటకు వెళ్లిన సమయంలో మీ బ్యాగులో గవ్వ పెట్టుకుంటే ఏపని అయినా సక్సెస్ అవుతుంది..


పిల్లలకి దృష్టిదోష నివారణకు గవ్వలను వారి మెడలోగాని,మొలతాడులోగాని కడతారు..

ఇక గవ్వలని మట్టిలో కప్పకూడదు, నిప్పుల్లో వేడి చేసి రంగుల కోసం ప్రయత్నం చేయకూడదు, దాని స్వభావం దాని రూపం మార్చకుండా వాడాలి, తెల్లగవ్వలు చాలా మంచివి

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS