ద్వాదశరాశులకు ఆధిపత్య గ్రహములు
1. మేష లగ్నమునకు : లగ్న అష్టమాధిపతి కుజుడు, ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు, తృతీయ షష్టాదిపతి బుధుడు, చతుర్దాదిపతి చంద్రుడు, పంచమాదిపతి రవి, నవమ వ్యయాధిపతి గురువు, దశమ లాభాధిపతి శని.
2. వృషభ లగ్నమునకు : లగ్నషష్టాధిపతి శుక్రుడు, ద్వితీయ పంచమాధిపతి బుధుడు, తృతీయాధిపతి చంద్రుడు, చతుర్దాధిపతి రవి, సప్తమవ్యయాధిపతి కుజుడు, అష్టమ లాభాధిపతి గురువు, నవమ దశమాధిపతి శని!
3. మిధున లగ్నమునకు : లగ్న చతుర్ధాదిపతి బుధుడు, ద్వితీయాధిపతి చంద్రుడు, తృతీయాధిపతి రవి, పంచమ వ్యయాధిపతి శుక్రుడు, షష్టలాభాధిపతి సప్తమ దశమాధిపతి గురుడు, అష్టమ నవమాధిపతి శని!
4. కర్కాటకలగ్నమునకు : లగ్నాధిపతి చంద్రుడు, ద్వితీయాధిపతి రవి, తృతీయవ్యాయాధిపతి బుధుడు, చతుర్ధ లాభాధిపతి శుక్రుడు, పంచమ ధశమాధిపతి కుజుడు, షష్టభాగ్యాధిపతి గురువు, సప్తమ వ్యయాధిపతి శని!
5. సింహ లగ్నమునకు : లగ్నాధిపతి రవి, ద్వితీయ లభాదిపతి బుధుడు, తృతీయ ధశమాధిపతి శుక్రుడు, చతుర్ధ భాగ్యాధిపతి కుజుడు, పంచమ అష్టమాధిపతి గురువు, షష్ట సప్తమాధిపతి శని, వ్యయాధిపతి చన్ద్రుదు.
6. కన్యా లగ్నమునకు : లగ్న దశమాధిపతి బుధుడు, ద్వితీయ భాగ్యదిపతి శుక్రుడు, తృతీయ అష్టమాధిపతి కుజుడు, చతుర్ధ సప్తమాధిపతి గురువు, పంచమ షష్టధిపతి శని, లాభాధిపతి చంద్రుడు, వ్యయాధిపతి రవి.
7. తులా లగ్నమునకు : లగ్న అష్టమాధిపతి శుక్రుడు, ద్వితీయ సప్తమాధిపతి కుజుడు, తృతీయ షష్టధిపతి గురువు, చతుర్ధ పంచమా ధిపతి శని, నవమ వ్యయాధిపతి బుధుడు, దశమాదిపతి చంద్రుడు, లాభాధిపతి రవి!
8. వృశ్చిక లగ్నమునకు : లగ్నషష్టాధిపతి కుజుడు, ద్వితీయ పంచమాధిపతి గురువు, తృతీయ చతుర్ధధిపతి శని, సప్తమ వ్యయధిపతి శుక్రుడు, అష్టమ లాభాధిపతి బుధుడు, నవమాధిపతి చంద్రుడు దశమాదిపతి రవి!
9. ధనుర్లగ్నమునకు : లగ్న చతుర్ధాదిపతి గురువు, ద్వితీయ తృతీయధిపతి శని, పంచమ వ్యయాధిపతి కుజుడు, షష్ట లాభాధిపతి శుక్రుడు, సప్తమ దశమాధిపతి బుధుడు, అష్టమాధిపతి చంద్రుడు, నవమాధిపతి రవి!
10. మకర లగ్నమునకు :లగ్న ద్వితీయాధిపతి శని, తృతీయ వ్యయాధిపతి గురువు, చతుర్ధ లాభాధిపతి కుజుడు,
పంచమ దశమాదిపతి శుక్రుడు, షష్ట నవమాధిపతి బుధుడు, సప్తమాధిపతి చంద్రుడు, అష్టమాధిపతి రవి!
11. కుంభ లగ్నమునకు : లగ్న వ్యయాధిపతి శని, ద్వితీయ లాభాధిపతి గురువు, తృతీయ ధశమాధిపతి కుజుడు, చతుర్ధ భాగ్యాధిపతి శుక్రుడు, పంచమ అష్టమాధిపతి బుధుడు, షష్టాధిపతి చంద్రుడు, సప్తమాధిపతి రవి!
12. మీన లగ్నమునకు : లగ్న దశమాదిపతి గురువు, ద్వితీయ నవమాధిపతి కుజుడు, తృతీయ అష్టమాధిపతి శుక్రుడు, చతుర్ధ సప్తమాధిపతి బుధుడు, పంచమాధిపతి చంద్రుడు, షష్టాధిపతి రవి, లాభవ్యయాధిపతి శని!
ద్వాదశ లగ్నములకు శుభ - పాప గ్రహములు
1. మేష లగ్నమునకు రవి, గురులు శుభులు! బుధ, శుక్ర, శనులు పాపులు!!
2. వృషభ లగ్నమునకు రవి, శనులు, శుభులు! చంద్ర, గురు, శుక్రులు పపులు!!
3. మిధున లగ్నమునకు శుక్రుడు మాత్రమే శుభుడు! రవి, కుజ, గురు, శనులు పాపులు!!
4. కర్కాటక లగ్నమునకు కుజ, గురులు శుభులు! బుధ, శుక్రులు పాపులు!!
5. సింహ లగ్నమునకు కుజుడు మాత్రమే శుభుడు!బుధ, శుక్రులు పాపులు!!
6. కన్యా లగ్నమునకు శుక్రుడు మాత్రమే శుభుడు! చంద్ర, కుజ, గురు పాపులు!!
7. తులా లగ్నమునకు బుధ, శనులు శుభులు! రవి, కుజ, గురులు పాపులు!!
8. వృశ్చిక లగ్నమునకు గురువు మాత్రమే శుభుడు! బుధ, శుక్ర, శనులు పాపులు!!
9. ధనుర్లగ్నమునకు రవి, కుజులు శుభులు! బుధ, గురులు కూడా కొన్ని సందర్బములలో మంచివారు! శుక్రుడు పాపి!!
10. మకర లగ్నమునకు బుధ, శుక్రులు శుభులు! చంద్ర, కుజ, గురులు పాపులు!!
11. కుంభ లగ్నమునకు శుక్రుడు మాత్రమే శుభుడు!చంద్ర, కుజ, గురులు పాపులు!!
12. మీన లగ్నమునకు చంద్ర, కుజలు శుభులు! రవి, బుధ, శుక్ర, శనులు పాపులు!!
13. లగ్నము వలన, ఆత్మ సంభంధమైన విషయములను, జాతకుని అనూహ్య కర్మలను తెలియధగియున్నది.
14. చంద్ర లగ్నమువలన జాతకుడు తెలిసిజేయు కర్మలను, వాటి ఫలితములను గుర్తించవలెను.
15. నవాంశలగ్నముల వల్ల జాతకుని పూర్వజన్మ కర్మలకు సంభందించిన ఫలితములు తెలియధగియున్నది.
16. జన్మలగ్నము జాతకుని దేహస్థితి, అంగసోష్ట వము, శారీరక సుఖములను ధెల్పును.
17. చంద్రలగ్నము మనో ధర్మములను, మానసిక స్థితి గతులను ధెల్పును.
18. అంశలగ్నము శరీరచ్చయా, అంతర్గత స్వభావములను తెల్పును.
19. లగ్నాధిపతి శుభుడై 5-9 స్థానములందు, పాపియై 1-4-7-10 స్థానములందు యున్న యెడల - జాతకునికి శుభ ఫలితములు ప్రాప్తించగలవు.
20. 3-11 స్థానములలో లగ్నాధిపతియున్న - సామాన్య శుభ ఫలితములు కల్గును.
21. 2-6-8-12 స్థానములలో లగ్నాధిపతి యున్న అశుభ ఫలితములు నివ్వగలడు.
మీ మిత్రుడు యస్ నాగేశ్వర శర్మ (ప్రకాష్)
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment