Monday, January 4, 2021

#ప్రపంచానికిభారతీయులుగామనంఅందించినకాలగణన

 #ప్రపంచానికిభారతీయులుగామనంఅందించినకాలగణన



కొద్దిగా పెద్ద పోస్ట్. మనకు ఉగాది మాత్రమే కొత్త సంవత్సరం. జనవరి 1 ఎందుకు కాదు అని తెలుసుకోవటానికి చదవండి. నచ్చితే నిర్మొహమాటంగా "SHARE" చేయండి.


#హైందవపురాణాల ప్రకారం #విశ్వమంతాగోళాకారం.

 

విశ్వమంతా గోళాకారంలో ఉన్నపుడు 360 డిగ్రీలకంటే మించిన కోణం ఉండే సావకాశం లేదని గుర్తించిన మన భారతీయ బుుషులు 12 విభాగాలు చేశారు. ఒక్కో విభాగానికి 30 డిగ్రీలు (కోణం) కలిగినపుడు, దీనిని ఒక రాశి అన్నారు. ఆ రాశుల పేర్లు కూడా మన నుండి కాపీ కొట్టినట్టుగానే వుంటాయి.


1. మేషం 

2. వృషభం 

3. మిథునం 

4. కర్కాటకం 

5. సింహం 

6.  కన్య 

7. తుల 

8.  వృశ్చికం 

9. ధనుస్సు 

10. మకరం 

11. కుంభం 

12. మీనం .

ప్రతి రాసి 30 డిగ్రీలు (కోణం) x 12 = 360 డిగ్రీలు


1. మనం ఉన్న స్థలంనుండి (భూగోళం)  గ్రహాలను పరిశీలిస్తే ఏ కోణంలో కనబడుతుందో, దానిని బట్టి, (ఆ కోణంలో) ఆ రాశిలో ఫలానా గ్రహం సంచరిస్తోందని గుర్తిస్తూ, గ్రహగతులను గణిస్తున్నారు. వీటిని బట్టే నెలలు ఏర్పడుతున్నాయి.


2. ఇలా సూర్యుడు 360 డిగ్రీలు (కోణాలు) (అంటే 12 రాశులలో) సంచరించగా ఒక సంవత్సరం పూర్తి అవుతుంది. 


🌞 సూర్యగతిని బట్టి  : సంవత్సరాలు

🌙 చంద్రగతిని బట్టి  : రోజులు 


వీటిని సమన్వయ పరుస్తూ కాలాన్ని కొలుస్తారు .


3. సంచరించేటపుడు, ఒక రాశిని దాటడానికి గ్రహాలకు పట్టే కాలం – 


  --> సూర్యుడు : 30 రోజులు 

  --> చంద్రుడు  : 2 1/2 రోజులు 

  -->  కుజుడు   : 11 న్నర రోజులు 

  -->  బుధుడు  : ఒక నెల 

  -->  గురువు   : ఒక సంవత్సరం 

  -->  శుక్రుడు   : ఒక నెల 

  -->  శని         : రెండున్నర సంవత్సరాలు 

  -->  రాహు కేతువులు : ఒకటిన్నర సంవత్సరాలు

 

ఒక రాశినుండి, పై రాశిలోకి మారే కాలాన్ని సంక్రమణం అంటారు.


4. గ్రహ సంచారాల వల్ల మారే స్థితులను బట్టి, మనుష్య జీవనంలో కలిగే ఫలితాలను ప్రభావితం చేసేందుకు ఆ నాటి, ఆ నెల, సంవత్సరపు స్థితిలో మేలు, కీడు చేయగలిగిన గ్రహాలనూ, కాలాలనూ గుర్తించారు. గ్రహము మనకు కనబడితే ఉదయించి నదనీ, కనబడకపోతే అస్తమించి నదనీ అంటారు.


5. మనిషికి పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు.

   దీనిలో సగభాగం 60. కాబట్టి అరవై ఏళ్ళు నిండాయంటే,

ఆ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం పూర్తి అయినట్లు లెక్క. (ఈ తరువాత ఆధ్యాత్మిక జీవితమే తరువాయి అని గుర్తు. దీనికోసమే షష్టి పూర్తి ఉత్సవం చేసి, పిల్లలకు బాధ్యతలు ఆప్పగించి, వాసనప్రస్థులవుతారు)

 

6. కాబట్టి, పుట్టినప్పటినుండి 60 సంవత్సరాలను లెక్కించేందుకై, ప్రతిసంవత్సరాన్ని ఒక నామంతో వ్యవహారం చేయడం భారతీయుల విశేషత.

 

7. అబ్దం అనగా సంవత్సరమే. సంవత్సర గణనంలో మరో ముఖ్యమైన కొలబద్ద యుగాలు. ఒక ముఖ్యమైన ఘటన, లేదా పుణ్యపురుషుడి జన్మను బట్టి, ఆయా శకాలను గణిస్తారు. ప్రస్తుతం కలియుగ ప్రారంభాన్ని బట్టి కలియుగాబ్దాలు, శాలివాహన చక్రవర్తి కాలాన్ని బట్టి శాలివాహన శకం, శంకరాచార్య శకం ఇలా రకరకాలుగా గణనం లోక వ్యవహారంలో ఉన్నది. 


ఇదే విధానాన్ని మన దగ్గర చాకచక్యంగా తస్కరించి కొత్తగా పేర్లు మార్చి చెబుతుంటారు. అయితే అందులో పరిపూర్ణత్వం వుండదు. వారి తెలివి భూమి బల్లపరుపు అన్న చందాన వుంటుంది అనేది వాస్తవం. 


ఈ ప్రపంచ మానవాళికి మనం పెట్టిన భిక్ష ఈ ఙ్ఞానం. అయితే వారి గుడ్డి లెక్కల ప్రకారం జనవరి 1 కొత్త సంవత్సరం. అది కేవలం క్యాలండర్ సంవత్సరం మాత్రమే. కనుక వారి ప్రభావం భారిన పడి మన తోటి భారతీయులు కొట్టుకుపోకుండా చూసుకొనవలసిన బాధ్యత మనందరిపై వుంది.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS