అష్టదిక్పాలకులుఎవరు ? వారిపేర్లు ఏమిటి ?
అష్టదిక్కులు- దిక్పాలకులు:-
మనకు నాలుగుదిక్కులు ఉన్నాయికదా
తూర్పు- సూర్యుడు ఉదయించే దిక్కు,
పడమర- సూర్యుడుఅస్తమించే దిక్కు,
దక్షిణం - సూర్యునివైపు తిరిగి నించుంటేకుడి ,
ఉత్తరం -సూర్యునివైపు తిరిగి నుంచుంటే ఎడమ .
అలాగే నాలుగుమూలలు ఆ నై వా ఈ అనేది కొండగుర్తు ఆనై అంటే తమిళంలో ఏనుగు,వాయి అంటేనోరు ఆనైవాయి అంటే ఏనుగునోరు అన్నమాట అలా మనం మూలలు వరసలో గుర్తుపెట్టుకో వచ్చు తూర్పునుండి లెక్కిస్తే
1. ఆగ్నేయం
2. నైరుతి
3. వాయువ్యం
4. ఈశాన్యం
ఈ ఎనిమిదిదిక్కులకు ఎనిమిది మందిదేవతలు అధికారులు
వాళ్ల వివరాలు
1. ఇంద్రుడు - తూర్పుదిక్కు
ఇతని భార్యపేరు శచీదేవి, ఇతని పట్టణం అమరావతి, అతని వాహనం ఐరావతం, వీరి ఆయుధం వజ్రాయుధము
2. అగ్ని - ఆగ్నేయమూల
ఇతని భార్యపేరు స్వాహాదేవి, ఇతని పట్టణం తేజోవతి, అతని వాహనం తగరు, వీరి ఆయుధం శక్తిఆయుధము
3. యముడు - దక్షిణదిక్కు
ఇతని భార్యపేరు శ్యామలాదేవి, ఇతని పట్టణం సంయమిని, అతని వాహనం మహిషము, వీరి ఆయుధం దండకము
4. నైఋతి - నైఋతిమూల
ఇతని భార్యపేరు దీర్ఘాదేవి, ఇతని పట్టణం కృష్ణాంగన, అతని వాహనం గుఱ్ఱము, వీరి ఆయుధం కుంతము
5. వరుణుడు - పడమరదిక్కు
ఇతని భార్యపేరు కాళికాదేవి, ఇతని పట్టణం శ్రద్ధావతి, అతని వాహనం మొసలి, వీరి ఆయుధం పాశము
6 వాయువు వాయువ్యమూల
ఇతని భార్యపేరు అంజనాదేవి, ఇతని పట్టణం నంధవతి, అతని వాహనం లేడి, వీరి ఆయుధం ధ్వజము
7. కుబేరుడు - ఉత్తరదిక్కు
ఇతని భార్యపేరు చిత్రరేఖాదేవి, ఇతని పట్టణం అలక,
అతని వాహనం నరుడు,
వీరి ఆయుధం ఖడ్గము.
8 ఈశాన్యుడు- ఈశాన్యమూల
ఇతని భార్యపేరు పార్వతీదేవి, ఇతని పట్టణం యశోవతి, అతని వాహనం వృషభము, వీరి ఆయుధం త్రిశూలము
No comments:
Post a Comment