ఆలయంలో ఎలా మసలుకోవాలి?, ఏం చేయాలి?, ఏం చేయకూడదు? ఇలా ఎన్నో…. అయితే మరి ఆలయంలో ఏం చేయకూడదు ఈ విషయం లోకి వస్తే… వరాహపురాణంలో పరిష్కారం చూపించడం జరిగింది. దానిలో ఉన్న వాటి ప్రకారం ఏమి చేయకూడదు అనే వాటిని ఇక్కడ పొందుపరచడం జరిగింది.
1 . స్త్రీలతో పరిహాసంగా మాట్లాడడం చేయకూడ
2. గుడిలోకి వెళ్ళేటప్పుడు చెప్పుల్ని వేసుకోకూడదు.
3. రెండు చేతులతో మాత్రమే నమస్కరించాలి. దేవుడిని ఒక చేతితో నమస్కరించకూడదు.
4. అలానే దైవ దర్శనానికి వెళ్లినప్పుడు దర్శనం అయిపోయిన తరువాత గుడిలో కాసేపు కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు భగవంతునికి ఎదురుగా కాళ్ళు జాపడం, వీపును భగవంతుని వైపు పెట్టడం చేయకూడదు.
5. ఒకవేళ ఆలయంలో నిద్రపోవాలసి వస్తే భగవంతుడు ఎదురుగా పడుకోకూడదు.
6. ఆలయ ప్రాంగణంలో ఏడవడం, దెబ్బలాడడం చేయకూడదు. ఇతరులను నిందించకూడదు. 7. జడలో పెట్టుకునే పుష్పాలను దైవానికి సమర్పించడం చేయకూడదు.
8. గట్టిగా గంట మోగించ కూడదు.
9. ఆరగింపు కాని పదార్థాలను ఆలయంలో తినకూడదు.
10. నేనేం చేస్తానో చూడు అని బెదిరించడం లాంటివి చేయకూడదు. అలానే ఆలయ మండపంలో భోజనం కూడా చేయరాదు.
ఆలయంలో కనుక ఇలాంటి పనులు చేస్తే భగవంతుడు సేవించినప్పుడు పుణ్యం దక్కకపోవడం మాత్రమే కాదు పాపం కలుగుతుంది అని వరాహ పురాణం చెబుతోంది
No comments:
Post a Comment