శుక్రుడు : -
భృగు ప్రజాపతికిని ఉషనలకు మన్మథ నామ సంవత్సరం శ్రావణ శుద్ద దశమి రోజున
"ఉశనుడు" జన్మించెను. కుచేలుని ధనమును హరించుటచే పరమేశ్వరుడు కోపించి అతడిని చంపుటకు రాగా ఉశనుడు తన యోగ శక్తితో శివుని ఉదరమున ప్రవేశించెను. పరమేశ్వరుడు అతడినొ శిశ్నము ద్వార బయటకు విడిచెను అతడు శుక్రము రూపమున విసర్జింపబడెను కనుక అతడిని "శుక్రుడు" అనెదరు. అత్యంత మహా మంత్ర శక్తిని పోందినవాడు. శుక్రుడిని రాక్షసులు వారి గురువుగా పొందిరి నాటి నుండి "శుక్రచార్యునిగా" పెరుపొందెను. గ్రహమండలమున స్థానంపొందెను. భృగుపుత్రుడు, విష్ణుద్వేషి. స్త్రీగ్రహం. రుచులలో పులుపుకు ప్రతీక, తెలుపు వర్ణాన్ని సూచిస్తాడు. జాతి -బ్రాహణ, అధి దేవత - ఇంద్రాణి. ఏడు సంవత్సరాల వయసును సూచిస్తాడు. మనోహర శరీరం, నల్లని జుట్టు, సౌందర్యవంతులకు ప్రతీక. శ్లేష్మ, వాత ప్రకృతిని సూచిస్తాడు. తత్వము - జలతత్వం, దిక్కు -ఆగ్నేయము, రత్నము - వజ్రము, లోహము -వెండి, ఋతువు -వసంతం, దిక్బలం చతుర్ధ స్థానం, గుణము - రజోగుణము, ప్రదేశం - కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతం. శుక్రుడు భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ నక్షత్రాలకు అధిపతి. శరీరంలో సంతానోత్పత్తి వ్యవస్థ. వృషభం, తులా రాశులకు ఆధిపత్యం వహిస్తాడు. రవి, చంద్రులు శత్రువులు. శని, బుధులు మిత్రులు. కుజుడు, గురువులు సములు. శుక్ర దశా కాలం ఇరవై సంవత్సరాలు. శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితిని, కన్య రాశిలో నీచ స్థితిని పొందుతాడు.శుక్రుడు (ఆంగ్లంలో వీనస్) సౌరమండలము లోని ఒక గ్రహం, సూర్యునికి దగ్గరలో ఉన్న రెండవ గ్రహం. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల గ్రహాల్లోకెల్లా అత్యంత వేడిని కలిగియున్న గ్రహం ఇది. అంతే కాకుండా అష్టగ్రహాల్లోకెల్లా అత్యంత ప్రకాశవంతమైంది కూడా. దీనికి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి పట్టే కాలం 224.7 భూదినములు. రాత్రివేళ చంద్రుడి తరువాత మనకంటికి మెరుస్తూ కనబడే గ్రహం. దీనికి ఉదయతార అని సంధ్యాతార అని కూడా వ్యవహరిస్తారు. దీనికి ఉపగ్రహాలు లేవు. శుక్రుడు, భూమి అనేక విషయాలలో సారూప్యత కలిగిన కారణంగా వీటికి "సోదర గ్రహాలు" అని కూడా అంటారు. గర్భాశయ వ్యాధులు, మూత్ర పిండ వ్యాధులు, సుఖ వ్యాధులు మొదలైన వాటికి కారకుడు. కుజుడితో కలిసిన గొంతు నొప్పి, టాన్సిల్స్, గొంతు కాన్సర్, గొంతు వాపు మొదలైనవి కలుగుతాయి. బుధుడితో కలిసిన నపుంసకత్వం, చర్మ వ్యాధులు, మధుమేహం, శనితో కలిసిన సుఖ వ్యాధులు, రాహువుతో కలిసిన గర్భ సంబంధిత వ్యాధులు, కేతువుతో కలిసిన సంతాన లేమి మొదలైన వ్యాధులు కలుగుతాయి.
శుక్రుడు లగ్నంలో ఉన్న జాతకుడు ఆరోగ్యవంతుడు, సుందరశరీరం కలిగిన వాడు, సుఖజీవి, చిరంజీవి ఔతడు. శుక్రుడు ద్వితీయస్థానమున ఉన్న బహువిధములుగా సంపదలు కలవాడు, కవి ఔతాడు. తృతీయముస్థానమున శుకృడు ఉన్న జాతకుడు భార్యాహీనుడు, కష్టవంతుడు, బీదవాడు, దుఃఖవంతుడు, అపకీత్రి కలవాడు ఔతాడు. చతుర్ధస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు వానములు కలవాడు, మంచిగృహం కలవాడు, నగలు, వస్త్రములు, సుగంధద్రవ్యములు కలవాడు ఔతాడు. పంచమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు అపారధనవంతుడు, ఇతరులను రక్షించు వాడు, బహుమేధావి, పుత్రులు కలవాడు ఔతాడు. షష్టమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు శతృవులు లేని వాడు, ధనమును లేని వాడు, యువతుల చేత వంచింపబడిన వాడు, విచారగ్రస్తుడు ఔతాడు. సప్తమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు మంచి కళత్రం ఉన్న వాడు, పరస్త్రీ ఆసక్తుడు, కళత్రం లేని వాడు, ధనవంతుడు ఔతాడు. అష్టమ స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు చిరంజీవి, ధనవంతుడు, రాజు ఔతాడు. నవమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు భార్యాబిడ్డలు, సంతానం, ఆప్తులు కలిగి రాజాశ్రయం కలిగి అభివృద్ధి చెందుతూ ఉంటాడు. దశమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు ప్రఖ్యాతి కలిగినవాడు, మిత్రులు కలిగిన వాడు, ప్రభువు ఔతాడు. ఏకాదశ స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు పరస్త్రీ లోలుడు, బహు సుఖవంతుడు ఔతాడు. ద్వాదశము స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు దేవతలతో సమానమైన సౌఖ్యవంతుడు, ధనవంతుడూ ఔతాడు.....మీ... చింతా గోపీ శర్మ సిద్ధాంతి*
No comments:
Post a Comment