పంచమహాపురుష యోగములు
ఈ అయిదు యోగములు కుజ, ఉధ, గురు, శుక్ర, శని, గ్రహములవలన కలుగును.
ఆ యోగములు. 1) రుచిక మహాపురుష యోగము, 2) భద్ర మహాపుష యోగము,
3)హంసమహా పురుష యోగము, 4) మాళవ మహాపురుష యొగము
5) శశ మహాపురుష యొగము. పైన చెప్పిన అయుదు గ్రహములు,
కేంద్రములందునడవలెను. అట్లు కాక ఆ రాశులు, ఆయా గ్రహములకు,
స్వ, ఉచ్చ, క్షేత్రములై ఉండవలెను. సకల బలములు గలిగి ఉండవలయును.
రుచిక మహాపురుష యోగ జాతకులు,ధైర్య సాహసములుచెసి, ధనము సంపాదించెదరు
బలవంతులు, శత్రువులను జయించు వారు అగుదుగురు, సేనానాయకులు కాగలరు.
భద్ర మహాపురుష యోగ జాతకులు,సంపూర్ణ ఆయుష్షు విద్యాధికుడు పరులచే
ప్రశంసించబడిన వాడు బుద్ధిమంతుడు అగును.
హంసం మహాపురుష జాతకులు, మంచి గుణములు కలిగి, రాజ సమానులు,సుందరాకారము
కలిగి, చెతులలొ, శంఖ చక్ర, పద్మ ముద్రలు, గలిగి ఉందురు. భొజన ప్రియులు, ధార్మికులు అగును.
మాళవ్య మహాపురుష యోగజాతకులు దృధమైన శరీరము వాహనములు,ధనము,
భార్యా సంతానము, అదృష్ఠము మొదలగు శుభ లక్షణములు కలవాడగును.
శశ మహాపురుష యొగమున జన్మించిన వారు, సర్వజనములకు ప్రియుడు, గ్రామ పెద్ద,
సెనాని, అగును కాని ఇట్టివారు, వ్యసనములు కలిగి, పరధన భోగి, అగును.
ఈ అయుదు యోగములు రాజప్రదములు, ఉన్నతొద్యోగములు కలుగును.
ఇందులో ఏ ఒకటి రెందు కలిసినను మహారాజ యోగము పట్టును.
ఈ అయుదు యొగములు శాస్త్రమున ఉన్ననూ ఇవన్నియూ జరగవు,
శాస్త్రమున సూచించిన ఇట్టి కొన్ని గ్రహముల ఉనికి కలిగినను,
కొన్ని మినహాయింపులు ఉన్ననూ కొన్ని గ్రహముల కలయికవలన కొంతవరకూ
ఈ యొగములు కలుగును. ఇట్టి జాతకులు కొంతమంది కలరు.
మీ మిత్రుడు యస్.నాగేశ్వశర్మ(ప్రకాష్).
No comments:
Post a Comment