Monday, January 4, 2021

మైసూర్ సాండల్ సబ్బు భారతీయ చరిత్రలో అంతర్భాగం

 మైసూర్ సాండల్ సబ్బు భారతీయ చరిత్రలో అంతర్భాగం. మన వారసత్వ సంపదకు నిదర్శనం. వందేళ్ల క్రితం నుంచి తయారవుతున్న ఈ సోప్​లకు భారతీయుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గంధం వాసనతో మైసూర్ సాండల్ అద్భుమైన సువాసనలు వెదజల్లుతుంది. అనేక ఫ్రాగ్రెన్స్​లో వినియోగదారులకు అందుబాటులో ఉంటోంది. అయితే మైసూర్ సాండల్ ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.




1916 మేలో మైసూరు మహారాజు రాజా వడియార్​, మైసూర్ దివాన్​ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. ప్రభుత్వ గంధపు ఆయిల్ ఫ్యాక్టరీని మైసూర్​లో నెలకొల్పారు.మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భారీ ఎత్తున మిగిలిపోయిన గంధపు చెక్కలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు


అప్పటికి గంధపు చెక్కల ఎగుమతుల్లో మైసూర్​ రాజ్యం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండేది.


రెండేళ్ల తర్వాత మహారాజుకు కొన్ని సోప్​లు బహుమతిగా వచ్చాయి. అప్పుడు మనం ఎందుకు సబ్బులు తయారు చేయకూడదని అనుకున్నారు. వెంటనే దివాన్ విశ్వేశ్వరయ్య​కు విషయం చెప్పారు. అప్పుడు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై ఒప్పందం చేసుకొని వెంటనే పనులు ప్రారంభించారు.


ప్రజలకు తక్కువ ధరలోనే నాణ్యమైన సబ్బులను అందించాలని విశ్వేశ్వరయ్య అనుకున్నారు. బాంబేలోని ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఐఐఎస్​సీ) నుంచి టెక్నికల్ ఎక్స్​పర్ట్స్​కు స్వాగతం పలికారు. యువ ప్రతిభావంతుడైన సోలే గరలపూరి శాస్త్రిని ఇంగ్లండ్ పంపి సబ్బుల తయారీ పరిశీలించి రావాలని పురమాయించారు. విశ్వేశ్వరయ్య కలను సాకారం చేయడంలో గరలపూరి ఎంతో కీలకపాత్ర పోషించారు.


ఎంతో వేగంగా బెంగళూరులోని కేఆర్ సర్కిల్​లో సోప్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి అదే ఏడాది మైసూర్ సాండల్ సబ్బులను ఉత్పత్తి చేశారు. మార్కెట్​లోకి వచ్చాక మైసూర్ శాండల్​కు విశేష ఆదరణ దక్కింది. దేశ వ్యాప్తంగా మంచి గిరాకీ వచ్చింది. 1944లో శివమొగ్గలో మరో యూనిట్​ను నెలకొల్పారు.ఆ తర్వాత సబ్బు రూపు, ప్యాంకింగ్​ను శాస్త్రి మరింత ఆకర్షణీయంగా చేశారు. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న సోప్ షేప్​ ను దీర్ఘ వృత్తాకారంలోకి ప్రత్యేకంగా మార్చారు. ప్యాంకింగ్ సైతం విభిన్నంగా, ఆకర్షణీయంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.


1980లో ప్రభుత్వ శాండల్ వుడ్​ ఆయిల్ ఫ్యాక్టరీకి కర్ణాటక సోప్స్​ అండ్ డిటర్జెంట్ లిమిడెట్​గా పేరు మార్చారు. 2006లో మైసూర్ సాండల్​ సోప్​, మైసూర్ శాండల్​వుడ్ ఆయిల్​కు జియో గ్రాఫికల్(జీఐ) ట్యాగ్​ వచ్చింది. 85 శాతం మైసూర్ శాండల్ సబ్బులు ప్రస్తుతం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడులోనే అమ్ముడవుతున్నాయి.


ఇక మైసూర్ శాండల్ సోప్​ లోగోకు సైతం ఎంతో ప్రత్యేకత ఉంది. సింహం శరీరం, ఏనుగు తలతో పురాణాల నేపథ్యంలో ఈ లోగో ఉంటుంది.


చెప్పాలంటే గజకేసరీ యోగం అని అటువంటి లోగో తయారు చేసి పెట్టారు

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS