Monday, January 4, 2021

తమలపాకు ప్రాముఖ్యత:-

 తమలపాకు ప్రాముఖ్యత:-



హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాల లో(1. పూలు 2. అక్షింతలు, 3. ఫలాలు,4,అద్దం, 5. వస్త్రం, 6. తమలపాకు మరియు వక్క ,7.దీపం, 8. కుంకుమ)  ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోక్షణ లు చేసేటప్పుడు తమలపాకుని వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు.పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం.  భారత దేశం లో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదల లోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు.


తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యం?

క్షీర సాగర మథనం లో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటని స్కాంద పురాణం లో చెప్పబడింది. శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని  చెబుతున్నాయి . తమలపాకు యొక్క మొదటి భాగం లో కీర్తి, చివరి భాగం లో ఆయువు, మధ్య భాగం లో లక్ష్మీదేవీ నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు.

 తమలపాకు లోని ఏయే భాగాలలో ఏ దేవతలు ఉంటారో తెలుసుకుందాం 

తమలపాకు పైభాగం లో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు.

సరస్వతీదేవి మధ్యభాగం లో ఉంటుంది.

తమలపాకు చివరలలో మహాలక్ష్మీ దేవి ఉంటుంది.

జ్యేష్టా దేవి తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన ఉంటుంది.

విష్ణుమూర్తి తమలపాకు లో ఉంటాడు.


శివుడు, కామదేవుడు తమలపాకు పైభాగం లో ఉంటారు.

తమలపాకు లోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగల్య దేవి ఉంటారు.


భూమాత తమలపాకుకి కుడిభాగం లో ఉంటుంది.

సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు అని శాస్త్రంలో ఉంది.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS