Tuesday, January 5, 2021

స్వాతి నక్షత్రం రోజున ఆవిర్భావం...

 స్వాతి నక్షత్రం రోజున ఆవిర్భావం...


హిరణ్యకశిపుడు సోదరుడి మరణానికి విష్ణువు పైన పగ తీర్చుకోవాలి అని బ్రహ్మకు తపస్సు చేసి మరణం లేకుండా వరం కోరుకుంటాడు, ఆ వరం ఇవ్వడం కుదరదు కనుక ఇంకేదైన వరం కోరుకోమని అజ్ఞాపిస్తారు బ్రహ్మ దేవుడు.. ఈ విధంగా కోరుకుంటాడు 


హిరణ్యకశిపుడు కోరిన వరం

1 గాలిలో మరణం లేకుండుట

2 నేలమీద మరణం లేకుండుట

3 నిప్పుతో మరణం లేకుండుట

4 నీటిలో మరణం లేకుండుట

5 ఆకాశంలో మరణం లేకుండుట

6 దిక్కులలో మరణం లేకుండుట

7 రాత్రి సమయంలో మరణం లేకుండుట

8 పగటి సమయంలో మరణం లేకుండుట

9 చీకట్లో మరణం లేకుండుట

10 వెలుగులో మరణం లేకుండుట

11 జంతువులచే మరణం లేకుండుట

12 జలజంతువులచే మరణం లేకుండుట

13 పాములచే మరణం లేకుండుట

14 రాక్షసులుతో యుద్ధంలోమరణం లేకుండుట

15 దేవతలుతో యుద్ధంలో మరణం లేకుండుట

16 మానవులు తో యుద్దంలో మరణం లేకుండుట

17 అస్త్రాలు వలన మరణం లేకుండుట

18 శస్త్రాలు వలన మరణం లేకుండుట

19 యుద్దాలలో ఎవరూ ఎదురు నిలువలేని శౌర్యం

20 లోకపాలకు లందరిని ఓడించుట

21 ముల్లోకాలమైన విజయం


దీని అర్ధం ఎక్కడా ఎవ్వరి చేత మరణం లేదు అనే అర్థం, ఒక విధంగా అమరుడు అయినట్టే కానీ తలరాతను రాసుకునే శక్తి సృటించ బడిన వాడికి లేదు సృష్టి చేసిన శక్తికే ఉంటుంది ఎంత తపస్సు చేసిన  అంత చిన్న సూక్ష్మ రహస్యం అర్తం కాలేదు కారణం అహంకారం అనే మాయ లో ఉండటం.


అతని కుమారుడు ప్రహ్లాదుడు తల్లి గర్బం నుండే హరి భక్తుడు ,ఎలా అయినా అతన్ని మార్చే ప్రయత్నం చేయాలి అని ఎన్నో విధాలుగా చెప్పి వినక పోయే సరికి పసి వాడు అని చూడకుండా ఎన్నో విధాలుగా కష్టాలు పెడతాడు హిరణ్యకశిపుడు ఆ పసి వాడు బాధతో భయంతో నారాయణ అని పిలిచినప్పుడల్లా తల్లి పేగు కదిలినట్టు ఎన్నోసార్లు ఆ నారాయణుడు ఉలిక్కిపడతాడు ఆ బిడ్డను ఎన్నో ఆపదల నుండి రక్షించగలడు కానీ అతనికి ఉన్న వరం వల్ల ఆ సమయంలోనే వదించాలి.


ఎన్నోసార్లు ప్రహ్లాదుడు నారాయణ అని పిలిచినప్పుడు ఆ సమయం  హిరణ్యకశిపుని వదించే ముహూర్తం కాదు, పగలు రాత్రి కానీ సంధ్య సమయంలో ప్రహ్లాదుడు పిలవాలి ఆ సమయం దాటక ముందే స్వామి అక్కడికి చేరుకోవాలి, చీకటి పడక ముందే సంహారం జరిగిపోవాలి, ఆ బిడ్డ పిలవడం, ఆ సమయం రెండూ ఆ వరానికి తగ్గ విధంగా కలిసి రావాలి ఆ క్షణం కోసం స్వామి ఎంతగానో ఎదురు చూస్తున్నారు , అతని క్రూరత్వం మరింతగా వికృతంగా మారుతున్న కొద్దీ అతని రాక్షసత్వం యొక్క పాపం పెరిగిపోతోంది స్వామి కి పట్టరాని ఆగ్రహం , ప్రహ్లాదుడు పైన మమకారం తో బాధ కలుగుతుంది. అతన్ని సంహరించాలి అంటే ఆ సమయం రావాలి చాలా కాలానికి అతని పాపం పండి అటువంటి సాయంసంధ్యా కాలంలో ఎక్కడ నీ హరి అని ప్రహ్లాదుని అడగటం ఎక్కడైనా ఉంటాడు నా స్వామి అని ప్రహ్లాదుడు అనడంతో వాడి పాపం వాడి నోటితో ఈ స్తంభమున చూపిస్తావ అని అడుగుతాడు, ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న స్వామి ఆ స్తంభమున పుడతాడు పగలు రాత్రి కాకూడదు సంధ్యా సమయం చిటి వెలుతురు కాదు పొద్దు వాలిన సమయం ఇంటా బయట కాకుండా గడప నింగి నెల కాకుండా స్వామి కాలిపైన పెట్టుకున్నారు ఆయుధం కాదు గోర్లుతో, మనిషి మృగం కాదు నరసింహం అవతారం లో ఎప్పటి నుండో దాచుకున్న కోపాన్ని ఒక్కసారిగా ఉగ్ర నరసింహ అవతారంలో చీల్చి చెండాలుతాడు..



సాధువులను స్త్రీలను, పసివాడు అయిన ప్రహ్లాదుడు ని ఎన్నో బాధలకు గురి చేస్తున్న ప్రతి సారి వారికన్నా ఎక్కువగా ఆ నారాయణుడే బాధను అనుభవిస్తారు కానీ ఆ తపస్సుకు ఆ వారానికి ఒక విలువ ఉంది భగవంతుడు అయినా ఆ కట్టుబాట్లు తప్పలేదు ఆ బాధ అనుభవించక తప్పలేదు ఎందరో పుణ్యాత్ములు బలి కాక తప్పలేదు. అలా పాపం చేయబట్టి అతని నోటితో అతని మరణ సమయంలో స్వామి ని పులిచేలా చేసుకున్నాడు. ఆ సమయం కోసం నారాయణుడు తపస్సే చేసాడు అంటే అంతలా నిరీక్షణ చేసాడు, చివరికి స్వాతి నక్షత్రం సంధ్యా కాలంలో అవిర్భవించాడు స్వామి. 


 ఎదైనా అది జరాల్సిన సమయంలో జరుగుతుంది, దాన్ని ఎవరూ ఆపలేరు. మనవల్ల కాని వాటిని కూడా కాలం సమాధానం చెప్తుంది ఓపికతో ఉండాలి...

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS