వాస్తు ప్రకారం ఏఏ చెట్ల ఏఏ దిశల్లో ఉండాలి.🌳
వాస్తు ప్రకారం చాలా మంది ఇళ్లు నిర్మించుకుంటారు, అయితే మొక్కల విషయంలో మాత్రం మంచి ఖాళీ స్దలం ఉంది కదా అని వేసేస్తారు, అయితే ఇక్కడ కొన్ని వాస్తు నియమాలు పాటించాలి అని చెబుతున్నారు, ముఖ్యంగా మొక్కల విషయంలో ఈ నియమాలు పాటిస్తే వాస్తు ఇబ్బందులు ఉండవు.
1. మీరు ఇంటి సింహ ద్వారానికి ఎదురుగా కాని, కిటికీల ప్రక్కన కాని చెట్లను పెంచకూడదు.
2.ఇంటికి తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ఎక్కువగా ఖాళీ స్థలం వదిలి మిగతా దిక్కుల్లో ఈ చెట్లను పెంచాలి.
3..తులసి మొక్కను తూర్పు ద్వారం ఇంటికి ఆగ్నేయ దిశలో పెంచాలి
4.. పడమర లేదా దక్షిణ వాకిళ్ల ఇళ్లలో తులసికోట గుమ్మానికి ఎదురుగా వుండాలి.
5..ఉత్తర ద్వారం వారి ఇంటికి వాయవ్యంలో తులసికోట వుండాలి.
6. ఇక తులసి కోట మొక్క విషయంలో ఈశాన్యంలో ఉంచకూడదు
7. ఉత్తర దిశలో కొబ్బరి, మామిడి, దానిమ్మ, బత్తాయ ఈ చెట్లు వేయకూడదు
8..మీకు ఆనవాయి ఉంటే అరటి చెట్టును దక్షిణ దిశలోనే వేసుకోవాలి.
9. కచ్చితంగా ఇంటికి నైరుతి దిశలో కొబ్బరి చెట్టు ఉండాలి
10..బాదం చెట్టును ఇంటి ఎదురుగా పెంచకూడదు.
11.తమలపాకుల మొక్కను దక్షిణ దిశలో ఇంట్లో పెంచటం శుభం
12.. దక్షిణంలో, పడమర, నైరుతి, ఆగ్నేయం, వాయవ్యంలో పూల కుండీలు వుంచవచ్చు
13..పాలు కారే చెట్లు, ముళ్ల చెట్లు, గోరింట, జువ్వి, చింత, మర్రి, కుంకుడు, ఇంటి ప్రహారీ లోపల వేయకూడదు, ఇంటి బయటపెంచుకోవచ్చు. ఇంటి వాస్తుకి సంబంధం లేకుండా ఉండాలి.
14.తూర్పు దిశలో రావిచెట్టు, పడమరలో మర్రి చెట్టు, ఉత్తరంలో మేడి చెట్టు, దక్షిణంలో జువ్విచెట్టును పెంచరాదు.
15..క్రోటన్ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచవచ్చు
16. తాటి తుమ్మ ఈత పైనాపిల్ ఇలాంటి చెట్లు ఇంట్లో పెంచకూడదు.
No comments:
Post a Comment