బోజనం చేసేటప్పుడు ఆహారంలో వెంట్రుకల కనిపిస్తూ ఉంటాయి.
ఎక్కువగా వెంట్రుకలు కనిపిస్తుంటే ఈ విషయాన్ని అంత సులభంగా వదలకూడదు. కుటుంబ సభ్యులు బోజనం చేసేటప్పుడు చాలాసార్లు జుట్టు వస్తుంటుంది. అది ఎక్కడ నుంచి వచ్చిందో ఎవరికి అంతుపట్టదు. ఇంట్లోనే కాదు వారు బయటకు వెళ్లి రెస్టారెంట్లు, హోటెళ్లో తినాల్సివచ్చినా ఆహారంలో వెంట్రుకలు వస్తాయి. కొన్ని సార్లు ఎదుటివారు ఎగతాళి చేస్తారు. ఈ విధంగా తరచూ జరుగుతూ ఉంటే మీ జాతకాన్ని ఓ సారి జ్యోతిష్కుడికి చూపించుకుంటే మంచిది. ఇల్లు ఎంత శుభ్రంగా, అందంగా ఉన్నప్పటికీ దుర్వాసన వస్తుందంటే ఆ విషయాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. అసలు చెడువాసన ఎక్కడ నుంచి వస్తుందో అర్థం కాదు. అసలు అక్కడ ఏమి లేకపోయినప్పటికీ చెడు వాసన వస్తుందని బయట నుంచి వచ్చిన వాళ్లు అంటుంటారు. ఈ విధంగా దుర్వాసన వస్తుందంటే పూర్వీకులకు కోపం వచ్చిందని అర్థం చేసుకోవాలి. పితృ దోషాలు వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు.
చనిపోయిన బంధువులు, పూర్వీకులు తరచూ కలలోకి వస్తున్నారని కొంతమంది చెబుతుంటారు. ఈ అంశాన్ని యాదృచ్ఛికమని చెప్పలేం. పూర్వీకుల గురించి పదేపదే కలలు కనడమంటే వారి కోరికలు ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయని కొంతమంది నమ్ముతుంటారు. ఒకవేళ మీకు కూడా ఈ విధంగా జరుగుతున్నట్లయితే చనిపోయిన మీ పూర్వీకులు, బంధువులకు ఇష్టమైన వస్తువులను అవసరమైన వారికి దానం చేస్తే మంచిది. మీరు కొన్ని శుభకార్యాలు చేయాలని తలపెట్టినప్పుడు వాటికి పదే పదే అవాంతరాలు ఎదురవుతున్నాయంటే కొద్దిగా దృష్టిపెట్టాలి. లేదా మీరు పని మధ్యలో ఉన్నప్పడు ఏవైనా సంఘటనలు జరిగితే పూర్వీకులు కోపంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. దీపావళి, హోళీ లాంటి పండుగులప్పుడు కొన్ని అపశకునాలు లేదా దుర్ఘటనలు జరిగుతున్నాయంటే అవి పితృ పక్షం వారి అసంతృప్తిని తెలియజేస్తుంది. ఒకవేళ మీకు ఎప్పుడైనా జరిగితే బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి గౌరవంగా ఆరాధించి భిక్ష ఇవ్వాలి. పై నియమాలను పాటించడం వలన ఇంట్లో అశుభాలు అపశకునాలు జరగకుండా ఉంటాయి.poorna mohan
No comments:
Post a Comment